News


నిఫ్టీలో షార్ట్స్‌.... టార్గెట్‌ 11800 పాయింట్లు!

Monday 18th November 2019
Markets_main1574060467.png-29672

ఫ్యూచర్స్‌ ప్రీమియంలో తరుగుదల
సోమవారం ఉదయం పాజిటివ్‌గా ఆరంభమైన మార్కెట్లు మధ్యాహ్న సమయానికి నెగిటివ్‌ జోన్‌లోకి జారాయి. నిఫ్టీ ఫ్యూచర్స్‌ ప్రీమియం శుక్రవారంతో పోలిస్తే దాదాపు పది పదిహేను పాయింట్లు తగ్గింది. నిఫ్టీ తన కీలక నిరోధాన్ని విజయవంతంగా దాటకపోవడం, ఫ్యూచర్స్‌ ప్రీమియం క్రమంగా తగ్గడం.. సూచీల్లో బలహీనతకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ ఫ్యూచర్స్‌, స్పాట్‌ మధ్య తేడా శుక్రవారం దాదాపు 40 పాయింట్లు ఉండగా, సోమవారం ఈ తేడా దాదాపు 30 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 11890 పాయింట్ల దిగువన షార్ట్‌ చేయవచ్చని సూచిస్తున్నారు. కొత్త షార్ట్స్‌కు 11800 పాయింట్లు టార్గెట్‌గా పేర్కొన్నారు. షార్ట్‌ పొజిషన్లకు స్టాప్‌లాస్‌గా 12వేల పాయింట్లను పెట్టుకోవచ్చని సూచించారు.

నిఫ్టీ 11800 పాయింట్లను కూడా నిలుపుకోలేకపోతే క్రమంగా 11700 పాయింట్ల వరకు జారిపోవచ్చని అంచనా వేస్తున్నారు. శుక్రవారం క్లోజింగ్‌ చార్టుల్లో నిఫ్టీ బేరిష్‌ రివర్సల్‌ ఫార్మేషన్‌ ఏర్పరిచింది. దీన్ని గ్రేవ్‌స్టోన్‌ డోజీ అంటారు. ఇందులో ఒపెనింగ్‌, క్లోజింగ్‌, లో దాదాపు సమానంగా ఉంటాయి. ఇలాంటి సంకేతం ట్రెండ్‌ రివర్సల్‌ను చూపుతుంటుంది. గరిష్ఠాల వద్ద బుల్స్‌నుంచి కొనుగోళ్ల మద్దతు అందకపోవడంతో సూచీలు పైస్థాయిల్లో నిలదొక్కుకోలేకపోతున్నాయి. నెలవారీ ఆప్షన్స్‌ చూస్తే 12వేల పాయింట్ల వద్ద కాల్స్‌, 11600 పాయింట్ల వద్ద పుట్స్‌ అధికంగా ఉన్నాయి. 12వేల పాయింట్ల వద్ద కాల్‌ రైటింగ్‌, 11900 పాయింట్ల వద్ద పుట్‌ రైటింగ్‌ కనిపిస్తోంది. నిఫ్టీకి 11879, 11973 స్థాయిలు కీలకంగా వ్యవహరించనున్నాయి. 


F&O

You may be interested

టాటా స్టీల్‌ 3 శాతం అప్‌!

Monday 18th November 2019

ప్రాథమిక స్టీల్‌ అయిన హెచ్‌ఆర్‌సీ(హాట్‌ రోల్డ్‌ కాయిల్‌) ధరలను టాటా స్టీల్‌ పెంచిన విషయం తెలిసిందే. దీంతో ‍వ్యవస్థలో స్టీల్‌కు డిమాండ్‌ పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా సోమవారం సెషన్‌లో మెటల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్‌ మధ్యాహ్నాం 12.58 సమయానికి  3.73 శాతం లాభపడి రూ. 409.20  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 394.50 వద్ద ముగిసిన ఈ షేరు, సోమవారం సెషన్‌లో రూ. 396.40

బ్రోకరేజిలు టార్గెట్‌ ధరను సవరించిన షేర్లివే

Monday 18th November 2019

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే బాగుండడంతోపాటు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడడంతో కొన్ని స్టాకుల టార్గెట్‌ ధరలను బ్రోకరేజ్‌లు పెం‍చాయి. అదే సమయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న కంపెనీల టార్గెట్‌ ధరలను తగ్గించాయి. సెప్టెంబర్‌ ఫలితాలు వెలువడిన తర్వాత, బ్రోకరేజిలు అధికంగా ఆస్తి నిర్వహణ కంపెనీలు, ఇన్సురెన్స్‌, హెల్త్‌కేర్‌ కంపెనీల టార్గెట్‌ ధరలు పెంచాయి. కానీ బ్యాంకింగ్‌, టెలికాం, హౌసింగ్‌ సెక్టార్లకు సంబంధించిన కంపెనీల టార్గెట్‌ ధరలను తగ్గించాయి. విశ్లేషకులు టార్గెట్‌ ధరలను అధికంగా

Most from this category