News


వినియోగం తగ్గలే..! రూటు మార్చుకున్నదంతే..!

Tuesday 7th January 2020
Markets_main1578420750.png-30740

దేశంలో వినియోగం రూటు మార్చుకున్నందటున్నారు టెక్నోపార్క్‌ సీఎండీ అరవింద్‌ సింఘాల్‌. దీనికి నిదర్శంగా విద్య, శిక్షణ, ఆరోగ్య సంరక్షణ, వినోదం, విహారంపై గత మూడు త్రైమాసికాల్లో వినియోదారులు చేస్తున్న ఖర్చు బలంగా ఉందన్నారు. ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడిన సందర్భంగా సింఘాల్‌ దేశంలో వినియోగంపై తన విశ్లేషణాత్మక అభిప్రాయాలను తెలియజేశారు.

 

వినియోగం తగ్గలేదు..
‘‘వినియోగదారుల వ్యయాలు సేవల వైపు మళ్లుతున్నట్టు దీర్ఘకాలిక ధోరణి తెలియజేస్తోంది. దీంతో సరుకులపై చేసే వ్యయాలపై ఈ ప్రభావం ఉంటుంది. హిందుస్తాన్‌ యూనిలీవర్‌ వంటి కొన్ని ప్రత్యేక కంపెనీల డేటాను పరిశీలిస్తే ఇది తెలియదు. కానీ, దీని వెనుక దాగున్న ధోరణి ఏమిటంటే.. ఇక మీదట సరుకుల ఉత్పత్తి కంపెనీలు వృద్ధి విషయంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. కానీ, సేవల విభాగంలో విద్య, కోచింగ్‌, హెల్త్‌కేర్‌, వినోద, విహారం సేవల్లో వ్యయాల ధోరణి ఎంతో ఆసక్తికరంగా ఉంది. వీటిపై వినియోగదారులు చేస్తున్న వ్యయాలు గత మూడు నెలల కాలంలో బలంగానే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనూ మొత్తం​మీద వినియోగదారులు వీటి కోసం ఖర్చు చేస్తూనే ఉన్నారు. పండుగుల సమయంలో ఖర్చులను గమనిస్తే.. (మరో రెండుమూడు వారాల్లో డిసెంబర్‌ గణాంకాలు రానున్నాయి) మా స్వీయ అంచనా ప్రకారం గత అక్టోబర్‌-డిసెంబర్‌ కాలం వినియోగదారుల వ్యయం పరంగా మంచి త్రైమాసికం అవుతుంది. కంపెనీలు మంచి ఫలితాలను ప్రకటించనున్నాయి. అంతేకాదు నాలుగో త్రైమాసికంలో వినియోగ వ్యయంపైనా ఆశాభావంతోనే ఉన్నాను. వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత మెరుగ్గా ఉంటుంది. 

 

గ్రామీణ డిమాండ్‌
పంటల సాగు చాలా బాగుంటుందని అంచనా. గత మూడేళ్లుగా దెబ్బతిన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రుణ లభ్యత పెరుగుతోంది. ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకుంది. ఈ చర్యల పూర్తి స్థాయి ఫలితం ఇప్పటికీ కనిపించలేదు. అయితే, కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో పెట్టుబడుల వాతావరణం పుంజుకోనుంది. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంపై ఎంతో ఆశావహంగా ఉన్నాం. ఆర్థిక మందగనం నెలకొంది. కానీ, అదే సమయంలో స్థూల ఆర్థిక అంశాలు ఆర్థిక వ్యవస్థ రికవరీలో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. వినియోగదారుల సెంటిమెంట్‌ ఒక్క రాత్రిలో మారిపోగలదు. ఉద్యోగాల కల్పన కూడా 2021 ఆర్థిక సంవత్సరంలో మెరుగ్గా ఉంటుంది’’ అని సింఘాల్‌ వివరించారు.You may be interested

14 శాతం తగ్గనున్న కేబుల్‌, డీటీహెచ్‌ బిల్లు

Tuesday 7th January 2020

కేబుల్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవలకు సంబంధించి ట్రాయ్‌ నూతన మార్గదర్శకాలతో డీటీహెచ్‌/ కేబుల్‌ టీవీ నెలవారీ బిల్లుల భారం 14 శాతం వరకు ప్రస్తుత స్థాయి నుంచి తగ్గుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. టారిఫ్‌లకు సంబంధించి నూతన నియంత్రపరమైన కార్యాచరణను ట్రాయ్‌ గత వారమే ప్రకటించింది. దీంతో తక్కువ సబ్‌స్క్రిప్షన్‌కే టీవీ యూజర్లు మరిన్ని చానళ్లను వీక్షించే అవకాశం రానుంది. వచ్చే మార్చి 1 నుంచి ట్రాయ్‌ నూతన ఆదేశాలు

క్యు3లో మెరిసేదెవరు? నీరసించేదెవరు?

Tuesday 7th January 2020

మూడో త్రైమాసికంలో వివిధ రంగాల ఫలితాలపై అంచనాలు ఇలా ఉన్నాయి... 1. ఐటీ: టాప్‌ ఐటీ కంపెనీలు డాలర్‌ రెవెన్యూలో 1.5- 3 శాతం వృద్ది నమోదు చేయవచ్చు. విప్రో, టెక్‌మహీంద్రాలు ఈ దఫా మెరుగైన ఫలితాలు చూపవచ్చు. కంపెనీల మేనేజ్‌మెంట్‌ కామెంటరీ కీలకం కానుంది. దీనికితోడు రెవెన్యూ గైడెన్స్‌లో మార్పులను పరిశీలించాలి. బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో పనితీరు ఆధారంగా కంపెనీల ఫలితాలు ఉంటాయని అంచనా. 2. ఆటో:   ఆటో రంగంలో డౌన్‌ట్రెండ్‌ బాటమ్‌ అవుట్‌

Most from this category