News


ఈ దశలో షేర్లను అమ్ముకోవడం సరికాదు: శాంక్టమ్‌ వెల్త్‌

Thursday 25th July 2019
Markets_main1564076598.png-27321

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులకు భయపడి షేర్లను విక్రయించినట్టయితే, మళ్లీ తిరిగి ప్రవేశించడం కష్టమవుతుందని, తదుపరి ర్యాలీని మిస్‌ కావాల్సి వస్తుందని శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీఐవో సునీల్‌ శర్మ అన్నారు. కరెక్షన్లు అన్నవి మార్కెట్లో సాధారణ ప్రక్రియలో భాగమేనని, ప్రతీ మూడేళ్లకోసారి 20 శాతం దిద్దుబాటు తప్పదన్నారు. ఈ మేరకు మార్కెట్‌పై ఓ వార్తా సంస్థతో అన అభిప్రాయాలను పంచుకున్నారు. 

 

మార్కెట్లో విక్రయాలకు ఎన్నో కారణాలు దారిశీతాయని సునీల్‌ శర్మ అన్నారు. బడ్జెట్‌ నిరాశ పరచడడం, ఎఫ్‌పీఐలపై అధిక ఆదాయ సర్‌చార్జీ, వినియోగదారులకు ప్రోత్సాహకాలు లేకపోవడం, బలహీన కార్పొరేట్‌ ఫలితాలు మార్కెట్‌ నష్టాలకు కారణాలుగా పేర్కొన్నారు. ప్రతీ కొన్ని త్రైమాసికాలకు ఓ మారు ఈ తరహా బాధ కలిగించే కరెక్షన్లు తప్పవన్నారు. 2011, 2013, 2015, 2016, 2018లో ఇదే పరిస్థితి కనిపించినట్టు చెప్పారు. ప్రతీ సారీ మార్కెట్లు కోలుకుని కొత్త గరిష్టాలకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి సందర్బాల్లో ఇన్వెస్టర్ల రాబడులు అన్నవి వారి అధ్యయనంపై ఆధారపడి ఉండవని, వారి ప్రవర్తనపైపే ఆధారపడి ఉంటాయన్నారు. ఎఫ్‌ఐఐలపై సర్‌చార్జీ తొలగింపునకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిరాకరించడమే అమ్మకాల ఒత్తిడికి దారితీసినట్టు సునీల్‌ శర్మ చెప్పారు. అయితే, ఇది త్వరలోనే తగ్గిపోతుందన్నారు. మార్కెట్లు కనిష్టాలకు చేరిన వెంటనే ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడులతో ముందుకు వస్తారని, తదుపరి ర్యాలీకి అదే చోదకంగా నిలుస్తుందన్నారు. 

 

జూన్‌ త్రైమాసికం ఫలితాలు గత మూడేళ్లలోనే దారుణంగా ఉన్నట్టు సునీల్‌ శర్మ చెప్పారు. ప్రాథమిక నివేదికల ఆధారంగా ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఉన్నట్టు తెలుస్తోందని, విడిగా కంపెనీలపై తాము వ్యాఖ్యానించబోమన్నారు. అయితే, కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. అంతర్జాతీయంగా ఒకే తరహాలో రేట్ల తగ్గింపు వాతావరణం నడుస్తోందని, ఆర్‌బీఐ కూడా ఇప్పటికే మూడు విడతలు రేట్లను తగ్గించిందని చెప్పారు. అయితే ఈ రేట్ల బదలాయింపునకు కొన్ని నెలలు తీసుకోవచ్చని, ఇది రుణ గ్రహీతలకు చేరే దశలో ఉన్నట్టు చె‍ప్పారు. తక్కువ ద్రవ్యోల్బణం వాతావరణంలో ఉన్నామని, దీంతో మన వాస్తవ రేట్లు ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నట్టు చెప్పారు. You may be interested

11250 దిగువన ప్రారంభమైన నిఫ్టీ

Friday 26th July 2019

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల నుడుమ శుక్రవారం దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నష్టంతో మొదలైంది. నిఫ్టీ ఇండెక్స్‌ తనకు సాంకేతికంగా కీలకమైన 11250 స్థాయి దిగువన 5 పాయింట్ల నష్టంతో 11,247.45 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 10 పాయింట్ల నష్టంతో 37820 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఫోర్డ్‌ మోటర్స్‌ కంపెనీతో సహా పలు ప్రధాన కంపెనీల క్యూ1 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోవడం, యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంక్‌ నిన్న

లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు ఎలా ఉంది..?

Thursday 25th July 2019

యాక్టివ్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి గతేడాది ఆశించిన రాబడులు లేకపోవడం అనుభవమయ్యే ఉంటుంది. యాక్టివ్‌గా నడిచే 31 లార్జ్‌క్యాప్‌ఫండ్స్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టీఆర్‌ఐ స్థాయిలో రాబడులను ఇవ్వలేకపోయాయి. మరి వీటిల్లో పెట్టుబడులు పెట్టడం సరైన నిర్ణయమేనా...? అన్న సందేహం ఇన్వెస్టర్లకు రావడం సహజం. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌, బీఎస్‌ఈ సెన్సెక్స్‌తో పోలిస్తే తక్కువ లేదా ప్రతికూల పనితీరు చూపించడం అన్నది స్థిరమైన ధోరణేనా..? నేడు చాలా మంది ఇన్వెస్టర్లు

Most from this category