News


ఇన్వెస్టర్లుగా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు..?

Tuesday 3rd March 2020
Markets_main1583175727.png-32227

కరోనా వైరస్‌ సోమవారం మన మార్కెట్లలో లాభాలన్నింటినీ మింగేసింది. వరుసగా ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో ప్రధాన సూచీలు 10 శాతం వరకు పడిపోవడానికి ఈ వైరస్‌ విజృంభణే కారణం. మరి ఈ సమయంలో సాధారణ ఇన్వెస్టర్లుగా భయంతో స్టాక్స్‌ను అమ్మేసుకుంటున్నారా..? లేక తెలివిగా మంచి పెట్టుబడి అవకాశాలను అందుకుంటున్నారా..? ఈ సమయంలో ఏం చేయాలన్నది ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌మోదీ సూచించారు.

 

ఈ తరహా సందర్భాలు తాత్కాలికమే. భయంతో ఈ సమయంలో ఇన్వెస్టర్లు స్టాక్స్‌ను అమ్ముకోకూడదు. బదులుగా అమ్మకాల ఒత్తిడికి బాగా పడిపోయిన  నాణ్యమైన స్టాక్స్‌ను గుర్తించి కొనుగోలు చేయడం ప్రారంభించాలి. ప్రతీ పతనంలోనూ నాణ్యమైన స్టాక్స్‌ను ఎందుకు పోగు చేసుకోవాలంటే..? రేపు మార్కెట్లు ఏ విధంగా ఉంటాయి? నెల తర్వాత ఏంటన్నది ఎవరూ చెప్పలేరు. అది పెరగొచ్చు లేదా పడిపోవచ్చు. కానీ, పదేళ్ల తర్వాత కచ్చితంగా పెరుగుతుందని నమ్మకంతో చెప్పగలం. గతంలో ఈ తరహా పరిస్థితుల్లో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. మార్కెట్లు దిద్దుబాటుకు గురి అయి ఉండొచ్చేమో కానీ, ఆరు నెలల్లోపే అవి తిరిగి ర్యాలీ చేసినట్టు తెలుస్తోంది. 

 

గత సంక్షోభాల సమయంలో 
ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌-రాబడులు
సంక్షోభం                 ఒక నెల        మూడు నెలలు    ఆరు నెలలు (శాతంలో)
హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌    -0.46            -4.64               -3.25
న్యూమోనిక్‌ ప్లాగ్యూ   -2.79           -4.67               -4.30
సార్స్‌                      8.64            16.36              21.51
ఏవియన్‌ ఫ్లూ           -0.18            2.77              10.05
డెంగ్యూ ఫీవర్‌            1.07            7.09                9.68
స్వైన్‌ఫ్లూ                 10.90          19.73              39.96
కలరా                      -2.35           7.02              13.61
ఎబోలా                   -0.09            2.37                4.37
మీజిల్స్‌                   -1.71           1.92                2.29
జికా                        -6.05           -0.88              -0.57

 

వీటికితోడు ఇతర గణాంకాలు, చారిత్రక ఆధారాలను చూస్తే.. కరోనా వైరస్‌ కారణంగా మార్కెట్లో నష్టాలు తాత్కాలికమే. దీర్ఘకాలంలో మార్కెట్లు ముందుకే వెళతాయి. కనుక ఈ భయాందోళన సమయంలో విక్రయించడం కాకుండా, నాణ్యమైన, చౌక వ్యాల్యూషన్లలో లభించే స్టాక్స్‌ను కొనుగోలు చేయడం మంచిది. అయితే, మంచి నాణ్యమైన స్టాక్స్‌ను గుర్తించడం అన్నది అతిపెద్ద టాస్క్‌. ఆందోళన చెందకుండా స్టాక్‌ వృద్ధి చార్ట్‌లను సునిశితంగా పరిశీలించి, గత కొంత కాలంలో వాటి పనితీరును అధ్యయనం చేయాలి. నాణ్యమైన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల దీర్ఘకాలంలో తక్కువ రిస్క్‌తో అధిక రాబడులకు వీలుంటుంది. నేరుగా స్టాక్స్‌లో ఈ సమయంలో ఇన్వెస్ట్‌ చేయడం కాకుండా, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఈ అవకాశాలను సొంతం చేసుకోవాలి.



You may be interested

‘పన్ను’ పరిష్కారాలకు ‘వివాద్‌ సే విశ్వాస్‌’

Tuesday 3rd March 2020

మార్చి 31లోగా చెల్లిస్తే జరిమానాలుండవు పెనాల్టీలుండవు; ఆపై క్షమాభిక్ష కూడా... ఆ తరవాత జూన్‌ 30లోగా కూడా చెల్లించొచ్చు కాకుంటే ఓ 10 శాతం ఎక్కువ చెల్లించాలి దీంతో ట్యాక్స్‌ పేయర్లకు డబ్బు, సమయం ఆదా నిర్మలా సీతారామన్‌ వెల్లడి; లోక్‌సభకు బిల్లు న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు సాయపడేందుకే వివాదాల పరిష్కార పథకం ‘వివాద్‌ సే విశ్వాస్‌’ను బడ్జెట్‌లో ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  చెప్పారు. ‘‘ఈ పథకం పన్ను వివాదాల్ని పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

బంగారం బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశం

Tuesday 3rd March 2020

భారత ప్రభుత్వ సౌర్వభౌమ బంగారం బాండ్ల (ఎస్‌జీబీ) సిరీస్‌-10 ఇష్యూ ఈ నెల 2న ప్రారంభమైంది. ఈ ఏడాది తొలి ఇష్యూ ఇది. బంగారం ధరలు పెరుగుతుండడంతో గతేడాది చేపట్టిన ఇష్యూలకు మంచి స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో, ప్రపంచ మాంద్యం భయాలతో ఇ‍న్వెస్టర్లు రిస్క్‌ తగ్గించుకునేందుకు బంగారంలో పెట్టుబడులు పెంచుకుంటున్నారు. కనుక బంగారం ధర కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయితే భౌతిక బంగారం

Most from this category