News


నిఫ్టీ టార్గెట్‌13800 !

Friday 22nd November 2019
Markets_main1574413088.png-29788

సీఎల్‌ఎస్‌ఏ అంచనా
నిఫ్టీ 12వేల పాయింట్లను దాటేందుకు ఆపసోపాలు పడుతోంది. గత గరిష్ఠం 12100 పాయింట్లను దాటితే అప్‌మూవ్‌ ఉంటుందని నిపుణులు భావిస్తున్నా, నిఫ్టీ ప్రస్తుతానికి 12వేల స్థాయిని విజయవంతంగా అధిగమించలేకపోతోంది. ఇక్కడకు వచ్చినప్పుడల్లా ప్రాఫిట్‌ బుకింగ్‌ను ఎదుర్కొంటోంది. కొన్ని సెషన్లుగా 11850- 12000 పాయింట్ల రేంజ్‌లో కదలాడుతోంది. సెప్టెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్‌ టాక్స్‌ కోతతో నిఫ్టీ ఒక్కమారుగా ర్యాలీ మూడ్‌లోకి వచ్చింది. నెలన్నరకాలంలో నిఫ్టీ 10700- 12000 పాయింట్లను చేరుకుంది. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు క్యు2 ఫలితాల్లో చాలా కంపెనీలు ప్రతిబింబిచాయి. చాలా కంపెనీల ఎర్నింగ్స్‌ మెరుగుపడ్డాయి. దీంతో అనలిస్టులు భవిష్యత్‌ ఎర్నింగ్స్‌పై అంచనాలు పెంచుతున్నారు.

ఈ నేపథ్యంలో నిఫ్టీ అప్‌మూవ్‌ కొనసాగాలంటే 12070- 12118 పాయింట్ల రేంజ్‌ను దాటాలని సీఎల్‌ఎస్‌ఏ అనలిస్టు లారెన్స్‌ బాలన్కో చెప్పారు. ఈ రేంజ్‌ తదుపరి దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌కు ప్లాట్‌ఫామ్‌గా మారుతుందన్నారు. ఈ స్థాయిని విజయవంతంగా దాటి పరిరక్షించుకుంటే నిఫ్టీ లాంగ్‌టర్మ్‌లో 13700- 13800 పాయింట్ల వరకు చేరగలదన్నారు. దిగువన 11098- 11310 రేంజ్‌లో గట్టి మద్దతు ఉందని, దీన్ని కోల్పోతే పతనం బాటలోకి పయనిస్తుందని విశ్లేషించారు. 



You may be interested

ఎన్‌టీపీసీపై మోర్గాన్‌స్టాన్లీ, సిటి బుల్లిష్‌

Friday 22nd November 2019

అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ, ప్రభుత్వరంగ పవర్‌ దిగ్గజమైన ఎన్‌టీపీసీ షేర్లపై రేటింగ్‌ను ‘ఈక్వల్‌ వెయిట్‌’ నుంచి ‘ఓవర్‌ వెయిట్‌’కు నవీకరించింది. అంతేకాకుండా ఈ కంపెనీ షేరు టార్గెట్‌ ధరను రూ. 147 నుంచి రూ. 152కు పెంచింది. ఫలితంగా ఈ కంపెనీ షేరు విలువ శుక్రవారం సెషన్‌లో 2 శాతానికి పైగా లాభపడి ట్రేడవుతోంది. కాగా మోర్గాన్‌ స్టాన్లీ ఇచ్చిన ఈ టార్గెట్‌ ధర, ప్రస్తుత మార్కెట్‌

రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌తో ఐటీ షేర్లలో అమ్మకాలు..!

Friday 22nd November 2019

ప్రముఖ రేటింగ్‌ సంస్థ గోల్డ్‌మెన్‌ శాష్యూ ఐటీ రంగంపై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో శుక్రవారం ఈ రంగానికి చెందిన షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. దేశీయ ఐటీ రంగం రానున్న రోజుల్లో  చక్రీయ అవరోదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఐటీ రంగ వాల్యూవేషన్‌ చారిత్రాత్మక సగటు కంటే ప్రీమియం స్థాయిలో ఉన్నట్లు రేటింగ్‌ సంస్థ తన నివేదికలో తెలిపింది. వ్యవస్థలో చక్రీయ మందగమనం ప్రభావం కారణంగా ఆయా ఆయా

Most from this category