News


వడ్డి రేట్ల కోత బలమైన ఉద్దీపనం: మనిష్‌ గున్వానీ

Saturday 13th July 2019
Markets_main1562995460.png-27036

 అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పాటు ఇండియా మానెటరీ పాలసీలు కూడా పని చేస్తే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని రిలయన్స్‌ మూచ్యువల్‌ ఫండ్‌ సీఐఓ మనిష్‌ గున్వానీ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... 
 

రేట్ల కోత, అంతర్జాతీయ సంకేతాలే మూలం
ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ఎటువంటి కారకాలు పనిచేస్తాయో చెప్పడం కష్టం!  ప్రస్తుతం వాహనాల అమ్మకంలో మందగమనాన్ని ఆరు నెలల ముందు  అంచనా వేయలేకపోయాం.  అదే విధంగా ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవింపజేసే కారకాలను ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ ఆర్థిక వ్యవస్థను నడిపించే అంశాలను, ఆర్థిక వ్యవస్థ దిశను గమనించవచ్చు. ఆర్థిక, ద్రవ్య, మార్పిడి రేటు వలన ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు లభిస్తాయి. ద్రవ్యలోటు అదుపులో ఉండడంతో ఆర్బీఐ వడ్డిరేట్లను తగ్గించగలిగింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా డాలర్‌ బలహీనపడుతోంది. అమెరికాలో 10 ఏళ్ల ఈల్డ్‌ బాండులు గణనీయంగా తగ్గడం కూడా చూస్తున్నాం. ఫలితంగా మదుపర్లు స్థిరమైన కరెన్సీ కోసం ఎదురుచూస్తున్నారు. 
     ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి చాలా విధాలుగా పనిచేస్తుంది.  కానీ తగ్గింపు ఫలితాలు వినియోగదారులకు చేరడానికి ఆరు నెలల సమయం తీసుకుంటే మాత్రం కష్టం. 2016 ప్రారంభం‍లో అంతర్జాతీయ వాణిజ్యం  మందగమనం ఎలా ఉందో ప్రస్తుతం అలా కనిపిస్తోంది. ఇది 2009 స్థాయిల వైపు పయనిస్తోంది. దక్షిణ కొరియా, సింగపూర్‌ దేశాలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక మందగమనంలో ఉన్నాయి. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అంతర్జాతీయంగా కూడా కొన్ని సానుకూలతలు తోడవ్వాలి. చాలా వరకు దేశాలు వడ్డి రేట్లను తగ్గించి ఉద్దీపనలను అందించడంతో అంతర్జాతీయంగా ఈక్విటీలు బాగానే ప్రదర్శన చేస్తున్నాయి. కానీ అంతర్జాతీయంగా తయారి రంగం మందగమనంలో ఉందని  పీఎంఐ డేటా, వాణిజ్య డేటా  స్పస్టంగా తెలుపుతున్న విషయాన్ని గమినించాలి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పాటు ఇండియా మానెటరీ పాలసీలు కూడా పని చేస్తే దేశి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది.
 
వినియోగం ఆర్థిక వ్యవస్థకు అవసరం
  వినియోగాన్ని సెంటిమెంట్‌, కస్టమర్ల సహజ అతిశయ ప్రతిస్పందనలు నడిపిస్తాయి. కానీ మన ఆర్థిక వ్యవస్థలో ఇవి ఎప్పుడు తిరిగి వస్తాయో చెప్పడం కష్టం. స్థూల ఆర్థిక వ్యవస్థను గమనిస్తే గృహాల ఆస్తులు, అప్పుల బ్యాలన్స్‌ షీట్లు బలంగా ఉన్నాయి. ఆస్తులు, అప్పుల నిష్పత్తిలో అమెరికా కన్నా బాగున్నామని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అదే విధంగా ఆదాయం, లాభ నష్టాల పరంగా చూస్తే గత ఐదు, ఆరు ఏళ్ల నుంచి లాభాలు, జీతాలలో పెరుగుదల కనిపించడం లేదు. కానీ ముందు చెప్పినట్టు బ్యాలెన్స్‌ షీట్లు బలంగా ఉన్నాయి. వినియోగం మందగించడానికి భారతీయ కుటుంబాల బ్యాడ్‌ బ్యాలెన్స్‌ షీట్లే కారణం కాదని నా అభిప్రాయం. కానీ కొన్ని ప్రీమియం రంగాలైన లక్సరి కార్లు, విమాన ప్రయాణాలు, క్యూఎస్‌ఆర్‌ వంటి విభాగాలలో వినియోగం పెరిగింది. తాజాగా ఏసీ అమ్మకాలు బలంగా ఉండడం చూశాం.   
 కొన్ని విభాగాలలో వినియోగం అధికంగా ఉండడం చూస్తున్నాం . ఇది సెంటిమెంట్‌పై ఆధారపడి ఉంది. వడ్డి రేట్లు తగ్గించిన, అంతర్జాతీయంగా వృద్ధి పుంజుకున్నప్పటి సెంటిమెంట్‌ కూడా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలో ప్రభావం చూపుతుంది. కానీ దీనిని అంచనా వేయడం కష్టసాధ్యం. వడ్డి రేట్ల తగ్గింపు చాలా కీలకమైంది. దీనికితోడు అంతర్జాతీయ సంకేతాలు బాగుంటే వినియోగ సెంటిమెంట్‌ను తిరిగి గాడిలో పెట్టవచ్చు. 
    రేట్ల కోత ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి అవసరం కానీ ఈ రేట్ల కోత 50-100 బేసిస్‌ పాయింట్లగా ఉండడం మనలాంటి ఆర్థిక వ్యవస్థకు అవసరం, ఇవి 10 ఏళ్ల ఈల్డ్‌లను సులభతరం చేయడమే కాక వినియోగాన్ని పెంచుతాయి. ఇప్పటి వరకు ఆర్బీఐ 75 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. దీని ఫలితాలు కార్పోరేట్‌ రుణాలకు గాని, వినియోగదారులకు గాని ఇంకా చేరలేదు. దీని కోసం ఇంకొంత సమయం వేచి చూడాలి. వినియోగదారులు 100 బీపీఎస్‌ లేదా 150 బీపీఎస్‌ రేట్‌ కట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక వేళ అదే జరిగితే ఆర్థిక వ్యవస్థ మందగమనం నుంచి బయటపడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కార్పోరేట్‌ బ్యాంక్‌, వినియోగ రంగం, రియల్‌ ఎస్టేట్‌, హొటల్‌ వంటి రంగాలలో ప్రమాదం ఉన్నప్పటికి మంచి రివార్డులు పొందవచ్చు.  

ఆటో సెక్టార్‌కు గడ్డుకాలం..
 ఆటో సెక్టార్‌ వేగంగా మందగించడం చూస్తున్నాం.  ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మరలేందుకు ఎక్కువ ప్రాదాన్యం ఇస్తుంది. కానీ దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సాంకేతికంగా హైబ్రిడ్‌ లేదా పూర్తి బ్యాటరీపై నడిచే వాహనాలను వినియోగిస్తారా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అంతర్జాతీయంగా కూడా ఆటో రంగ మల్టిపుల్స్‌ చాలా బలహీనంగా ఉన్నాయి.  ప్రస్తుత  సమయంలో ఆటో సెక్టార్‌ ఆదాయాలు బలహీనంగా ఉండడనున్నాయి.  ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఉపయోగపడని వాహన విడి భాగాల రంగం ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. సాధరణంగా ప్యాసింజర్‌ వెహికల్స్‌ కంటే కమర్షియల్‌ వెహికల్స్‌(సీవీ)కు కొంత సానుకూలత ఉంది. ఎందుకంటే సాంకేతికత ఎక్కువగా ప్యాసింజర్‌ వాహనాలపై దృష్ఠి పెట్టే అవకాశం ఉంది. కంపెనీలు ఈ సాంకేతికతకు మారడానికి అధిక పెట్టుబడులు పెడతాయా లేక ఇతర భాగస్వామ్యాలతో కలిసి పనిచేస్తాయా అనేది చూడాలి. 

 You may be interested

సావరిన్‌ బాండ్ల ద్వారా రూ.70,000 కోట్ల సమీకరణ !

Saturday 13th July 2019

సావరిన్‌ బాండ్ల ద్వారా రూ.70,000 కోట్ల సమీకరణ ! ఆర్థిక శాఖ కార్యదర్శి వెల్లడి  న్యూఢిల్లీ: సావరిన్‌ బాండ్ల ద్వారా కేంద్రం రూ.70,000 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. విదేశీ మార్కెట్ల నుంచి  సావరిన్‌ బాండ్ల ద్వారా రుణాలు సమీకరించడం సాహసోపేతమైన చర్య అని ఆయన అభివర్ణించారు. విదేశాల్లో రుణాలను సమీకరించడం వల్ల దేశీయంగా ప్రైవేట్‌ రంగానికి మరిన్ని నిధులు అందుబాటులో

పెట్టుబడులకు బడ్జెట్‌ బూస్ట్‌

Saturday 13th July 2019

 రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: పెట్టుబడుల పురోగతి, ద్రవ్య స్థిరీకరణ వంటి ఉన్నత లక్ష్యాల సాధనకు అనుగుణంగా 2019-20 బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఆయా కీలక లక్ష్యాల్లో రాజీలేదని స్పష్టం చేశారు. బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ, వచ్చే 10 సంవత్సరాల్లో ‘‘సమగ్ర అభివృద్ధి చర్యల’’ను బడ్జెట్‌ నిర్దేశిస్తున్నట్లు తెలిపారు. ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడమే భారత్‌ లక్ష్యమని తెలిపారు.

Most from this category