News


దీర్ఘకాలంలో మార్కెట్‌పై కొవిడ్‌-19 ప్రభావం నిల్‌!

Tuesday 25th February 2020
Markets_main1582621486.png-32079

మెటల్‌ స్టాక్స్‌పై ప్రతికూల ప్రభావం
డీమార్ట్‌ గుడ్‌ కంపెనీ
అరబిందో ఫార్మాలో ఇన్వెస్ట్‌మెంట్‌
హెచ్‌యూఎల్‌కు పన్ను ప్రయోజనాలు
- నిశ్చల్‌ మహేశ్వరి, సెంట్రమ్‌ బ్రోకింగ్‌

కరోనా వైరస్‌.. దేశీ స్టాక్‌ మార్కెట్ల దీర్ఘకాలిక ఔట్‌లుక్‌పై ప్రభావాన్ని చూపే అవకాశాలు తక్కువేనంటున్నారు సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సీఈవో నిశ్చల్‌ మహేశ్వరి. అయితే కరోనా మరింత విస్తరిస్తే మెటల్‌ కౌంటర్లకు దెబ్బతగిలే వీలున్నట్లు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మార్కెట్లు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం...

ప్రపంచ దేశాలలో కరోనా విస్తరిస్తున్న ఆందోళనలతో సోమవారం అమెరికాసహా పలు స్టాక్‌ మార్కెట్లు షాక్‌తిన్నాయి. ఈ వొలాటిలిటీ మరో రెండు లేదా మూడు నెలలు కనిపించవచ్చు. అంతమాత్రాన ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో మార్పులకు కొవిడ్‌ కారణంకాకపోవచ్చు. చరిత్ర సైతం ఇదే చెబుతోంది,. గత ఐదు దశాబ్దాల కాలంలో పలు రకాల వైరస్‌లు తలెత్తాయి. ‍అయితే కరోనా స్వల్ప కాలంలో సమస్యలు సృష్టించవచ్చు. ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీర్ఘకాలంలో అనూహ్య మార్పులకు కరోనా కారణమయ్యే అవకాశాలు లేవనిపిస్తోంది.

డీమార్ట్‌- ఎస్‌బీఐ కార్డ్స్‌
డీమార్ట్‌లో ఇన్వెస్ట్‌ చేసినవారికి వీటిని విక్రయించడం ద్వారా ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవోలో దరఖాస్తు చేసుకోమని సలహా ఇవ్వబోము. నిజానికి డీమార్ట్‌ పటిష్ట కంపెనీ. షేరు ఖరీదుగా ఉందన్న అంశం విషయానికివస్తే.. గత ఏడాది కాలంగా బలమైన కంపెనీలు మరింత దూకుడు చూపుతూనే ఉన్నాయి. ఇందుకు ఈటీఎఫ్‌లు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ర్యాలీ చేస్తున్న కొన్ని ప్రధాన కంపెనీలలోకే ఈటీఎఫ్‌ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. దీంతో ఇండెక్సులలో ఈ కౌంటర్ల వెయిటేజీలు సైతం బలపడుతున్నాయి. ఒకవేళ ఎస్‌బీఐ కార్డ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు సొమ్ము అవసరమైతే.. డీమార్ట్‌ షేర్లలో విక్రయాన్ని సమర్ధించవచ్చు. 

అరబిందో గుడ్‌?
ఇటీవల యూఎస్‌ఎఫ్‌డీఏ నిర్ణయాల కారణంగా అరబిం‍దో ఫార్మా కౌంటర్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఈ కంపెనీ పట్ల సానుకూలంగా ఉన్నాం. రానున్న రెండేళ్లలో క్యాష్‌ఫ్లోలను మెరుగుపరచుకోగలదని భావిస్తున్నాం. ఈ షేరు క్షీణించినప్పుడల్లా కొనుగోలు చేసేందుకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. అయితే రెండు రోజుల్లోనే యూఎస్‌ఎఫ్‌డీఏ నిర్ణయాల్లో మార్పులను ఇంతక్రితం చూడలేదు. ఇది నియంత్రణ సంస్థల అంశంగనుక ఈ విషయంలో అభిప్రాయాలు చెప్పలేము.

వేదాంతా, హింద్‌ జింక్‌?
ప్రస్తుతం కరోనా వైరస్‌ పలు దేశాలకు విస్తరిస్తోంది. దీంతో ప్రపం‍చ ఆర్థిక వృద్ధిపై 0.25-0.5 శాతంమేర ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఇది మెటల్స్‌పై మాత్రమే కాస్త అధికంగా ప్రభావాన్ని చూపే అవకాశముంది. మెటల్స్‌ వినియోగంలో చైనాదే అగ్రస్థానం. రానున్న మూడు నెలల్లోనే చైనా తిరిగి సాధారణ స్థితికి రాకపోవచ్చు. ఫలితంగా మెటల్‌ కౌంటర్లను ఎంపిక చేసుకోకపోవడమే మేలు.

హెచ్‌యూఎల్‌ బెస్ట్‌
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ సాధారణ నిర్ణయాలలో భాగంగానే పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ సవరణల కారణంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న యూనిట్లపై మూడేళ్ల కాలంలో 15 శాతం పన్ను మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. ఈ నిబంధనలను హెచ్‌యూఎల్‌ వినియోగించుకునే వీలుంది. రూ. 35,000 కోట్ల బేస్‌పైన కూడా ప్రతీ ఏడాది అమ్మకాల పరిమాణంలో 5-6 శాతం వృద్ధిని సాధిస్తోంది. ఈ నేపథ్యంలో పన్ను ప్రయోజనాలను వినియోగించుకునే ప్రణాళికలను కంపెనీ అమలు చేసే అవకాశముంది.



You may be interested

ఫార్మా షేర్ల పతనం

Tuesday 25th February 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా మంగళవారం ఫార్మా షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ఫలితంగా మిడ్‌సెషన్‌ సమయానికి ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 2.60శాతం నష్టాన్ని చవిచూసింది. నేడు ఈ ఇండెక్స్‌ 8,153.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒక దశలో 2.66శాతం నష్టాన్ని చవిచూసి 7898.35 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది.

ఈ షేర్లను హోల్డ్‌ చేయొచ్చు

Tuesday 25th February 2020

కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి అంతర్జాతీయ వృద్ధి మందగమనంపై ఆందోళనలు రేకత్తించడంతో ప్రపంచఈక్విటీ మార్కెట్ల తీవ్ర నష్టాలను చవిచూశాయి. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ సైతం ఈ వారంలో వరుసగా రెండో రోజూ నష్టాల బాట పట్టింది. ప్రధాన బెంచ్‌మార్క్‌ సూచీలు 2వారాల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ప్రభుదాస్‌ లిల్లాధర్‌ 3కంపెనీల షేర్లను హోల్డ్‌ చేయమని సలహానిచ్చింది. అలాగే ఐసీఐసీఐ డైరెక్ట్‌

Most from this category