News


బంగారంపై బాదుడు తగ్గేనా..?

Tuesday 14th January 2020
news_main1578973700.png-30904

  • దిగుమతి సుంకాలు తగ్గించాలని విన్నపాలు
  • ప్రస్తుతం ఈ రేటు 12.5 శాతం
  • భారీ వడ్డనతో కుదేలైన పరిశ్రమ

న్యూఢిల్లీ: పసిడిపై ప్రస్తుతం అమల్లో ఉన్న 12.5 శాతం ఇంపోర్ట్‌ డ్యూటీ (దిగుమతి సుంకం)ని సాధ్యమైనంత మేర తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. వచ్చే నెల తొలి వారంలో ప్రవేశపెట్టనున్న 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని విన్నవించినట్లు విశ్వసనీయ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఇప్పటికే ఈ రేటును 4 శాతానికి తగ్గించాలని దేశీయ రత్నాభరణాల పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే కాగా, పరిశ్రమను ఆదుకోవడం కోసం ఈ తగ్గింపు తప్పనిసరని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విన్నపాన్ని ప్రభుత్వం మన్నిస్తే.. సుంకాల కోత మేర బంగారం ధరల్లో తగ్గింపు ఉంటుందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, భారత్‌లో అధిక శాతం సప్లై దిగుమతుల ద్వారానే కొనసాగుతోంది. ఏడాదికి 800-900 టన్నుల పసిడిని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది.

ఎందుకింత రేటు...
గతేడాది బడ్జెట్‌కు ముందు బంగారంపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. అయితే, విదేశాల నుంచి ఈ కమోడిటీ దిగుమతులు గణనీయంగా పెరిగిపోతూ ఉండడం వల్ల కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌) అదుపు తప్పుతోందని, దీనిని కట్టడి చేయడంలో భాగంగా గత బడ్జెట్‌లో 12.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ పెంపు తరువాత ఫలితాలు కేంద్రం అనుకున్న విధంగా ఉన్నప్పటికీ.. పరిశ్రమ మాత్రం కుంగిపోయింది. వాణిజ్య శాఖ తాజా వివరాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-నవంబర్‌ కాలంలో క్యాడ్‌ 20.57 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. అంతక్రితం ఏడాది (2018-19) ఇదేకాలంలో 22.16 బిలియన్‌ డాలర్లు కాగా, ఈ సారి 7 శాతం తగ్గుదల నమోదైంది. జీడీపీలో క్యాడ్‌ 0.9 శాతానికి దిగివచ్చింది. ఇదే విధంగా గడిచిన ఎనిమిది నెలల్లో వాణిజ్య లోటు కూడా 106.84 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. అంతక్రితం ఇదేకాలంలో ఇది 133.74 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. తగ్గిన దిగుమతుల కారణంగా దేశీయ రత్నాభరణాల పరిశ్రమకు మాత్రం తగిన ప్రోత్సాహం లభించలేదు. ఏప్రిల్‌-నవంబర్‌ కాలంలో ఈ రంగ ఎగుమతులు 1.5 శాతం తగ్గుదలను నమోదుచేయడమే ఇందుకు నిదర్శనం. దిగుమతి సుంకాలు అధికంగా ఉన్న కారణంగా పలు కంపెనీలు సరిహద్దు దేశాలకు వెళ్లిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంతటి రేటు ఉండడం సమంజసం కాదని వాణిజ్య శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. 
 You may be interested

హైదరాబాద్‌లో క్లీన్‌ హార్బర్స్‌ కొత్త కార్యాలయం

Tuesday 14th January 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఎన్విరాన్‌మెంటల్‌ సేవల్లో ఉన్న యూఎస్‌ కంపెనీ క్లీన్‌ హార్బర్స్‌ హైదరాబాద్‌లో నూతన కార్యాలయం ఏర్పాటు చేసింది. 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్‌ సిటీలో ఈ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను (జీసీసీ) నెలకొల్పారు. ఉత్తర అమెరికా తర్వాత సంస్థకు ఇదే అతిపెద్ద జీసీసీ. 650 మంది కూర్చునే వీలుగా ఏర్పాటు ఉంది. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు ఉన్నారు. 12-18 నెలల్లో ఈ సంఖ్యను

కంపెనీలకు నిరసనల సెగ..

Tuesday 14th January 2020

సీఏఏ, ఆర్‌ఎస్‌ఎస్‌ వివాదంలో టెక్‌ సంస్థలు బ్రాండ్‌ అంబాసిడర్లు, చీఫ్‌ల వైఖరులతో సమస్యలు చిక్కుల్లో పాలసీబజార్, జోహో, యాక్సెంచర్‌ తదితర సంస్థలు న్యూఢిల్లీ: వివాదాస్పద అంశాలపై చెలరేగే నిరసనల్లో అప్పుడప్పుడు అనుకోని విధంగా కంపెనీలు కూడా ఇరుక్కుంటున్నాయి. దీంతో వ్యతిరేకత సెగ వాటికి కూడా గట్టిగానే తగులుతోంది. తాజాగా సీఏఏ–ఎన్‌ఆర్‌సీ అంశం, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులపై దాడులు, ఆరెస్సెస్‌ కార్యక్రమాలు తదితర అంశాలపై బ్రాండ్‌ అంబాసిడర్లు, తమ సంస్థల చీఫ్‌ల వైఖరులు

Most from this category