News


కనీసం రెండు రోజులు ఎక్చ్సేంజీలు మూసేయండి

Wednesday 25th March 2020
Markets_main1585106754.png-32659

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్స్చేంజ్‌లను కనీసం రెండు రోజుల పాటు మూసేయాలని స్టాక్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌, ఏఎన్‌ఎమ్‌ఐ మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీని కోరింది. దేశవ్యాప్తంగా దాదాపు 900కు పైగా స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలకు అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఎక్స్చేంజేస్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా(ఏఎన్‌ఎమ్‌ఐ)లో సభ్యత్వం ఉంది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయని, అయితే స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలను అత్యవసర సంస్థలుగా కొన్ని రాష్ట్రాలు గుర్తంచడం లేదని, దీంతో తమ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయని ఏఎన్‌ఎమ్‌ఐ పేర్కొంది. తమ ఉద్యోగులు సకాలంలో కార్యాలయాలకు హాజరు కాలేకపోతున్నారని, విధి నిర్వహణలో విఫలమవుతున్నారని వివరించింది. స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు రెండు రోజుల పాటు సెలవులు ఇస్తే, బ్రోకరేజ్‌ సంస్థలు మొత్తం అవుట్‌స్టాండింగ్‌ పొజిషన్లను స్క్వేరాఫ్‌ చేస్తాయని పేర్కొంది. కాగా సెబీ నియంత్రణలోని స్టాక్‌ మార్కెట్‌ సంస్థలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునివ్వాలని కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరింది. 
 



You may be interested

రియల్టీకి కరోనా కాటు

Wednesday 25th March 2020

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గృహ నిర్మాణాలు ఆలస్యం 8–10 శాతం తగ్గనున్న నిర్మాణ సంస్థల ఆదాయం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ రియల్టీ రంగం మీద కరోనా వైరస్‌ ప్రభావం పడింది. కోవిడ్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ఉన్న కారణంగా గృహాల అమ్మకాలు, నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని హౌజింగ్‌ బ్రోకరేజ్‌ అనరాక్‌ కన్సల్టెన్సీ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 15.62 లక్షలకు పైగా గృహాలు నిర్మాణంలో ఉన్నాయని, ఇవి  2013–19

కరోనా కల్లోలం: ఆర్థిక ఉపశమనం!

Wednesday 25th March 2020

పన్ను రిటర్నులు, జీఎస్‌టీ రిటర్నుల గడువు పొడిగింపు ఏ బ్యాంకు ఏటీఎం అయినా చార్జీ ఉండదు సేవింగ్స్‌ ఖాతా బ్యాలన్స్‌ చార్జీల ఎత్తివేత ఇన్‌సాల్వెన్సీ నిబంధనల సడలింపు న్యూఢిల్లీ: కోవిడ్‌-19 వైరస్‌ కారణంగా ప్రజలు, వ్యాపారస్థులు ఇళ్లకే పరిమితమవుతున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కారు ఉపశమన చర్యలను ప్రకటించింది. ఆదాయపన్ను రిటర్నులు, జీఎస్‌టీ రిటర్నుల దాఖలు గడువులను పెంచింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో లావాదేవీల చార్జీలు, బ్యాంకు ఖాతాల్లో బ్యాలన్స్‌ నిర్వహణ చార్జీలను మూడు

Most from this category