News


మెటల్‌ షేర్లకు కరోనా దెబ్బ!

Tuesday 28th January 2020
Markets_main1580185900.png-31259

చైనాలో కొత్తగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా మెటల్‌ షేర్లు వణుకుతున్నాయి. చైనా ఎకానమీపై కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్న భయాలు మెటల్‌షేర్లపై ప్రతిబింబిస్తున్నాయి. చైనా ప్రపంచంలో అతిపెద్ద మెటల్‌ వినియోగదారు మరియు ఉత్పత్తిదారు. ప్రపంచ మెటల్‌ డిమాండ్‌, సప్లైలో దాదాపు సగం వాటా చైనాదే! అలాంటి చైనాలో ఇలాంటి అంటువ్యాధి ప్రబలడం వినిమయంపై ప్రభావం చూపుతున్న భయాలు పెరుగుతున్నాయి. దీంతో దేశీయంగా మెటల్‌ కంపెనీ షేర్లు సోమవారం 3-6 శాతం మేర నష్టపోయాయి. హిండాల్కో, వేదాంత, టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యు స్టీల్‌, జిందాల్‌స్టీల్‌ తదితరాలన్నీ నష్టపోయాయి. ఇదే ధోరణి ప్రపంచ మెటల్‌ షేర్లలో కూడా కనిపించింది. అంతర్జాతీయంగా రియో టింటో, రసల్‌, వాలె, గ్లెన్‌కోర్‌ తదితర షేర్లు 3-4 శాతం పతనమయ్యాయి. ఇండోనేసియాకు చెందిన కోల్‌ కంపెనీలు బుమి, అడారో ఎనర్జీలు దాదాపు 9 శాతం వరకు క్షీణించాయి.

 మెటల్‌ కమోడిటీలు మాత్రం ఇంతగా బెంబేలెత్తడం లేదు. అల్యూమినియం, కాపర్‌, జింక్‌ తదితరాలు గత మూడు సెషన్లలో దాదాపు 2 శాతం మేర మాత్రమే నష్టపోయాయి. కరోనాతో స్వల్పకాలానికి ట్రేడ్‌ దెబ్బతింటుందన్న భయాలున్నాయి. ఈ పరిస్థితి ఇండియా కంపెనీలకు మేలు చేస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సెంటిమెంట్స్‌ మాత్రమే షేర్ల ధరలను నడిపిస్తున్నాయని, ఈ ఆందోళన కొంత తగ్గితే ఫండమెంటల్స్‌ ఆధారిత ట్రేడ్స్‌ ఆరంభమవుతాయని చెప్పారు. మంగళవారం కూడా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు ఒక్క శాతం నష్టంతో ట్రేడవుతోంది. 

 You may be interested

యూఎస్‌ఎల్‌, వొకార్డ్‌ జోరు- టొరంట్‌ బోర్లా

Tuesday 28th January 2020

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో లిక్కర్‌ దిగ్గజం యునైటెడ్‌ స్పిరిట్స్‌, ఫార్మా కంపెనీ వొకార్డ్‌ లిమిటెడ్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. మరోపక్క ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో హెల్త్‌కేర్‌ కంపెనీ టొరంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి యూఎస్‌ఎల్‌, వొకార్డ్‌ కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. టొరంట్‌ ఫార్మా నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం.. యూఎస్‌ఎల్‌ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ

స్వల్పకాలానికి టెక్నికల్‌ సిఫార్సులు

Tuesday 28th January 2020

కరోనా వైరస్‌ ఆందోళనల నుంచి దేశీ స్టాక్‌ మార్కెట్లు తేరుకున్నాయి. సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 ప్రాంతంలో సెన్సెక్స్‌ 168 పాయింట్లు ఎగసి 41,322  వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సైతం 39 పాయింట్లు బలపడి 12,158 వద్ద కదులుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ విశ్లేషకులు, సాంకేతిక నిపుణులు స్వల్ప కాలానికి కొన్ని స్టాక్స్‌ సిఫారసు చేస్తున్నారు. వివరాలు చూద్దాం.. కునాల్‌ బోత్రా, ఇండిపెండెంట్‌ మార్కెట్‌ నిపుణులు ఐషర్‌ మోటార్స్‌: ఈ స్టాక్‌ను

Most from this category