News


పన్నురేట్లను తగ్గించినంత మాత్రాన డిమాండ్‌ పుంజుకోదు

Tuesday 29th October 2019
Markets_main1572335841.png-29206

-బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌, ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌, సంజయ్‌ మూకిమ్‌ 
‘సమీపకాలంలో డిమాండ్‌ పుంజుకోడానికి, ప్రభుత్వం కొత్తగా వ్యక్తిగత ఆదాయపు పన్నురేట్లను తగ్గిస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్‌ను తగ్గించడానికి ప్రభుత్వానికి చాలా తక్కువ అవకాశం ఉంది’ అని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ సంజయ్‌ మూకిమ్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. అంతేకాకుండా ఫైనాన్సియల్స్‌, ఇండస్ట్రీయల్స్‌, సిమెంట్‌ కంపెనీలపై పాజిటివ్‌గా ఉన్నానని అన్నారు.
డిమాండ్‌ పుంజుకోడానికి ట్యాక్స్‌ కట్‌ సరిపోదు...
ప్రభుత్వం తీసుకున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు చర్య ప్రభావం ఆర్థిక వ్యవస్థలో కనిపించడానికి ఇంకొంత సమయం పడుతుంది. ట్యాక్స్‌ను తగ్గించడం వలన కంపెనీలకు నిధుల లభ్యత పెరుగుతుంది. దీనిని తిరిగి ఇన్వెస్ట్‌ చేయడానికి లేదా షేరుహోల్డర్లకు డివిడెండుల రూపేణా పంచడానికి కంపెనీలకు అవకాశం ఉంటుంది. ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు, ఉద్దీపనను అందించడానికి ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా అవసరం. కంపెనీలు కూడా మూలధన వ్యయం పెంచే ముందు, వ్యవస్థలో డిమాండ్‌ వాతవరణం, వ్యవస్థలో పోటీ గురించి ఆలొచించుకోవలసి ఉంటుంది. 
   కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం వలన కంపెనీలకు కొత్త ప్రాజెక్టులపై ఐఆర్‌ఆర్‌(ఇంటర్నల్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌) పెరుగుతుంది. దీంతోపాటు నిధుల లభ్యత పెరగడంతో కంపెనీలు కొత్త ప్రాజెక్టులను చేపట్టే సామర్ధ్యం మెరుగవుతుంది. అంతర్గతంగా నిధుల లభ్యత అధికంగా ఉండడంతో ఇటువంటి కంపెనీలకు బ్యాంకులు రుణాలివ్వడానికి సిద్ధంగా ఉంటాయి. కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు చర్య ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 
   స్వల్పకాలంలో వ్యవస్థలో వినియోగాన్ని పెంచే చర్యలను ప్రభుత్వం ప్రకటించాలని మార్కెట్‌ వర్గాలు ఆశిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో కొన్ని విభాగాలలో డిమాండ్‌ ట్రెండ్‌ బలహీనపడింది. ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించింది కాబట్టి వ్యవస్థలో డిమాండ్‌ ట్రెండ్‌ రివర్స్‌ అవుతుందని చాలా మంది ఇన్వెస్టర్లు అంచనావేస్తున్నారు. కానీ ట్యాక్స్‌ తగ్గింపు చర్య వలన డిమాండ్‌ ట్రెండ్‌ రివర్స్‌ అవ్వదు. ఇది ఇన్వెస్టర్లను నిరుత్సాహాపరిచేదే. కానీ పండుగ సీజన్‌లో డిమాండ్‌ ట్రెండ్‌ మిశ్రమంగా ఉంది. వినియోగం ఏడాది ప్రాతిపదికన ప్లాట్‌గా ఉంది. ప్రతి ఏడాదీ పండుగ సీజన్‌, వ్యవస్థలో డిమాండ్‌ను పెంచుతుంది. ఆన్‌లైన్లో మాత్రం అమ్మకాలు  పెరిగాయి. ఈ అమ్మకాలు గరిష్ఠంగా టైర్‌ 2, టైర్‌ 3 నగరాలలో జరిగి ఉంటుంది. 

ప్రభుత్వానికి చాన్స్‌లేదు..
కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గక ముందునుంచే, ప్రభుత్వం ద్రవ్యలోటు సమస్యలను ఎదుర్కొంటుంది. పన్ను ఆదాయం అంచనాల కంటే తగ్గడంతో ప్రభుత్వం తన ఖర్చులను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఈ విధానాన్ని ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం ఖచ్చితంగా కొనసాగించవలసి ఉంటుంది. లాజికల్‌గా చెప్పాలంటే ప్రభుత్వం మరింతగా పన్నులను తగ్గించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ద్రవ్యలోటును పెంచుకోవాలనుకుంటే తప్ప కొత్తగా పన్ను తగ్గింపు చర్యలు ఉండవు. కానీ సమీప కాలంలో వ్యవస్థలో వినియోగం డిమాండ్‌ పెంచడానికి, ప్రభుత్వం వ్యక్తిగత పన్నులు తగ్గించడం లేదా కొన్ని విభాగాలలో జీఎస్‌టీ రేట్ల తగ్గించడం వంటి చర్యలను తీసుకుంటుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి చర్యలు తీసుకోవడానికి చాలా తక్కువగా అవకాశాలున్నాయి. ఆర్థిక సంవత్సరం 2020 బడ్జెట్‌లో కొత్తగా పన్నులను తగ్గించడానికి అవకాశాలు తక్కువగా ఉండడం, అమ్మకాలు గరిష్ఠంగా జరిగే సీజన్‌ పూర్తవ్వడంతో కొత్తగా పన్ను తగ్గింపు చర్యలుంటాయని అనుకోవడం లేదు. 

నిఫ్టీ ఈపీఎస్‌ బలహీనమే..
నిఫ్టీ ఈపీఎస్‌(షేరుపై లాభం) అంచనాలు మాత్రం బలహీనంగానే ఉన్నాయి. నిఫ్టీ ఈపీఎస్‌ డిసెంబర్‌ 2020లో రూ. 690 గా ఉంటుందని 2018లో​ అంచనావేశాం. ప్రస్తుతం పన్ను సంస్కరణలను కలుపుకున్న​ ఈ అంచనా రూ. 640 వద్దే ఉంది. మార్కెట్‌ ఈపీఎస్‌ అంచనాలు అప్‌గ్రేడ్‌ చేయడానికి పన్ను తగ్గింపు చర్య సరిపోదు. చాలా వరకు సందర్భాలలో  మార్కెట్‌ అంచనాలు కంపెనీల సామర్ధ్యంపై ఆధారపడి ఉండదు. దీనికి కేవలం మార్కెట్‌పై విశ్లేషకుల అంచనాలు అధికంగా ఉండడమే కారణం. చాలా వరకు కంపెనీలలో డౌన్‌గ్రేడ్స్‌ను మేము చూస్తున్నాం. ప్రస్తుత  పరిస్థితులలో ఫైనాన్సియల్స్‌, ఇండస్ట్రీయల్స్‌, సిమెంట్‌ కంపెనీలపై పాజిటివ్‌గా ఉన్నాం.

రుణదాతల ఒత్తిడి తగ్గాలంటే...
  రుణ దాతల (బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు) బ్యాలెన్స్‌ షీట్‌పై ఒత్తిడిని తగ్గించడానికి రెండు విస్తృత మార్గాలున్నాయి. మొదటిది ఒత్తిడిలో ఉన్న కంపెనీలు పుంజుకోవడం, వాటి రుణాలను తీర్చగలిగే సామర్ధ్యాన్ని సంపాదించడం లేదా ఒత్తిడిలో ఉన్న ఆస్తుల ద్వారా కోల్పోయిన నగదుకు సమానంగా నిధులను సమీకరించుకోవడం. వచ్చే కొన్ని నెలలలో సమస్యలలో చిక్కుకున్న ఆర్థిక సంస్థలు ఈ రెండు మార్గాలను ఉపయోగిస్తాయని అంచనావేస్తున్నా. ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్‌ తిరిగి సాధరణ స్థాయికి రావడానికి చాలా చర్యలను తీసుకోవాల్సి ఉంది. ఈ కంపెనీలలో ఏదైనా కంపెనీ తన బ్యాలెన్స్‌ షీట్‌ సమస్యలను తీర్చుకోలేకపోతే, రుణాలపై ఆందోళనలు మళ్లీ మార్కెట్లో పెరుగుతాయి. 

వినియోగం పుంజుకుంటోంది...
విస్తృతంగా గమనిస్తే..అన్ని రంగాలలో వినియోగం మందగమనంలో ఉందని అనుకోవడం లేదు. ఆటో రంగాన్ని మినహాయిస్తే ఇతర రంగాలలో వాల్యుమ్‌ల వృద్ధి ప్రతికూలంగా లేదు. ఏడాది ప్రాతిపదికన ప్రతి రంగంలోను వినియోగం వృద్ధి చెందుతోంది. విస్తృతమైన వినియోగ రంగంలోని కంపెనీలను గమనిస్తే, ప్రస్తుతం వాటి వాల్యుమ్‌ వృద్ధి రేటు వాటి దీర్ఘకాల సగటుతో సమానంగా ఉంది.
   గత ఏడాది అమ్మకాలు బాగుండడంతో ఈ ఏడాది అమ్మకాల వృద్ధిరేటు తగ్గింది. జీఎస్‌టీను 2017లో ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో సరఫరాలో నిల్వలను డీస్టాక్‌ చేయవలసి వచ్చింది. చాలా కంపెనీల వ్యాపారాలు ఆగిపోయాయి.  జీఎస్‌టీ నుంచి కోలుకోవడంతో 2018లో వ్యవస్థలో అమ్మకాలు పెరిగాయి. దీంతో పోల్చుకుంటే ప్రస్తుతం వృద్ధి  సంఖ్యలు తగ్గాయనే చెప్పవచ్చు. దీంతోపాటు వ్యవస్థలో ద్రవ్యోల్బణం కొద్ది మొత్తంలో పెరగడంతో కంపెనీల ఆదాయాలు బలహీనంగా ఉన్నాయి. చాలా వరకు కంపెనీల ఆదాయ వృద్ధి సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యింది. అమ్మకాల వృద్ధి తగ్గడం స్వల్పకాలంలో నిర్దిష్టమైన రంగాలలో వచ్చిన సమస్య మాత్రమే. 2018లో మంచి అమ్మకాల వృద్ధిని నమోదు చేసిన కంపెనీలు, ప్రస్తుతం సగటు వృద్ధిరేటును చూస్తున్నాయి. ఫలితంగా ఈ కంపెనీల నిల్వలు పెరుకుపోవడం చూస్తున్నాం. దీనిని పరిష్కారం ఏమిటంటే.. వ్యవస్థలో డిమాండ్‌ పుంజుకోవాలి లేదా కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించుకోవాలి. 



You may be interested

9 ట్రేడింగ్‌ సెషన్లలో యస్‌బ్యాంక్‌ 50 శాతం జంప్‌

Tuesday 29th October 2019

ప్రైవేట్‌ రంగానికి చెందిన యస్‌బ్యాంక్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో 9.50శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈలో నేటి ఉదయం ఈ షేర్లు రూ.54.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో షేర్లు 9.50శాతం లాభపడి రూ.59.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.1:30ని.లకు యస్‌ బ్యాంక్‌ షేర్లు క్రితం ముగింపు ధర(రూ.54.75)తో పోలిస్తే 7.50శాతం లాభపడి రూ.58.85 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

30,000 పాయింట్ల చేరువలో బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 29th October 2019

ఉదయం ట్రేడింగ్‌లో స్తబ్ధుగా సాగిన బ్యాంకు షేర్లలో మిడ్‌సెషన్‌ కల్లా కొనుగోళ్ల మద్దతు లభించింది. దాంతో ఈ సూచీ 30,000 పాయింట్ల స్థాయిని సమీపించింది.  నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 29,527.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంక్‌ రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒకదశలో అరశాతం (131 పాయింట్లు) నష్టపోయి 29385.45 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం అనూహ్యంగా బ్యాంకింగ్‌

Most from this category