News


లాభాల కోసం కాంట్రా బెట్స్‌ బెటర్‌!

Saturday 23rd November 2019
Markets_main1574498095.png-29814

జిమిత్‌మోదీ సూచన
స్వల్పకాలానికి మార్కెట్లు పలు వార్తలకు అతిగా స్పందించే అవకాశం ఉందని, ఈ సమయంలో కాంట్రాబెట్స్‌ తీసుకోవడం మంచిదని సామ్‌కో సెక్యూరిటీస్‌ అనలిస్టు జిమిత్‌ మోదీ సూచిస్తున్నారు. నిఫ్టీ ఈ వారం 12100 పాయింట్లను దాటేందుకు గట్టి ప్రయత్నం చేసిందని, కానీ విఫలమైందని చెప్పారు. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ సూచీ ప్రస్తుత మార్కెట్‌ మూడ్‌ను ప్రతిబింబిస్తోందన్నారు. స్మాల్‌క్యాప్‌ సూచీ ప్రస్తుతం కరెక్టివ్‌ దశలో ఉంది. అయితే చార్టులను పరిశీలిస్తే భారీ అప్‌ట్రెండ్‌ ముందుందని, కార్పొరేట్‌ టాక్స్‌ కోత తర్వాత ఇది తొలి పతనమని చెప్పారు. స్క్రాపేజ్‌ పాలసీపై స్పష్టత వచ్చాక ఆటో రంగంలో అప్‌మూవ్‌ ఉంటుందన్నారు. ఇదే సమయంలో స్వల్పకాలానికి ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో డిజిన్వెస్ట్‌మెంట్‌తో సంబంధం ఉన్న కంపెనీల షేర్లకు దూరంగా ఉండడం మంచిదని సూచించారు. అంతర్జాతీయంగా యూఎస్‌ మార్కెట్లు జీవితకాల గరిష్ఠం దగ్గర కదలాడుతున్నాయని, ట్రంప్‌ అభిశంసన కీలకం కానుందని చెప్పారు. 
టెక్నికల్స్‌


నిఫ్టీ ప్రధాన సూచీతో పాటు స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు కరెక్టివ్‌ నిర్మితి చూపుతున్నాయి. ఇలాంటి సమయంలో భారీ ట్రేడ్లు భారీ నష్టాలకు దారి తీయవచ్చు. నిఫ్టీ చార్టుల్లో డోజీ ఏర్పరిచింది. వాల్యూంలు 30 శాతం పెరిగాయి. ఇది ఫోమో(ఎఫ్‌ఓఎంఓ) కొనుగోళ్లు ముగిశాయనేందుకు సంకేతం. ఇలాంటి ఒడిదుడుకుల సమయంలో వీలయినంత వరకు ట్రేడ్లు తగ్గించుకోవడం మంచిది. వచ్చేవారం కూడా సూచీల్లో ఆటుపోట్లు కనిపించవచ్చు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్యాకేజీల తర్వాత రియల్టీ రంగం షేర్లలో పతనం కనిపించింది. దీంతో ఈ షేర్లు చాలా కనిష్ఠాలకు జారాయి. వీటిలో కాంట్రాబెట్స్‌ను అన్వేషించవచ్చు. గత గణాంకాలు చూస్తే ఎక్కువసార్లు నవంబర్‌ బుల్లిష్‌ నెలగానే నిలిచింది. కానీ ఈ సారి ఇది రిపీటయ్యేలా కనిపించడం లేదు. You may be interested

పతనమైన షేర్లపైనే మా దృష్టి...మార్క్‌ మొబియస్‌

Saturday 23rd November 2019

‘లిక్విడిటీ గురించి ఆలోచిస్తే చైనా, ఇండియా, టర్కి, సౌత్‌ ఆఫ్రికా వంటి మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించొచ్చు. కానీ దీర్ఘకాల దృక్పథం ఉండి, ప్రైవేట్‌ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆఫ్రికాలోని దేశాలు మంచిది’ అని ఇన్వెస్ట్‌మెంట్‌ గురువు, మొబియస్‌, క్యాపిటల్‌ పార్టనర్స్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ మొబియస్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... మా కేటాయింపులు.. చైనాను ఇండియా అందుకుంటోంది. ఈ రెండు అతి పెద్ద దేశాలు.

ఫ్లాట్‌గా ముగిసిన పసిడి

Saturday 23rd November 2019

ప్రపంచమార్కెట్లో ఉదయం ఆర్జించిన లాభాలను కోల్పోయిన పసిడి ధర శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసింది. అమెరికా ఆర్థిక గణాంకాలు అంచనాలకు మించిన నమోదుకావడంతో డాలర్‌ బలపడటం పసిడి ఫ్లాట్‌ ముగింపునకు కారణమైంది. అమెరికాలో డిసెంబర్‌ కాంటాక్టు ఔన్స్‌ పసిడి ధర క్రితం ముగింపుతో ఎలాంటి లాభనష్టాలు లేకుండా 1,463.30 డాలర్ల వద్ద స్థిరపడింది. రాత్రి అమెరికా మార్కెట్‌ ఉదయం సెషన్‌లో వాణిజ్య చర్చల ఆందోళనల నేపథ్యంలో పసిడి ఫ్యూచర్లు 10డాలర్ల వరకు

Most from this category