News


మళ్లీ కరోనా భయాలు- మార్కెట్లు డీలా

Thursday 13th February 2020
Markets_main1581589907.png-31768

సెన్సెక్స్‌ 106 పాయింట్లు మైనస్‌
27 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ
ఐటీ, ఫార్మా రంగాల ఎదురీత

కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య పెరగుతుండటంతో మరోసారి ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. దీంతో అమెరికా ఇండెక్సుల ఫ్యూచర్స్‌ నీరసించగా.. ఆసియాలోనూ అమ్మకాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 106 పాయింట్లు క్షీణించి 41,460 వద్ద నిలవగా.. నిఫ్టీ 27 పాయింట్లు తక్కువగా 12,175 వద్ద స్థిరపడింది. యూరప్‌లోనూ మార్కెట్లు 1 శాతం నష్టాలతో ప్రారంభం‍కావడంతో దేశీయంగా మిడ్‌సెషన్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 41,338 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో సాధించిన 41,709 పాయింట్లే ఇంట్రాడే గరిష్టంగా నమోదుకావడం గమనార్హం. ఇక నిఫ్టీ సైతం 12226- 12140 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రియల్టీ డీలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రియల్టీ రంగాలు 1.4-0.5 శాతం మధ్య డీలా పడగా.. ఐటీ, ఫార్మా 0.9 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌, అదానీ పోర్ట్స​, యాక్సిస్‌ 3.6-1.2 శాతం మధ్య క్షీణించాయి. అయితే యస్‌ బ్యాంక్‌ 6.4 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో డాక్టర్‌ రెడ్డీస్‌, జీ, ఎస్‌బీఐ, టైటన్‌, ఇన్ఫోసిస్‌, యూపీఎల్‌, హెచ్‌యూఎల్‌, సన్‌ ఫార్మా, టీసీఎస్‌ 4-1 శాతం మధ్య ఎగశాయి.

ఐజీఎల్‌ వీక్‌
డెరివేటివ్స్‌లో ఐజీఎల్‌, ఎన్‌ఎండీసీ, అరబిందో, మహానగర్‌, ఐబీ హౌసింగ్‌, జిందాల్‌ స్టీల్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, మదర్‌సన్‌ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. టొరంట్‌ పవర్‌, జీఎంఆర్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, టొరంట్‌ ఫార్మా, నాల్కో, మెక్‌డోవెల్‌, బీహెచ్‌ఈఎల్‌ 7-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో ట్రేడైన షేర్లలో 1420 నష్టపోగా.. 985 మాత్రమే లాభపడ్డాయి.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 49 కోట్లు,  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 339 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 209 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 345 కోట్లవరకూ ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 184 కోట్లు, దేశీ ఫండ్స్‌ దాదాపు రూ. 736 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.
 You may be interested

ఇండియా రేటింగ్స్‌ యథాతథం: ఎస్‌ అండ్‌ పీ

Thursday 13th February 2020

భారత్‌ సార్వభౌమ రేటింగ్‌ను యథాతథంగా ‘బీబీబీ-’గా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్స్‌ దిగ్గజం స్టాండర్డ్‌ అండ్‌ఽ పూర్‌ (ఎస్‌ అండ్‌ పీ) గురువారం ప్రకటించింది. భారత్‌ జీడీపీ వృద్ధి వచ్చే రెండు, మూడేళ్లలో క్రమేపీ దీర్ఘకాలిక సగటుస్థాయికి చేరుకుంటుందని ఎస్‌ అండ్‌ పీ అంచనావేసింది. అయితే పెరిగిన ద్రవ్యలోటు, పెరుగుతున్న ప్రభుత్వ రుణాల కారణంగా కొంత అనిశ్చితి వుందని రేటింగ్స్‌ సంస్థ హెచ్చరించింది. భారత్‌ ఆర్థికాభివృద్ధిరేటు 2019-2020లో 5 శాతానికి తగ్గుతుందని,

ఇండియాపై మేం బేరిష్‌....!

Thursday 13th February 2020

విజ్‌డమ్‌ట్రీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సుదీర్ఘకాలంగా ఇండియాపై బుల్లిష్‌గా ఉంటూ, చాలా కాలంగా దేశీయ స్టాకులను రికమండ్‌ చేస్తూ, 2018 మార్కెట్‌ పతనంలో కూడా దేశీయ మార్కెట్‌పై పాజిటివ్‌గా ఉన్న ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ విజ్‌డమ్‌ట్రీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తాజాగా దేశీయ మార్కెట్‌పై బేరిష్‌గా మారింది. భారత వృద్ధిగాధపై విశ్వాసం ఉందని, కానీ ప్రస్తుతం దేశీయంగా రేకెత్తిన రాజకీయ, సాంఘీక టెన్షన్లు ఎకనమిక్‌ రికవరీని మరింత మందగింపజేస్తాయని అభిప్రాయపడింది. ఇదే సంస్థ ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతల సమయంలో

Most from this category