News


20 శాతం పడిపోయిన కేఫ్‌ కాఫీ డే షేరు

Tuesday 30th July 2019
Markets_main1564464118.png-27400

కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ సోమవారం రాత్రి నుంచి అదృశ్యమవ్వడంతో ఈ కంపెనీ షేరు విలువ మంగళవారం 20 శాతం పడిపోయి రూ. 153.40 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 20 శాతం పతనం వద్ద డౌన్‌ సర్య్కూట్‌ ఫ్రీజ్‌ అయ్యిందని విశ్లేషకులు తెలిపారు. సోమవారం రాత్రి సిద్ధార్థ బెంగుళూరు నుంచి సక్లేష్పూర్ బయలుదేరారు. కాగా తన రూట్‌ను మార్చుకొని మంగళూరు వెళ్లారని, దారిలో నేత్రావతి నది వంతెన వద్ద కారు దిగారని డ్రైవర్‌ వివరించారు. కారు దిగే సమయంలో ఎవరితోనో ఫోనులో మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. కాగా సిద్ధార్థ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అంతేకాకుండా సిద్ధార్థ బోర్డు డైరక్టర్లకు రాసిన ఉత్తరం ఒకటి కనుగొన్నారు. 

సిద్ధార్థ బోర్డు డైరక్టర్లకు రాసిన ఉత్తరంYou may be interested

కంపెనీల వేటలో డాక్టర్ రెడ్డీస్‌..

Tuesday 30th July 2019

క్యూ1లో లాభం 45 శాతం అప్‌ రూ. 663 కోట్లుగా నమోదు ఆగస్టు నుంచి కొత్త సీఈవోగా ఎరెజ్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) తాజాగా మరింత వృద్ధి సాధించే దిశగా ఇతర కంపెనీలను కొనుగోలు చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు వివిధ దశల్లో ఉన్నాయి. రుణ, ఈక్విటీ నిష్పత్తి కనిష్ట స్థాయిలో ఉండటంతో ఇతర సంస్థల కొనుగోలుకు ఆర్థికంగా కొంత

మార్కెట్‌లోకి బిగ్‌బాస్‌

Tuesday 30th July 2019

ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు లిస్ట్‌ అయితే దేశంలో టాప్‌ కంపెనీగా అవతరణ ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌ వెనక్కి న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజ సంస్థ ఎల్‌ఐసీ షేర్లను కొనుగోలు చేసే రోజు భవిష్యత్తులో చూసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పెట్టుబడుల ఉపసం‍హరణ/వాటాల అమ్మకాల ద్వారా కేంద్రంలోని మోదీ సర్కారు పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు ప్రాధాన్యం ఇస్తుండడంతో, ఎల్‌ఐసీ లిస్టింగ్‌ కూడా ప్రభుత్వ అజెండాలో భాగంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ

Most from this category