News


కరోనా కట్టడే పరిష్కారం, వడ్డీ రేట్లుకాదు!

Wednesday 18th March 2020
Markets_main1584524950.png-32559

తగ్గినప్పుడల్లా ఇన్వెస్ట్‌ చేసే మార్కెట్‌ కాదు
ప్రస్తుత సమస్యను 2008 పరిస్థితితో పోల్చేలేం
వాతావరణం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
గ్లోబలైజేషన్‌తో సమస్యలు- నివారణపై దృష్టి పెట్టాలి
- స్టీఫెన్‌ రోచ్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఏషియా మాజీ చైర్మన్‌

ఇంతక్రితం ఎన్నడూ ఎరుగని విధంగా సవాళ్లు విసురుతున్న కోవిడ్‌-19.. ప్రభావం భవిష్యత్‌లో కనిపించనున్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ ఏషియా మాజీ చైర్మన్‌ స్టీఫెన్‌ రోచ్‌ పేర్కొంటున్నారు. పన్నెండేళ్ల క్రితం ప్రపంచ దేశాలకు ఆర్థిక సమస్యలు సృష్టించిన సంక్షోభంతో ప్రస్తుత పరిస్థితులను పోల్చతగదని చెబుతున్నారు. కేంద్ర బ్యాంకులు, స్టాక్‌ మార్కెట్లు, పెట్టుబడులు తదితర అంశాలపై పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

ఇప్పటికే విస్తరించింది
అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ(WHO) ప్రపంచ మహమ్మారి వ్యాధిగా గుర్తించిన కోవిడ్‌-19 ఇప్పటికే చాలా చేటు చేసింది. కరోనా కారణంగా గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రజల్లో భయాందోళనలు చెలరేగడంతో ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకునే అవకాశముంది. ఈ విషయంలో ఎలా స్పందిస్తున్నామన్న అంశంతోపాటు.. కరోనా వైరస్‌ను ఎంతమేర కట్టడి చేయగలిగామన్న అంశం కీలకంగా నిలవనుంది. వైరన్‌ను అడ్డుకోగలిగితే.. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనున్నామన్న అంశానికీ ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం కరోనా విలయం మధ్యలో ఉన్నాం. దీంతో పరిస్థితులను అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. 

ప్యాకేజీలు సరే..
నిజానికి కరోనాను కేంద్ర బ్యాంకులకంటే సైన్స్‌ బాగా కట్టడి చేయగలుగుతుంది. ఇంతక్రితం 2008-09లో వచ్చిన సబ్‌ప్రైమ్‌ సంక్షోభాన్ని ప్రస్తుత పరిస్థితులతో పోల్చడం ఆందోళన కలిగిస్తోంది. అప్పట్లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది కనుక కేంద్ర బ్యాంకులు మానిటరీ విధానాల ద్వారా ఆర్థిక వ్యవస్థలకు అండగా నిలవగలిగాయి. స్టాక్‌ మార్కెట్లు రికవరీ అయ్యాయి. ఇది ఆర్థిక సంక్షోభంకాదుకదా? ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా వైరస్‌ సృష్టిస్తున్న కల్లోలం. దీంతో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపు, సహాయక ప్యాకేజీల ద్వారా పరిస్థితులను చక్కదిద్దాలనుకోవడం రెండో దశలో భాగంగా పేర్కొనాలి. నిజానికి వైరస్‌ను కట్టడి చేసేందుకు ఉద్ధేశించిన ద్రవ్య విధానాలకే తొలి ప్రాధాన్యముంటుంది. కరోనాకు ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పెట్టగలుగుతామో అప్పుడే వ్యవస్థలో రికవరీకి వీలుంటుంది.

భయాల ఎఫెక్ట్‌
కరోనా విస్తృతిపై పెరుగుతున్న ఆందోళనలు భయాలకు దారితీయడంతో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. వ్యక్తిగత, సంస్థాగత ఇన్వెస్టర్లనూ భయాలు ఆవహించాయి. ఇది నిలకడలేమికాదు.. ఆరోగ్యపరమైన సంక్షోభం చూపుతున్న ప్రభావం. నిజానికి 2019తోపాటు.. 2020లో తొలి ఏడు వారాల్లోనూ మార్కెట్లు అనూహ్య ర్యాలీ చేశాయి. ఇందువల్లనే పతనంకూడా ఇదే రీతిలో కనిపిస్తోంది. వెరసి 2018లో నమోదైన వాస్తవిక స్థాయిలకు మార్కెట్లు చేరుకుంటున్నాయి. 

విభిన్నమే..
నిజానికి మార్కెట్లలో తలెత్తే సంక్షోభాలు ఒకదానితో పోలిస్తే మరొకటి భిన్నంగా ఉంటాయి. 45ఏళ్లుగా చూస్తున్న అంశాల ప్రకారం 1990లలో ఏషియన్‌ కరెన్సీల సంక్షోభం, 2000లో డాట్‌కామ్‌ బబుల్‌, 2008లో సబ్‌ప్రైమ్‌ సంక్షోభం.. ఇలా.. విభిన్న సమస్యలు తలెత్తుతుంటాయి. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్లినప్పటికీ.. తదుపరి సంక్షోభం తలెత్తకుండా నివారించలేం. కరోనా తలెత్తేవరకూ ఏ ఒక్కరూ ప్రపంచ మహమ్మారి వ్యాధిపై అంచనాలు వేయలేదు. గ్లోబలైజేషన్‌ ద్వారా ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఒకదానితో మరోకటి అనుసంధానమై ఉన్నాయి. తద్వారా అంతర్జాతీయంగా వాణిజ్యం విస్తరిస్తూ వచ్చింది. ఈ బాటలో ప్రజా ఆరోగ్యంపైకంటే చౌకగా వస్తువులను అభివృద్ధి చేయడంపైనే అధికంగా దృష్టి పెట్టాం. పర్యావరణ పరిరక్షణ, నాణ్యమైన వాతావరణం వంటివి అంతగా ప్రాధాన్యమివ్వలేదు. ప్రస్తుతం ఎదురైన సంక్షోభం కారణంగా వేగవంతమైన గ్లోబల్‌ వృద్ధి కంటే నాణ్యమైన ఆర్థిక వ్యవస్థ కోసం పెట్టుబడులు వెచ్చించడానికి ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుందని గ్రహిస్తాం. కరోనా విస్తృతిపై వేలెత్తి చూపడంకంటే.. పేదరికాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. గ్లోబలైజేషన్‌ ద్వారా లబ్ది పొందాలనుకున్నప్పుడు మానవ వనరులపైనా దృష్టిపెట్టాలి.

అప్రమత్తత అవసరం
ఆర్థిక సమస్యల కారణంగా పతనమయ్యే మార్కెట్లలో తగ్గినప్పుడల్లా ఇన్వెస్ట్‌ చేసి లాభపడటం ఒక పద్ధతి. అయితే ప్రస్తుతం పరిస్థితులు వేరు. షేర్లు చౌక ధరలకు దిగివచ్చినప్పుడల్లా సొంతం చేసుకుంటూ పోర్ట్‌ఫోలియో నిర్మించుకుని.. మార్కెట్లు రికవర్‌ అయ్యే వరకూ వేచిచూడం ఓకే. అయితే ప్రస్తుతం మార్కెట్లలో ఇన్వెస్ట్‌చేసే వ్యూహాలను సమీక్షించుకోవడం అవసరమనిపిస్తోంది. ఉదాహరణకు కరోనా నివారణ తదుపరి ప్రపంచ ఆరోగ్యకర వృద్ధిని ప్రస్తావించాం. అంటే నాణ్యమైన వాతావరణం, పర్యావరణ పరిరక్షణ, పేదరికం తగ్గించడంపై దృష్టి.. అలాగని కంపెనీలన్నీ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ లేదా ప్రజా ఆరోగ్య రంగ మౌలికసదుపాయాలపై దృష్టిపెడతాయని కాదు. భవిష్యత్‌లో దీర్ఘకాలిక ధృక్పథంతో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే ఎలాంటి రంగాలు లేదా కంపెనీలను ఎంచుకోవాలన్న అంశంలో విభిన్నంగా ఆలోచించడం మేలు చేయవచ్చన్నది సూచన.You may be interested

వడ్డీరేటు 1.7 శాతం తగ్గొచ్చు: ఫిచ్‌

Wednesday 18th March 2020

వచ్చే ఆర్థిక సంవత్సరంలో(2021-22) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) వడ్డీ రేట్లను కట్‌ చేయవచ్చని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా వేస్తోంది. ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటును ప్రభావితం చేసే రెపో రేటు 1.7శాతం తగ్గించవచ్చని తెలిపింది. మొదట 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించవచ్చని అంచనా వేసినప్పటికీ కరోనా వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ ఏడాదిలో వడ్డీరేటును 175

మళ్లీ పతన బాట- బ్యాంకింగ్‌ దెబ్బ

Wednesday 18th March 2020

ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ కౌంటర్లలో భారీ అమ్మకాలు 28 శాతం కుప్పకూలిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1100 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్‌  323 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ- 8,644కు అమెరికా స్టాక్‌ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి తిరిగి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో మధ్యాహ్నానికల్లా సెన్సెక్స్‌ 1100 పాయింట్లు పడిపోయింది. 29,479 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో నిఫ్టీ 323 పాయింట్లు కోల్పోయి 8,644ను తాకింది. తద్వారా

Most from this category