News


జీ వాటాను కోనుగోలుకు కామ్‌కాస్ట్‌ కన్సార్షియం రెడీ

Thursday 4th July 2019
Markets_main1562237750.png-26803

 జీ ఎంటర్‌ప్రైజెస్‌ కోసం బిడ్‌ దాఖలుచేయడానికి కామ్‌కాస్ట్‌ నాయకత్వంలోని కన్సార్షియం ప్రయత్నిస్తోందని ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ప్రైవేట్‌ ఈక్వీటీ సంస్థ బ్లాక్‌ స్టోన్‌, జేమ్స్‌ మర్డోక్స్‌ లుపా సిస్టమ్స్‌ ఈ కన్సార్షియంలో భాగస్వామిగా ఉన్నాయని తెలిపింది. ఇవే కాకుండా కామ్‌కాస్ట్‌ మాజీ సీఎఫ్‌ఓ మైకెల్‌ ఏంజిల్‌కిస్‌ సంస్థైనా అటైరోస్‌ కూడా కన్సార్టియంలో ఉందని వివరించింది. ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయని, లావాదేవిగా మారకపోవచ్చన్న అనుమానం వ్యక్తం చేసింది.  ఫేస్‌బుక్‌ కూడా ఆసక్తి చూపడంతో జీ ఎంటర్‌‍ప్రైజెస్‌లోని స్టాకులను కొనుగోలు చేయడానికి కామ్‌కాస్ట్‌, బ్లాక్‌ స్టోన్‌, ఫేస్‌బుక్‌, అటైరోస్‌ కంపెనీలు ప్రతిస్పందించినట్టవుతుంది. వాల్ట్‌ డిస్నీతో ఒప్పందం కారణంగా లూపా సిస్టమ్స్‌ 9-10 శాతం కం‍టే ఎక్కువ వాటాను కొనుగోలు చేయడానికి వీలులేదు. జీ ప్రమోటర్లు వారి వాటాను అమ్ముకోడానికి వ్యూహాత్మకమైన భాగస్వామిని వెతుకుతున్నామని 2018 నవంబర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే.



You may be interested

భిన్న మార్గాల్లో బ్లూచిప్‌, స్మాల్‌క్యాప్స్‌ 

Thursday 4th July 2019

స్మాల్‌ క్యాప్‌ కంపెనీలతో పోలిస్తే బ్లూచిప్‌ షేర్లు మంచి ప్రదర్శన చేస్తున్నాయి. ఏడాదికి పైగా ఇదే దృశ్యం ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ముందు కదలాడుతోంది. ఆర్థిక రంగ మందగమనంలో ఇన్వెస్టర్లు చిన్న కంపెనీల్లో పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. దీంతో దశాబ్ద కాలంలోనే బ్లూచిప్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల మధ్య అంతరం గరిష్ట స్థాయికి చేరింది.    కేంద్రంలో పూర్వపు ప్రభుత్వానికే ఓటర్లు భారీ మెజారిటీతో పట్టం కట్టడంతో ఈక్విటీ మార్కెట్ల

నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో ముగింపు

Thursday 4th July 2019

బడ్జెట్‌కు ముందురోజు మార్కెట్‌ స్వల్ప లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 68 పాయింట్ల లాభంతో 39,908 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 11,946.75 వద్ద నిలిచింది. అంతర్జాతీయం మార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతావరణం, పారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 33పైసలు బలపడటం తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. నేడు ఆర్థిక సంవత్సరపు సర్వే విడుదల కావడంతో పాటు రేపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ట్రేడింగ్‌

Most from this category