News


కరోనాతో సమస్యలతోపాటు అవకాశాలూ ఉంటాయ్‌!

Thursday 27th February 2020
Markets_main1582796818.png-32144

నిఫ్టీ కంపెనీల లాభాలు 5 శాతం డౌన్‌
కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు లేకుంటే మరింత వీక్‌

- వినయ్‌ పండిట్‌, ఇండియానివేష్‌

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా దేశీ కంపెనీలకు ఓవైపు సమస్యలు ఎదురయ్యే అవకాశమున్నప్పటికీ మరోపక్క అవకాశాలు సైతం లభించే వీలున్నట్లు చెబుతున్నారు వినయ్‌ పండిట్‌. ఇండియానివేష్‌, ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ హెడ్‌ అయిన నివేష్‌ ఒక ఇంటర్వ్యూలో మార్కెట్ల ట్రెండ్‌, ఎల్‌ఐసీ లిస్టింగ్‌ తదితర పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

చైనా నుంచి సరఫరా అయ్యే మెటీరియల్స్‌కు కరోనా కారణంగా విఘాతం ఏర్పడనుంది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో ముడివ్యయాలు భారంకానుండగా,..  విదేశాలకు ఎగుమతులు పెరిగే అవకాశముంది. అయితే వేసవి మొదలయ్యాక కరోనా భయాలు తగ్గుముఖం పట్టవచ్చు. కాగా.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అధిక ప్రాధాన్యమిచ్చింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, రబీ, ఖరీఫ్‌ పంటల సాగు వంటి అంశాలు జీడీపీకి బలాన్నిచ్చే వీలుంది. దేశీయంగా ఆటో రంగం బీఎస్‌-6 ప్రమాణాలకు మారనున్న కారణంగా పుంజుకునే అవకాశముంది. ఈ అన్ని అంశాలూ ఆటో, ఫార్మా, వినియోగం, కెమికల్స్‌, అగ్రి ఇన్‌పుట్స్‌ వంటి రంగాలకు మేలు చేయవచ్చు. ధరలు దిగిరానుండగా.. పారిశ్రామికోత్పత్తి నెమ్మదిగా పుంజుకోనుంది. బడ్జెట్‌లో అంచనావేసినట్లు జీడీపీ 10 శాతం వృద్ధిని అందుకునే అవకాశాలున్నాయి. అయితే కంపెనీల ఫలితాలు సైతం వృద్ధిని ప్రతిఫలించవలసి ఉంటుంది.

చైనా ఎఫెక్ట్‌
చైనా నుంచి వినైల్‌ ఎసిటేట్‌, కార్బన్‌ బ్లాక్‌ దేశీయంగా దిగుమతవుతూ ఉంటాయి,. వీటి ధరలు పెరిగితే పెయింట్స్‌, టైర్‌ తయారీ పరిశ్రమలపై పడుతుంది. ఇదేవిధంగా రిఫ్రాక్టరీస్‌ సైతం 10 శాతం దిగుమవుతుంటాయి. ఇవి స్టీల్‌ పరిశ్రమకు భారంకావచ్చు. అయితే వీటిని దేశీయంగా తయారు చేసే కంపెనీలు మరోపక్క లబ్ది పొందేందుకు వీలుంటుంది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో యస్‌ బ్యాంక్‌ను మినహాయిస్తే.. నిఫ్టీ ఆదాయం 3 శాతం, నికర లాభాలు 5 శాతం చొప్పున నీరసించాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు పరిగణించకుంటే క్షీణత మరింత అధికంగా నమోదయ్యేది. పన్ను అత్యధికంగా చెల్లించే ఆయిల్‌, గ్యాస్‌ కంపెనీలు, వినియోగ ఆధారిత కంపెనీలు నిఫ్టీ ఆర్జనకు సహకరించాయి. ​

మిడ్‌ క్యాప్స్‌ అంతంతే
వొడాఫోన్‌ను మినహాయిస్తే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు యథాతథం అన్నట్లుగా పనితీరు చూపాయి. పండుగల సీజన్‌లోనూ జోరు చూపలేకపోయాయి. కెమికల్స్‌, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రిటైల్‌, ఐటీ తదితర రంగాలు సానుకూల ఫలితాలు సాధించగా.. ఆటో, ఆటోవిడిభాగాలు, మెటల్స్‌, మైనింగ్‌, సిమెంట్‌ కంపెనీలు నిరాశపరచాయి. అయితే ఆటో, అగ్రి, కెమికల్స్‌, దేశీ ఫార్మా తదితర పలు రంగాలలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఎల్‌ఐసీ ఐపీవో
ప్రభుత్వం ద్రవ్యలోటును కట్టడి చేయడానికి ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూని చేపట్టవలసి ఉంది. లిస్టింగ్‌ ద్వారా ఎల్‌ఐసీ దేశీయంగా అత్యంత విలువైన కంపెనీగా ఆవిర్భవించనుంది. తద్వారా బీఎఫ్‌ఎస్‌ఐ రంగానికి వెయిటేజీ పెరగనుంది. ఏయూఎంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ మార్కెట్‌ విలువ 1 రెట్లు, ఐసీఐసీఐ ప్రులైఫ్‌ 0.5 రెట్లు, ఎస్‌బీఐ లైఫ్‌ 0.75 రెట్లు చొప్పున పలుకుతున్నాయి. ఎల్‌ఐసీ ఏయూఎం రూ. 31 లక్షల కోట్లలో 0.5 రెట్లు చొప్పున అంచనా వేసినా మార్కెట్‌  విలువరీత్యా అగ్రస్థానంలో నిలవనుంది. 

ఫండ్స్‌ ఆశావహం
మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థ అటూఇటుగా ఉన్నప్పటికీ ‍మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. జనవరిలో వివిధ పథకాలలో రూ. 1.2 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ పథకాలు సైతం పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. నిజానికి ప్రస్తుతం రియల్టీ ఒత్తిడిలో ఉంది. బంగారం, ఈక్విటీలు, రుణ సెక్యూరిటీలను ప్రాధాన్య పెట్టుబడి సాధనాలుగా చెప్పవచ్చు. 2004లో తొలిసారి ఈక్విటీ రీసెర్చ్‌లో ఉద్యోగం ద్వారా కేపిటల్‌ మార్కెట్లను మదింపు చేయడం ప్రారంభించాను. అయితే కంపెనీల యాజమాన్యాలను కలవకుండా ఈక్విటీ రీసెర్చ్‌ను నిర్వహించలేము. తగినంత స్టడీ, విశ్లేషణ, రీసెర్చ్‌, ప్లాంట్ల సందర్శన, ప్రొడక్టులు తదితర అంశాలను పరిశీలించకుండా సరైన నిర్ణయాలు తీసుకోలేము. అయితే నేను ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం కాకుండా ఇన్వెస్టర్లకు సలహాలు ఇచ్చేందుకుగాను కేపిటల్‌ మార్కెట్లలో ప్రవేశించాను. ఆపై వెనుదిరిగి చూడవలసిన అవసరం ఏర్పడలేదు.You may be interested

వచ్చే ఏడాది ఇండియాలో యాపిల్‌ స్టోర్‌!

Thursday 27th February 2020

ప్రముఖ ఐఫోన్‌ దిగ్గజ కంపెనీ యాపిల్‌ త్వరలో భారత్‌లో యాపిల్‌ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. క్యాలిఫోర్నియాలోని క్యూపెర్టెనోలో జరిగిన యాపిల్‌ కంపెనీ వార్షిక షేర్‌హోల్డర్‌ సమావేశంలో ఒక ప్రశ్నకు సమాదానంగా యాపిల్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ టిమ్‌కుక్‌ 2021లో ఇండియాలో తొలి యాపిల్‌ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంతేగాకుండా భారత్‌లో యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ను ఈ ఏడాది చివరినాటికి ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2021లో స్థానిక భాగస్వామ్యం లేకుండా  యాపిల్‌ కంపెనీ

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓకు 4రోజులు ఎందుకంటే..?

Thursday 27th February 2020

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ కనీస గడువు కాలం 3ట్రేడింగ్‌ సెషన్‌లు ఉంటుంది. కానీ ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ కాలవ్యవధి 4ట్రేడింగ్‌ సెషన్లుగా ఉంది. ఐపీఓ మార్చి 2న ప్రారంభమై అదే నెల 5వ తేదీన ముగుస్తుంది. మార్కెట్‌ రెగ్యూలేటరీ నియమావళి ప్రకారం ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ కనిష్టంగా 3మార్కె్‌ట్‌ పనిదినాలుగానూ, గరిష్టంగా 10 ట్రేడింగ్‌ పనిదినాలు ఉంటుంది. ఇష్యూలో భాగంగా రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35శాతం షేర్లను కేటాయించడంతో ఎస్‌బీఐ కార్డు ఐపీఓకు భారీగా

Most from this category