News


నిఫ్టీ టార్గెట్‌ను కుదించిన ఎడెల్వీజ్‌.!

Friday 6th March 2020
Markets_main1583490964.png-32335

ఈ డిసెంబర్‌ నాటికి 12వేల స్థాయికి..!

కరోనా వైరస్‌ దలాల్‌ స్ట్రీట్‌ను తాకడంతో పాటు తన విధ్వంసాన్ని మరింత వేగవంతం చేసింది. ఈ అనూహ్య పరిణామంతో మార్కెట్‌ విశ్లేషకులు 2020 ఏడాదికి నిఫ్టీ స్థాయి అంచనాలను మరోసారి పునఃపరిశీలించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ నిఫ్టీ అంచనాలను తగ్గించుంది. ఏడాది చివరి నాటికి 12300 స్థాయికి చేరుకుంటుందనే గత అంచనాలను సవరిస్తూ 12000 స్థాయికి పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. 

ఆదాయాలు అనుకున్న స్థాయిలో నమోదుకాకపోవచ్చని అంచనాలతో నిఫ్టీ టార్గెట్‌ స్థాయిని కుదిస్తున్నాము. అయితే 17రెట్ల మల్టిపుల్స్‌ను కొనసాగిస్తున్నాము. ఆదాయం, మల్టీపుల్స్‌ రెండూ ప్రతికూలంగా ఉంటాయి. ఇక్కడ వైరస్‌ వ్యాధి ప్రబలడంతో మార్కెట్లు ముందుకు కదిలేందుకు అవకాశం లేదు. అయితే వ్యవసాయ, ఫార్మా, ఐటీ రంగాలకు చెందిన రంగాలు మంచి పనితీరు ప్రదర్శిస్తాయని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.

సప్లై అవాంతరాలు, రవాణా ఆంక్షలు, మార్కెట్‌ అస్థిరత విస్తరించడచడంతో వైరస్‌ ప్రభావం విస్తృతంగా ఉంది. ప్రస్తుతానికి వ్యాప్తి చెందుతోంది. వైరస్ నుండి వచ్చే మరిన్ని ప్రమాదాలపై సాధారణ, ప్రత్యేకమైన ఊహాగానాలు ఉన్నప్పటికీ,  దేశీయ నిధుల ప్రవాహాల రూపంలోనూ, నామమాత్రపు వడ్డీ రేట్లు,  ప్రపంచ ఈల్డ్‌ తగ్గడం, స్థిర ఆదాయ ప్రవాహాలు భారత మార్కెట్‌కు అనుకూలంగా ఉండొచ్చని ఎడిల్వీజ్‌ వివరించింది. ఈ ఏడాదికి నిఫ్టీ అవుట్‌లుక్‌ను తగ్గించడంతో పాటు లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌  విభాగంలో 17స్టాక్‌లపై బుల్లిష్‌ రేటింగ్‌ను ప్రకటించింది. 
లార్జ్‌క్యాప్‌ షేర్లు: భారతీ ఎయిర్‌టెల్‌, సిప్లా, ఐసీఐసీఐ లాంబార్డ్‌, ఇండస్‌ ఇండ్‌, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, టాటామోటర్స్‌ షేర్లున్నాయి.
మిడ్‌క్యాప్‌, స్మాల్‌ షేర్లు: భారత్‌ ఫోర్జ్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ధనుకా అగ్రిటెక్‌, గుజరాత్‌ గ్యాస్‌, జస్ట్‌ డయల్‌, జేకే సిమెంట్స్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, మైండ్‌ ట్రీ, సెక్యూరిటీస్‌ అండ్‌ ఇంటల్జెన్సీ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ షేర్లున్నాయి. You may be interested

కుప్పకూలిన మార్కెట్‌

Friday 6th March 2020

894 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్‌ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 280 పాయింట్లు పతనం 55 శాతం దిగజారిన యస్‌ బ్యాంక్‌ షేరు 5.3 శాతం క్షీణించిన పీఎస్‌యూ బ్యాంక్స్‌ ఓవైపు కోరలు చాస్తున్న కరోనా వైరస్‌.. మరోపక్క యస్‌ బ్యాంక్‌ బోర్డు రద్దు వంటి ప్రతికూల వార్తలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. గురువారం అమెరికా మార్కెట్లు 3.5 శాతం పతనంకావడంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలు ఎగబడ్డారు. చివరివరకూ అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో సెన్సెక్స్‌ 894

యస్‌ బ్యాంక్‌లో ఇరుక్కున్న చిన్న ఇన్వెస్టర్లు

Friday 6th March 2020

డిసెంబర్‌ త్రైమాసికానికల్లా 48 శాతానికి రిటైల్‌ వాటా 2018 జూన్‌ త్రైమాసికంలో ఈ వాటా 8.8 శాతమే సుజ్లాన్‌ ఎనర్జీ, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఆర్‌కామ్‌ తరహాలోనే.. వేల్యూ బయింగ్‌ పేరుతో యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో పెట్టుబడులకు దిగుతూ వచ్చిన రిటైల్‌ ఇన్వెస్టర్లు చివరికి బిక్కమొహం వేయవలసిన పరిస్థితులు తలెత్తినట్లు మార్కెట్‌ విశ్లేషకులు తాజాగా వ్యాఖ్యానిస్తు‍న్నారు. ఒకప్పుడు మార్కెట్‌ ఫేవరెట్‌గా నిలవడంతోపాటు ఏకంగా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీలో భాగమైన యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ గత

Most from this category