News


ఇక బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీల కన్సాలిడేషన్‌!

Saturday 7th March 2020
Markets_main1583577443.png-32354

రానున్న దశాబ్ద కాలంలో నాణ్యమైన కంపెనీలకే పెద్దపీట
మొబైల్‌, సోషల్‌ మీడియా కారణంగానే కరోనా భయాల వ్యాప్తి
కరోనాతో టైటన్‌, నెస్లే, దివీస్‌, జీఎంఎం తదితరాలకు డిమాండ్‌

-సౌరభ్‌ ముఖర్జియా, మార్సెలస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌


దేశీయంగా గతంలోనూ యస్‌ బ్యాంక్‌ తరహా సమస్యలు తలెత్తాయి. యస్‌ బ్యాంక్‌ వ్యహారంపై కొద్ది నెలలుగా అనిశ్చితి కొనసాగుతూనే వచ్చింది. ఆలస్యమైనప్పటికీ చివరికి యస్‌ బ్యాంక్‌ సమస్యల అనిశ్చితికి చెక్‌ పడిందంటున్నారు మార్సెలస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ వ్యవస్థాపకులు, సీఐవో సౌరభ్‌ ముఖర్జియా. మార్కెట్లు, కంపెనీలు, ప్రయివేట్‌ రంగ బ్యాంకులు తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో సౌరభ్‌ పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం...

చెబుతూనే ఉన్నాం
దేశీయంగా అటు బ్యాంకింగ్‌లోనూ.. ఇటు నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల విభాగంలోనూ కన్సాలిడేషన్‌ కొనసాగనుంది. బ్యాంకింగ్‌ రంగంలో రెండు లేదా మూడు, ఎన్‌బీఎఫ్‌సీలలోనూ రెండు లేదా మూడు సంస్థలు దేశీయంగా ప్రధాన పాత్ర పోషించే వీలుంది. పెయింట్లు, అధెసివ్స్‌, బిస్కట్స్‌ తదితర రంగాలలో జరిగినట్లే పరిస్థితులు నెలకొనవచ్చు. యస్‌ బ్యాంక్‌ వార్షిక నివేదికలపై మేము మొదటినుంచీ బేరిష్‌గానే ఉన్నాం. అయితే దేశీయంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహీం‍ద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి అత్యంత నాణ్యమైన ఫైనాన్షియల్‌ సంస్థలు సైతం ఉన్నాయి. వీటికి మార్సెలస్‌ పోర్ట్‌ఫోలియోలో ఎప్పుడో చోటు కల్పించాం. దేశీయంగా  ఉత్తమ నియం‍త్రణలున్నట్లే నాణ్యమైన రుణదాత కంపెనీలు సైతం పుట్టుకొస్తున్నాయి. 

జపాన్‌ తరహాలో
కొంతకాలంగా పోలరైజేషన్‌పై మాట్లాడుతూ వస్తున్నాం. దేశీయంగా ఇలాంటి పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. జపాన్‌లో 1950- 1990 మధ్య కాలంలోనూ, దక్షిణ కొరియా ఆర్థిక వ్యస్థలో 1970-2000 మధ్యకాలంలోనూ ఫార్మలేజేషన్‌ దశ నడిచింది. కొరియా నికర లాభాల్లో సుమారు 15 కంపెనీల ఆర్జనలే 75 శాతంవరకూ ఉంటాయి. దేశీయంగానూ ఇలాంటి పరిస్థితులకు వీలున్నట్లు భావిస్తున్నాం. మా అభిప్రాయం ప్రకారం రానున్న దశాబ్ద కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ సాధించనున్న పోలరైజేషన్‌ విభిన్న తరహాలో ఉండనుంది.

ఇదీ తీరు
దేశీయంగా అత్యంత నాణ్యమైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకునే తీసుకుంటే.. 6 శాతం మార్కెట్‌ వాటానే కలిగి ఉంది. దశాబ్ద కాలంలో ఈ వాటా 12 శాతానికి చేరిందనుకుందాం. అప్పుడు బ్యాంక్‌ విలువ 700-800 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చు. ఇదే పోలరైజేషన్‌ అంటే. పోలరైజేషన్‌ ప్రభావంతో రానున్న పదేళ్లలో 20 కంపెనీల నికర లాభాలు దేశీయంగా ముప్పావు వంతు వాటాను పొందే అవకాశముంది. రానున్న కాలంలో బజాజ్‌ ఫైనాన్స్‌, పిడిలైట్‌ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తరహా నాణ్యమైన కంపెనీలు 25-30 వరకూ మార్కెట్లో వాటాను పెంచుకుంటూ వెళ్లే అవకాశమున్నట్లు భావిస్తున్నాం. నాణ్యతలేని యస్‌ బ్యాంక్‌ తరహా సంస్థలు ఇప్పటికే నీరసించాయి. బ్యాంకింగ్‌ విషయానికివస్తే.. యాక్సిస్‌, ఐసీఐసీఐ వంటి సంస్థలు మరింత మార్కెట్‌ వాటాను సొంతం చేసుకోవచ్చు. ఇదే విధంగా ఎన్‌బీఎఫ్‌సీల రంగంలో బజాజ్‌ ఫైనాన్స్‌ ముందుండవచ్చు. బలమైన సంస్థలు చౌకగా నిధుల సమీకరణను చేపట్టగలుగుతాయి. తద్వారా బిజినెస్‌ విస్తరణకు వీలు చిక్కుతుంది. 

మొబైల్‌ భయాలు
మొబైల్‌ ఫోన్ల వాడకం ద్వారానే కరోనా వైరస్‌ భయాలు మరింత వ్యాప్తి చెందుతున్నాయి. కరోనా కారణంగా ఫార్మా, ఆటో రంగాలలో కొంతమేర సరఫరా సమస్యలు తలెత్తనున్నాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసరవచ్చు. నిజానికి వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావానికి అవకాశం తక్కువే. ప్రధానంగా మొబైల్‌ ఫోన్లు, సోషల్‌ మీడియా కారణంగానే భయాలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. దీంతో కరోనా మానసికంగా అధిక ప్రభావాన్ని చూపుతోంది. ఇందువల్లనే బంగారు ఆభరణాల సంస్థ టైటన్‌, ఫార్మా రంగ ఏపీఐల తయారీ దివీస్‌ లేబ్స్‌, గ్లాస్‌లైన్‌డ్‌ వెస్సల్స్‌ తయారీ జీఎంఎం ఫాడ్లర్‌, పాల ఉత్పత్తుల సంస్థ నెస్లే వంటి కంపెనీల కౌంటర్లకు ఇటీవల డిమాండ్‌ పెరిగింది. 
 You may be interested

యస్‌బ్యాంక్‌ వైఫల్యం భారత్‌కు రిస్కే: నోమురా

Saturday 7th March 2020

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న యస్‌బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు కేంద్రంతో పాటు ఆర్‌బీఐ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ నోమురా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. యస్‌బ్యాంక్‌ వైఫల్యం భారతదేశ ఆర్థికవ్యవస్థలో ఇప్పటికీ దాగి ఉన్న క్రిడెట్‌ రిస్క్‌ సూచిస్తుందని నోమురా హెచ్చరించింది.  దేశంలోనే ఐదో అతిపెద్ద ప్రైవేట్‌ రుణదాతగా పేరొందిన యస్‌బ్యాంక్‌కు మొత్తం రుణాల్లో 2.3 శాతం అకౌంట్లు, 1.6శాతం బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. ఎస్‌బీఐ ద్వారా 49శాతం

వాడని కార్డులు 16 తర్వాత.. ఆన్‌లైన్‌లో పనిచేయవు!

Saturday 7th March 2020

 ఇప్పటిదాక ఒక్కసారికూడా ఆన్‌లైన్‌ లావాదేవీల్లో ఉపయోగించని క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు,​ కాంటాక్ట్‌లెస్‌ కార్డులు మార్చి 16 తర్వాత పనిచేయవు. ప్రస్తుత కాలంలో లావాదేవీలన్నీ డిజిటల్‌ కావడంతో వేగంగా పనులు జరిగిపోతున్నాయి. దాదాపు 70 శాతం మంది  ఆన్‌లైన్‌లో క్రయవిక్రయాలు జరుపుతూ తమపనులను ఇట్టే పూర్తిచేసుకుంటున్నారు. డిజిటల్‌ పేమెంట్స్‌ పెరుగుతున్న కొద్దీ సైబర్‌ ఆర్థిక మోసాలు అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) 2020 మార్చి

Most from this category