News


బడ్జెట్‌ 2020: కార్పోరేట్ల కామెంట్స్‌

Sunday 2nd February 2020
news_main1580619899.png-31434

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన కార్పోరేట్‌ కంపెనీ దిగ్గజాలు స్పందిచారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో నిర్మలమ్మ జీడీపీ వృద్ధి పైనే దృష్టి సారించారు. తన బడ్జెట్ స్పీచ్‌లో దేశంలో మౌలిక సదుపాయాల రంగానికి అగ్రతాంబూలం వేశారు. పారిశ్రామిక, మార్కెట్ వర్గాల ఆశలు మాత్రం నెరవేరలేదు. గ్రామీణ భారతానికి, వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. ఈ బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే...

‘భారత కార్పొరేట్‌ రంగాన్ని వెంటాడుతోన్న పన్ను వేధింపులకు ముగింపు పలుకుతామని ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చారు. సకాలంలో రిటర్నులు సమర్పించలేకపోయిన కంపెనీలపై ప్రస్తుతం అమల్లో ఉన్న క్రిమినల్‌ చర్యల స్థానంలో సివిల్‌ యాక్షన్‌ ఉండేలా కంపెనీల చట్టంలో పలు మార్పులు చేయనున్నామని ప్రకటించారు. ఇది కార్పొరేట్‌ వర్గానికి భారత్‌లో వ్యాపారం పట్ల నమ్మకాన్ని పెంచేదిగా ఉంది’. 

  • బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా-

‘ఉత్పత్తికి అవసరమైన భరోసాను ఇవ్వాలి. నాణ్యతపై దృష్టి సారించడం, ఎగుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, ఎలక్ట్రానిక్స్‌లో పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాల ఆధారంగా ఇది సాధ్యపడుతుంది. వీటిని ప్రభుత్వం అత్యవసరంగా అమలు చేయాలన్నదే ఇప్పుడు కీలకం అంశం’. 

  • మహీంద్రా & మహీంద్ర మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా

‘వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పుల వల్ల ప్రజల వద్ద మిగులు ధనం పెరగనుంది. డివిడెండ్ పంపిణీ పన్నును తొలగించడం అనేది స్వాగతించదగిన చర్య. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి వచ్చే డివిడెండ్‌ ఆదాయంపై ఆధారపడే వారికి తాజా నిర్ణయం ప్రయోజనాన్ని చేకూర్చనుంది’. 

  • మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ & సీఈఓ అశుతోష్ బిష్ణోయ్

 

‘భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ల ఎకానమీగా ఎదిగేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందనే విషయం తాజా బడ్జెట్‌ ప్రకటన ద్వారా వెల్లడైంది. సందప సృష్టికర్తలైన వ్యాపారులకు గౌరవం ఇవ్వాలన్న నిర్మలా సీతారామన్‌ మాట ఆకట్టుకుంది. టెక్నాలజీ పరంగా అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా అభివృద్ధిలో అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ బడ్జెట్‌ ప్రకటించారు’. 

  • భారతి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్    

 

‘ప్రైవేటు రంగానికి డేటా సెంటర్‌ పార్కుల నిర్మాణం జరగాలనే ప్రభుత్వ నిర్ణయం బాగుంది. భారత ఆర్థిక వ్యవస్థ సూపర్‌ పవర్‌గా ఎదిగేందుకు దోహదపడేలా ఉంది’. 

  • టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నాని

 

‘కృత్రిమ మేధస్సుపై బడ్జెట్ దృష్టి సారించడం, క్వాంటం కంప్యూటింగ్ కోసం లక్ష్యాలను నిర్దేశించడం వంటి నిర్ణయాలు.. ఎక్స్‌పోనెన్షియల్ టెక్నాలజీలో భారత్ స్థానాన్ని బలోపేతం చేసేదిగా ఉంది’. 

  • ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ సీఈఓ, ఎండి సంజయ్ జలోనా 

 

‘దేశ అభివృద్ధికి టెక్నాలజీ ఎంత కీలకమో బడ్జెట్‌ స్పష్టంచేసింది. క్వాంటం కంప్యూటింగ్ సెంటర్, డేటా సెంటర్ పాలసీ, మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్) పోర్టల్‌పై బడ్జెట్‌ ప్రకటనలు.. పరిశ్రమతో పాటు ప్రభుత్వానికి డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తాయి’.

  • నాస్కామ్ ప్రెసిడెంట్‌ దేబ్‌జానీ ఘోష్

 

‘బడ్జెట్‌ ప్రశంగం మేం ఆశించిన స్థాయిలో లేదు. మందగమనంలో ఉన్న ఆటో పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు చేస్తుందని భావించాం. కానీ, అంచనాలకు అనుగుణంగా ప్రత్యక్ష ప్రకటనలు ఏమీ లేవు’. 

  • సియామ్‌ అధ్యక్షుడు రాజన్‌ వధేరా

 

‘ఈ సారి బడ్జెట్‌ తీవ్ర నిరాశపరిచింది. ఆటో పరిశ్రమను ఆదుకునే ప్రకటనలు లేవు. స్క్రాపేజ్‌ పాలసీ అమల్లోకి వస్తే వాణిజ్య వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుంది’. 

  • ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు హర్షరాజ్‌ కాలే

 

‘రియల్టీ రంగంలో ద్రవ్య లభ్యత కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్యను అధిగమించే దిశగా బడ్జెట్‌లో ఎటువంటి ప్రకటనలు లేవు. అత్యవసరంగా నిర్ణయాలు తీసుకుని నిలబెట్టాల్సిన అంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించలేదు’. 

  • సతీష్ మాగర్, ప్రెసిడెంట్, క్రెడాయ్‌ నేషనల్ You may be interested

 ఆరోగ్యానికి రూ. 69, 000 కోట్లు

Sunday 2nd February 2020

ఆయుష్మాన్‌ భారత్‌ : రూ.6,400 కోట్లు  స్వచ్ఛ భారత్‌ మిషన్‌ : రూ. 12, 300 కోట్లు  జల్‌జీవన్‌ మిషన్‌ : రూ. 11,500 కోట్లు    న్యూఢిల్లీ:  ‘‘ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. పౌరుల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నాం’’ అని బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరచడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల ఆధునీకరణపై దృష్టి

ఈ-కామర్స్‌ లావాదేవీలపై 1% టీడీఎస్‌

Sunday 2nd February 2020

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ లావాదేవీలపై కొత్తగా 1 శాతం టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) విధిస్తూ కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం డిజిటల్ ప్లాట్‌ఫాంను నిర్వహించే ఈ-కామర్స్ ఆపరేటరు.. విక్రేతల స్థూల అమ్మకాలకు సంబంధించి 1 శాతం టీడీఎస్‌ మినహాయించాల్సి ఉంటుంది. అయితే, ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంపై అంతక్రితం ఏడాది సదరు విక్రేత అమ్మకాలు రూ. 5 లక్షలకన్నా తక్కువ ఉండటంతో పాటు పాన్ ఆధార్ నంబరు ధృవీకరణ

Most from this category