News


కరోనా ప్రభావంతో నిఫ్టీ కంపెనీల లాభాలు 3-5 శాతం తగ్గొచ్చు

Monday 24th February 2020
Markets_main1582540216.png-32049

ఫార్మా రంగం ఆకర్షణీయం
దివీస్‌, ఆర్తి లబ్ది పొందవచ్చు
ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ రంగం ఓకే
- మోతీలాల్‌ ఓస్వాల్‌ పీఎంఎస్‌

కరోనా వైరస్‌ సంక్షోభాన్ని అప్పుడే పూర్తిగా అంచనా వేయలేమంటున్నారు మనీష్‌ సొంతాలియా, సీఈవో మోతీలాల్‌ ఓస్వాల్‌  పీఎంఎస్‌. మార్కెట్లు, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ రంగం, కరోనా వైరస్‌ తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

ప్రపంచ మార్కెట్లపై కరోనా వైరస్‌ అత్యధిక ప్రభావాన్ని చూపే అవకాశముంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లు పతనమైతే.. దేశీయంగానూ సానుకూల ట్రెండ్‌కు అవకాశముండదు. కరోనా కారణంగా నిఫ్టీ కంపెనీల ఆర్జనలపై 3-5 శాతం ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. దేశీయంగా లార్జ్‌ క్యాప్స్‌లోకే ఈటీఎఫ్‌ నిధులు ప్రవహిస్తున్నాయి. ఒకవేళ విదేశీ నిధులు వెనక్కిమళ్లితే.. లార్జ్‌క్యాప్స్‌లో అమ్మకాలు పెరుగుతాయి. అయితే గత నెలలో నిఫ్టీ 1 శాతం నీరసిస్తే మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 6 శాతం బలపడ్డాయి. నిఫ్టీతో పోలిస్తే మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ ఫలితాలు అంతగొప్పగా లేవు. రెండుమూడేళ్లుగా ఈ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో ఇటీవల బలపడ్డాయి. ఇకపై పనితీరు ఆకట్టుకున్న కంపెనీలు మాత్రమే నిలదొక్కుకునే వీలుంది. అధిక లిక్విడిటీ ఉన్నప్పటికీ రుణ వృద్ధి తక్కువగానే నమోదవుతోంది. ట్రెజరీలలోకి పెట్టుబడులు మళ్లుతున్నాయి.

ఫార్మా, ఐటీ  ఓకే
ఫార్మా రంగం‍ ఆకర్షణీయ పనితీరును చూపుతోంది. గత త్రైమాసికంలోనూ కంపెనీలు పటిష్ట ఫలితాలు ప్రకటించాయి. యాంటి ఇన్‌ఫెక్టివ్స్‌, పెయిన్‌ మేనేజమెంట్‌, గ్యాస్ట్రో తదితర విభాగాల అమ్మకాలు పుంజుకుంటున్నాయి. తాజాగా కరోనా వైరస్‌ సంక్షోభం సైతం అవకాశాలు పెంచనుంది. ఏపీఐ విభాగంలో దివీస్‌, ఆర్తి వంటి కంపెనీలు లబ్ది పొందనున్నాయి. దేశీ మార్కెట్‌పై దృష్టి పెట్టిన ఫార్మా కంపెనీలతోపాటు.. ఐటీ కౌంటర్లను సైతం ప్రస్తుత పరిస్థితుల్లో పరిగణించవచ్చు.

బీమా రంగం
బీమా రంగంలో మ్యాక్స్‌ కౌంటర్‌లొ మాత్రమే కొంతమేర వేల్యూ మిగిలి ఉన్నట్టు చెప్పవచ్చు. ఇటీవల వస్తున్న వార్తలు సైతం ఈ కౌంటర్‌కు దన్నుగా నిలవనున్నాయి. ఆదాయపన్ను సవరణలు, ఇటీవల భారీగా ర్యాలీ చేయడం వంటి కారణాలతో ఇతర బీమా రంగ కౌంటర్లు ఖరీదుగా కనిపిస్తున్నాయి. ఇక వినియోగ రంగంలో హెచ్‌యూఎల్‌ మరింత బలపడే అవకాశముంది. ఇటీవల బంగారం ధరలు 25 శాతం పెరిగాయి. ఇది గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 65 శాతం పసిడి విలువను భారీగా పెంచుతోంది. దీనికితోడు ఇటీవల వ్యవసాయోత్పత్తుల ధరలు బలపడ్డాయి. ఇవన్నీ ఎఫ్‌ఎంసీజీ విభాగానికి మేలు చేయగలవు. ఈ రంగంలో లీడర్‌ అయిన హెచ్‌యూఎల్‌ రానున్న రెండేళ్లలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఇదే విధంగా పెయింట్స్‌ కౌంటర్లూ పుంజుకునే వీలుంది. ఈ బాటలో బాటా, జూబిలెంట్‌, టైటన్‌, ఎవెన్యూ, ట్రెంట్‌, వీమార్ట్‌ తదితర రిటైల్‌ రంగ, వినియోగ ఆధారిత కంపెనీల ఫలితాలనూ పరిశీలించవచ్చు. రానున్న రెండు, మూడేళ్ల కాలంలో పనితీరు ఆధారంగా ఈ కంపెనీల కౌంటర్లు జోరు చూపే అవకాశముంది.You may be interested

ప్రీమియర్‌ డిజిటల్‌ సొసైటీగా ఇండియా:ముఖేష్‌ అంబానీ

Monday 24th February 2020

అతి త్వరలో ఇండియా ప్రీమియర్‌ డిజిటిల్‌ సొసైటీగా మారనుందని భారత కుబేరుడు, వ్యాపార దిగ్గజం ముఖేష్‌ అంబానీ అన్నారు. సోమవారం ముంబైలో జరుగుతున్ను ఫ్యూచర్‌ డీకోడెడ్‌ సీఈఓ సదస్సు(ఫిబ్రవరి 24-26)లో పాల్గొన్న  మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ సత్యనాదెళ్లతో ముచ్చటించిన సందర్భంగా అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా ప్రీమియర్‌ డిజిటల్‌ సోసైటీగా మారడమేగాక, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా  ఎదుగుతుందన్నారు. పేరుగాంచిన డిజిటల్‌​ సమాజంగా ఇండియా మారుతుందని, మొబైల్‌

సెన్సెక్స్‌ 807 పాయింట్లు క్రాష్‌

Monday 24th February 2020

242 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ మరోసారి ఈక్విటీ మార్కెట్లను ముంచిన కరోనా వైరస్‌ భయాలు ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లల్లో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలు మరోసారి తెరపైకి సోమవారం దేశీయ మార్కెట్‌ భారీ నష్టాలను మూటగట్టుకుంది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ ఏకంగా 807 పాయింట్లను కోల్పోయి 40,363 వద్ద, నిఫ్టీ 242 పాయింట్ల నష్టంతో 11850 దిగువన 11,838 వద్ద ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌

Most from this category