News


ఇంకా అమ్మకాల మోడ్‌లో ఎఫ్‌పీఐలు?

Sunday 11th August 2019
Markets_main1565528298.png-27689

దేశియ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) ఔట్‌ ఫ్లో అగష్టు నెలలో కూడా భారీగా కొనసాగుతోంది. ఈ ఏడాది అగష్టు 1 నుంచి 9 వ తేదిల మధ్య, నికరంగా రూ.9,197 కోట్ల విదేశి పెట్టుబడుల ఉపసంహరణ జరిగిందని డిపాజిటరీలు విడుదల చేసిన సమాచారం తెలుపుతోంది. కాగా విదేశి ఫోర్టుపోలియో ఇన్వెస్టర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తే ఈ ధోరణి మారవచ్చని విశ్లేషకులు తెలిపారు. దేశియ అంతర్జాతీయ కారణాల వలన ఆగస్టులో కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్లలోనే రూ .9,197.06 కోట్ల నికర మొత్తాన్ని ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్నారు. ఆగస్టు 1-9 మధ్య కాలంలో రూ. 1,937.54 కోట్ల విదేశి పెట్టుబడులు దేశియ ఈక్విటీ మార్కెట్లలోకి రాగా, రూ. 11,134.60 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. మొత్తంగా రూ.రూ .9,197.06 కోట్ల నికర విదేశి పెట్టుబడుల ఉపసంహరణ జరిగిందని తాజా డిపాజిటర్ల డేటా పేర్కొంది.     
   ఆర్థిక సంవత్సరం 2019-20  నాటి కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ఎఫ్‌పీఐలపై (ఇండియాలో ట్రస్టులుగా, అసోషియేషన్‌ వ్యక్తులుగా నమోదు చేసుకున్న వాటిపై) అధిక పన్నులు ప్రకటించినప్పటి నుంచి విదేశి పెట్టుబడుల ఔట్‌ ఫ్లో కొనసాగుతోంది. ‘ అంతర్జాతీయంగా వాణిజ్యం మందగమనం ఉండడంతో పాటు, యుఎస్‌, యురొప్‌, చైనా దేశాల జీడీపీ వృద్థి మందగించడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారు’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, హెడ్‌ రిసెర్చ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌, బ్రెక్సిట్‌, ఇతర అంతర్జాతీయ రాజకీయ పరిణామాల వలన ఈ మందగమనం మరింత కాలం కొనసాగే అవకాశం ఉందనే ఆందోళనలు మదుపర్లను వెంటాడుతున్నాయని వివరించారు. ఆదాయ వృద్ధి మందగించడంతో దేశియ ఈక్విటీ మార్కెట్లు ఇన్వెస్టర్లను ఆకర్షించలేకపోతున్నాయని, బాండ్‌లు, బంగారం వంటి సురక్షితమైన ఆస్తుల వైపు ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారని ఆయన తెలిపారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడంతో పాటు, రుతుపవనాలు ఆలస్యం కావడం, కార్పోరేట్‌ ఆదాయాల వృద్ధి మందగించడం, అంతర్జాతీయంగా యుఎస్‌- ఇరాన్‌ ఉద్రిక్తతలు, యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వంటి దేశియ, అంతర్జాతీయ కారకాలు ఇండియా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి’ అని మార్నింగ్‌స్టార్‌, సీనియర్ ఎనలిస్ట్ మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. అయినప్పటికి ఎఫ్‌పీఐల సర్‌చార్జీపై ప్రభుత్వం తిరిగి వెనకడుగు వేసే అవకాశం ఉండడంతో మార్కెట్లలో కొంత సానుకూలత కనిపిస్తోందని తెలిపారు.You may be interested

ఆర్థిక చర్యలుంటాయి.. కానీ జీఎస్టీ రేటు తగ్గదు

Sunday 11th August 2019

వ్యవస్థలో ఉత్పాదక రంగాలకు, నిధుల లభ్యతను సులభతరం చేయడానికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కానీ జీఎస్‌టీ రేట్లను మాత్రం తగ్గించే అవకాశం లేదని పరిశీలకులు తెలిపారు. గతంతో పోల్చుకుంటే పన్నులు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావించడమే దీనికి కారణమని అన్నారు. ‘ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వివిధ బ్యాంకర్లు, విదేశీ, దేశీయ ఇన్వెస్టర్లతో పాటు, వివిధ వాటాదారులతో పరస్పర చర్చలు జరిపి  ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గత కొన్ని

ప్రభుత్వ చర్యలే .. 11,450 స్థాయికి తీసుకెళతాయి!

Saturday 10th August 2019

ప్రభుత్వం తీసుకునే సానుకూల చర్యల వలన మార్కెట్‌ తిరిగి 11,450 స్థాయికి చేరుకోగలదని సామ్‌కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ప్రభుత్వ చర్యలు..అవసరం ప్రస్తుతం మార్కెట్లను సానుకూలపరిచే అంశాలు  ఏమి లేవు. వాణిజ్య యుద్ధం, బలహీనమైన కరెన్సీ వంటి అంతర్జాతీయ కారకాలు మార్కెట్లను ఊహాగానాలపై నడిపించే అవకాశం ఉంది. ఎఫ్‌పిఐలపై సర్‌చార్జి పన్ను తగ్గుతుందని మార్కెట్లు అంచనా

Most from this category