News


ఈక్విటీ మార్కెట్లలో మరోసారి కరోనా కలవరం..!

Friday 21st February 2020
Markets_main1582275383.png-31987

కొన్ని రోజులుగా సద్దుమణిగిన కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి ప్రపంచ మార్కెట్లను మరోసారి కలవరపెడుతోంది. దీంతో ఆర్థిక మందగమన భయాలతో ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు ఇంట్రాడేలో 1శాతం నష్టాన్ని చవిచూసి చివరికి అరశాతం నష్టంతో ముగిశాయి. నేడు ఆసియాలో ఒక్క చైనా తప్ప మిగిలిన అన్ని మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు సైతం నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించగా, అమెరికా ఫ్యూచర్లు అరశాతం నష్టంతో కదులుతున్నాయి. అయితే మహాశివరాత్రి సందర్భంగా భారత్‌ మార్కెట్‌కు సెలవు రోజు. లేదంటే మార్కెట్‌ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చేదని మార్కెట్‌ విశేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరోసారి విజృంభించిన కరోనా వైరస్‌ వ్యాధి
చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ వ్యాధి గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టింది. అయితే గతరెండు రోజులు నుంచి వ్యాధి వ్యాప్తి గణనీయంగా పెరగడంతో మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. ఇప్పటికి వరకు ఈ వ్యాధితో ఫిబ్రవరి 21నాటి వరకు చైనాలో మొత్తం మరణాల సంఖ్య 2,236కు చేరుకోగా, నిన్నటి రోజున ఏకంగా 115 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం 75,685 మంది వ్యాధి బారిన పడినట్లు చైనా వైద్యాధికారులు అధికారంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో సుమారు 1200 మందికి సోకిందని, దక్షిణ కొరియాలో అత్యధికంగా 156 కేసలు నమోదైనట్లు గణాంకాలు పేర్కొనాయి. 

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఆందోళన:
కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి తిరిగి ఉధృతం కావడంతో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ అందోళన వ్యక్తం చేయడంతో పాటు ఆయా దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ గురువారం మాట్లాడుతూ ‘‘ వ్యాధి తగ్గుముఖం పడుతున్న తరుణంలో తిరిగి పుంజుకోవడం దురదృష్టకరం. వ్యాధి నియంత్రణకు మా వంతు కృషి చేస్తున్నాము. ప్రపంచదేశాలు కూడా తగిన జాగత్రలు పాటించి ప్రజలను వైరస్‌ బారిన పడకుండా చూసుకోవాలన్నారు. 

మాంద్యం అంచున జపాన్‌, సింగపూర్‌ ఆర్థిక వ్యవస్థలు:
కరోనా వైరస్‌ వ్యాధితో ఆర్థిక వ్యవస్థలు సతమతువుతున్న తరుణంలో తరణంలో జపాన్‌, సింగపూర్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యం దిశగా సాగుతుండటం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను మరింత కలవరపెడుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న మందగమన పరిస్థితులు, ఈ దేశాల్లో నెలకొన్న అంతర్గత సమస్యలు ఆర్థిక వ్యస్థలను మాంద్యం దిశగా తీసుకెళ్తున్నాయి. నేడు జపాన్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌ సూచీ అరశాతం నష్టంతో 23,386.74 వద్ద ముగిసింది. సింగపూర్‌ దేశానికి చెందిన స్ట్రెయిట్స్ టైమ్స్ ఇండెక్స్‌ అరశాతం నష్టంతో  3,181.36 వద్ద స్థిరడపింది. 

కొరియా మార్కెట్‌ బారీగా క్రాష్‌:
 చైనాలో ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణించిన కారణంగా కొరియా ఎగుతులు బాగా పడిపోడియాయి. దీనికి తోడు చైనా తరువాత ప్రపంచదేశాల్లో దక్షిణ కొరియాలోనే అత్యధికంగా 156 కరోనా కేసులు నమోదైనట్లు గణాంకాలు వెల్లడికావడంతో శుక్రవారం ఆ దేశ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌ సూచీ 1.50శాతం నష్టాన్ని చవిచూసి 2,162.84 వద్ద స్థిరపడింది.
 You may be interested

టెస్లా మాంత్రికుడు మస్క్‌...ఆశ్చర్యపోవాల్సిందే!

Friday 21st February 2020

సంచలనాలు సృష్టిస్తున్న టెస్లా సీఈఓ ఈవీ, సోలార్‌ వాహనాలపై ఇన్వెస్టర్ల ధృక్పధాన్ని మార్చిన ఘనత అంతరిక్షయానంపై కన్ను ఒక ఇంజనీర్‌, ఒక డిజైనర్‌, ఒక టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌, ఒక కార్పొరేట్‌ సీఈఓ... స్పేస్‌ ఎక్స్‌, టెస్లా, బోరింగ్‌ కంపెనీ, న్యూరాలింక్‌, ఓపెన్‌ ఏఐ తదితర అనే కంపెనీల సృష్టికర్త... ఫోర్బ్స్‌ ప్రఖ్యాత ప్రపంచ ప్రముఖుల్లో 21వస్థానం.. ప్రపంచ కుబేరుల్లో 23వ స్థానం... 2019 అత్యంత ఇన్నోవేటివ్‌ నాయకుల్లో తొలి ర్యాంకు, రాయల్‌ సొసైటీ ఫెలోగా ఎన్నిక, అంతర్జాతీయంగా ఒక

ఇక మిడ్, స్మాల్‌క్యాప్‌ల హవా

Friday 21st February 2020

మెరుగైన కార్పొరేట్‌ లాభాల ఫలితంగా ఇక రానున్న రోజుల్లో మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు డిమాండ్‌ పెరుగుతుందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌ బోబ్డే అంచనావేశారు. ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కరోనావైరస్‌ ఆందోళనలున్నప్పటికీ, మార్కెట్‌ అనేది కార్పొరేట్లు వెలువరించే మంచి ఫలితాలు, అంతర్జాతీయ కేంద్ర బ్యాంకులు వ్యవస్థలోకి ప్రవేశపెట్టే లిక్విడిటీపై ఆధారపడివుంటుందని అన్నారు. ఇప్పటివరకూ వెల్లడైన కార్పొరేట్‌ ఫలితాలు అంచనాలకంటే బావున్నాయని, దీంతో 2021,

Most from this category