News


భారతీ ఎయిర్‌టెల్‌ పట్ల సీఎల్‌ఎస్‌ఏ బుల్లిష్‌

Friday 6th December 2019
Markets_main1575655763.png-30099

టెలికం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ పట్ల అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సానుకూలంగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ ఏజీఆర్‌ బకాయిలు చెల్లింపుల కోసం గాను 3 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2 బిలియన్‌ డాలర్లను క్యూఐపీ రూపంలో, మరో బిలియన్‌ డాలర్లు డెట్‌ రూపంలో సమీకరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాల నేపథ్యంలో రిస్క్‌-రాబడుల దృష్ట్యా ఎయిర్‌టెల్‌ సానుకూలంగా ఉందని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. 

 

నిఫ్టీ-50 కంపెనీల్లో గత ఏడాది కాలంలో అత్యధికంగా 55 శాతం ర్యాలీ చేసింది ఎయిర్‌టెల్‌ షేరు కావడం గమనార‍్హం. కంపెనీ తలపెట్టిన 3 బిలియన్‌ డాలర్ల నిధులను కూడా ఈక్విటీ రూపంలో సమీకరించినా ఇప్పుడున్న ఈక్విటీ 10 శాతమే పెరుగుతుందని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. ఇదంతా సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా చోటు చేసుకున్న పరిణామమేనని, కోర్టులో కంపెనీ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ విచారణకు వేచి ఉన్నట్టు పేర్కొంది. ఎయిర్‌టెల్‌ స్టాక్‌కు బై రేటింగ్‌ను కొనసాగిస్తూ టార్గెట్‌గా రూ.560ను ఇచ్చింది. ప్రస్తుత స్థాయి నుంచి 25 శాతం అధికం ఇది. ఏజీఆర్‌ చెల్లింపుల రిస్క్‌ భారతీ ఎయిర్‌టెల్‌కు రూ.34,300 కోట్ల వరకు (4.7 బిలియన్‌ డాలర్లు) ఉండొచ్చని, ఇందులో 75 శాతం వడ్డీ, పెనాల్టీలేనని తెలిపింది. కంపెనీ నిధుల సమీకరణ తక్షణ నిధుల చెల్లింపు రిస్క్‌ను తగ్గిస్తుందని సీఎల్‌ఎస్‌ఏ వివరించింది. ఎయిర్‌టెల్‌ క్యుములేటివ్‌గా 2020 ఆర్థిక సంవత్సరం వరకు 40 శాతం టారిఫ్‌లను పెంచుతుందని అంచనా వేసింది. 

 

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ రూ.23,045 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ప్రధానంగా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల బాధ్యతలను ఖాతాల్లో చూపించింది. టెలికం సేవలు కాకుండా ఇతర ఆదాయం కూడా స్థూల ఆదాయం పరిధిలోకే వస్తుందని, ఆ మొత్తంపైనా చార్జీలు చెల్లించాలన్న ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు ఇటీవలి తన తీర్పులో సమర్థించింది. దీంతో వొడాఫోన్‌ఐడియా, ఎయిర్‌టెల్‌ ఇతర టెలికం కంపెనీలు మొత్తం మీద ప్రభుత్వానికి రూ.1.4 లక్షల కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇందులో ఎయిర్‌టెల్‌ రూ.62,187 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.54,184 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. You may be interested

సౌదీ ఆరామ్‌కో..... ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ !

Saturday 7th December 2019

2,560 కోట్ల డాలర్లతో ‘అలీబాబా’ రికార్డ్‌ బ్రేక్‌ ఈ నెల 12న సౌదీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్‌ ! రియాద్‌: ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్‌ విలువ గల కంపెనీగా సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం, సౌదీ ఆరామ్‌కో అవతరించనున్నది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) నిలిచింది. ఐపీఓలో భాగంగా తన షేర్‌ ధరను 32 రియాల్స్‌(8.53 డాలర్లు-రూ.601)గా  సౌదీ ఆరామ్‌కో నిర్ణయించింది.

సైక్లికల్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌పై ఫోకస్‌..

Friday 6th December 2019

ఇన్వెస్టర్లు అధిక వ్యాల్యూషన్‌ కలిగిన (నాణ్యమైన కంపెనీలు) కంపెనీల నుంచి సైక్లికల్‌, నాణ్యమైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌వైపు దృష్టి సారించాలని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోదన్‌ నాయర్‌ సూచించారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు.   ఆర్‌బీఐ పరపతి విధానం.. రేట్లను మార్చకూడదని ఎంతో ఆలోచించి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఐదు పర్యాయాలు తగ్గించిన

Most from this category