News


ఏడాది కనిష్ఠానికి 99 స్టాకులు

Tuesday 13th August 2019
Markets_main1565690197.png-27741

ఎన్‌ఎస్‌ఈ మంగళవారం ట్రేడింగ్‌లో సుమారుగా 99 స్టాకులు వాటి 52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి. అరవింద్ ఫ్యాషన్స్, భండారి హోసిరీ ఎక్స్‌పోర్ట్స్‌, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా షేర్లు వాటి 52 వారాల కనిష్టాన్ని తాకాయి. వీటితో పాటు కాఫీ డే ఎంటర్ప్రైజెస్, కాక్స్ అండ్‌ కింగ్స్, జీఎఫ్ఎల్, ఐజీ పెట్రోకెమికల్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, లెమన్ ట్రీ హోటల్స్, షెమరూ ఎంటర్‌టైన్‌మెంట్‌, టాటా స్టీల్, సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు కూడా వాటి 52 వారాల కనిష్టాన్ని తాకిన స్టాక్‌లలో ఉన్నాయి . దేశీయ బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 50 మధ్యాహ్నం 3.16 సమయానికి 184.05 పాయింట్లు పతనమయ్యి, 10,925.60 వద్ద ట్రేడవుతుండగా, బీఎస్‌ఈ సెన్సెక్స్ 638.94 పాయింట్లు కోల్పోయి 36,942.97 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో ఆర్‌ఐఎల్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, గెయిల్ లాభాలు పొందిన షేర్లలో ముందుండగా,  భారతి ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం, బ్రిటానియా, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయిన షేర్లలో ముందున్నాయి.



You may be interested

మార్కెట్లో మళ్లీ అమ్మకాల సునామి

Tuesday 13th August 2019

623 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌  183 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ  రెండు ట్రేడింగ్‌ సెషన్లలో భారీ ర్యాలీ అనంతరం మార్కెట్లో మళ్లీ అమ్మకాల సునామి నెలకొంది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 624 పాయింట్లు నష్టపోయి 37000 స్థాయిని కోల్పోయి 36,958 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 184 పాయింట్లను కోల్పోయి 11100 స్థాయి దిగువన 10,925 వద్ద ముగిసింది. కేంద్రం పన్ను రాయితీలను ప్రకటించనున్నదనే అంచనాలతో  గతవారం గురు, శుక్రవారాల్లో స్టాక్‌ సూచీలు 2 శాతంపైగా జంప్‌చేసిన

హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం...భారీ పతనం

Tuesday 13th August 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లిమిడెట్‌ షేర్లు 5శాతం క్షీణించగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 3శాతం నష్టపోయాయి. ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజి కలిగిన ఈ ద్వయం పతనంతో సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు భారీగా పాయింట్లను కోల్పోయాయి. నేడు నిఫ్టీ కోల్పోయిన 183.55 పాయింట్లలో ఈ రెండు షేర్లవే 75 పాయింట్లు కావడం విశేషం. హెచ్‌డీఎఫ్‌సీ :- నేడు బీఎస్‌ఈలో రూ.2166.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

Most from this category