News


479శాతం ర్యాలీ చేసిన జపాన్‌ షేరు ఇదే..!

Wednesday 29th January 2020
Markets_main1580295799.png-31312

కొత్త పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. అయితే  ఈ వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలతో జపాన్, సౌత్‌ కొరియా, ఇండియా స్టాక్‌ మార్కెట్లలో హెల్త్‌కేర్‌, సేఫ్టీ ప్రాడెక్ట్‌ల షేర్లకు డిమాండ్‌ పెరిగింది. మాస్క్‌లతో పాటు వైద్య ఉత్పత్తులను సరఫరా చేసే జపాన్ సంస్థ కవామోటో కార్పొరేషన్ షేరు ఈ జనవరిలో ఐదు రెట్లు పెరిగింది. టోక్యో స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లో డిసెంబర్‌ 30నాడు 447 యెన్‌ (జపాన్‌ కరెన్సీ)ఉండగా, నేటి(జనవరి 29నాటికి)  2,591 యెన్‌లకు పెరిగింది. అంటే నెలరోజుల్లో ఏకంగా 479శాతం ర్యాలీ చేసింది. వీటితో పాటుగా రక్షిత దుస్తులను తయారు చేసే అజీర్త్ కంపెనీ ఇదే కాలంలో 139 శాతం ర్యాలీ చేసింది 

గతేడాది డిసెంబర్‌ చైనాలో వుహాయ్‌లో పుట్టిన ఈ వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 132 మంది మృతి చెందారు. సుమారు 6వేల మంది ఈ వైరస్‌ బారీన పడ్డారు. ఈ వైరస్‌ వ్యాధి కాలుష్యం వలన సంభవిస్తుందనే ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ సానిటైజింగ్ లిక్విడ్ కోసం డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఆసియా మార్కెట్లో ఈ రంగాలకు చెందిన షేర్లు ర్యాలీ చేశాయి. 

మనదేశంలో హెల్త్‌కేర్‌, రక్షణ, ఇండస్ట్రీయల్‌ సేఫ్టీ  ఉత్పత్తులను తయారీ చేసే భారత్ ఇమ్యునోలాజికల్ & బయోలాజికల్ కార్పొరేషన్ షేరు జనవరి 23-28 తేదీల మధ్య ఏకంగా 50శాతం పెరిగింది. హెల్త్‌కేర్‌ సేఫ్టీ ఉత్పత్తులను అందించే  3ఎం షేరు ఇదే కాలంలో 4శాతం లాభపడింది. 

కరోనా వైరస్‌ కారణంగా దక్షిణ కొరియా హెల్త్‌కేర్‌ షేర్లు లాభాలను అర్జించాయి. ఈ దేశానికి చెందిన మోనాలిసా ఇయర్‌ టు డేట్‌ ఈ షేరు 93శాతo ర్యాలీ చేసింది. కుక్జే ఫార్మా, వూజంగ్ ​బయో వరుసగా 66 శాతం, 32 శాతం పెరిగాయి. You may be interested

ఒకే జీఎస్‌టీ రేటు ఉండాలి

Thursday 30th January 2020

అధిక నిరుద్యోగిత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్వల్పంగా అధికమైన ఆదాయాల స్థాయి.. వెరశి పట్టణ డిమాండ్‌కు అడ్డుకట్ట పడుతోంది. డిమాండ్‌ తిరిగి గాడినపడాలని ఫాస్ట్‌ మూవింగ్‌ కంజ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు కోరుతున్నాయి. బడ్జెట్‌లో ప్రకటించబోయే ఉద్దీపణలపైనే ఇది ఆధారపడి ఉందని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఆదాయపు పన్ను స్లాబు సవరణ, ఉద్యోగాల కల్పన, గ్రామీణ కస్టమర్లకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందజేస్తే ప్రజల చేతుల్లో ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బులు ఉంటాయని

అబ్బో!  తయారీ కంపెనీలకు ఇన్ని అనుమతులా?

Wednesday 29th January 2020

తయారీ కంపెనీలకు 2 వేల అనుమతులు  ఫిక్కీ అధ్యయనం న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా కంపెనీ లేదా ఫ్యాక్టరీని నెలకొల్పాలంటే అనేక నిబంధనలకు లోబడి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో 1,984 నిబంధనలు అధిగమించాల్సి ఉంటుందని  ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌ఐసీసీఐ) జరిపిన అధ్యయనం వెల్లడించింది. దాదాపు రెండు వేల వరకు ఉన్న ఈ నిబంధనలను అనుసరించి కొత్త తయారీ కంపెనీని ప్రారంభించాలంటే అధిక

Most from this category