News


రిలయన్స్‌ టార్గెట్‌ రూ.2,010: సీఎల్‌ఎస్‌ఏ

Friday 6th December 2019
Markets_main1575626036.png-30095

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు టార్గెట్‌ ధరను అప్‌గ్రేడ్‌ చేసింది. ఇటీవల కాల్‌, డేటా సేవలపై సుంకాలను 35శాతం పెంచడంతో నిర్వహణ లాభం 1.1 బిలియన్ డాలర్ల నుండి 1.3 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో షేరుకు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.2,010లకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

‘‘రిలయన్స్‌ జియో కాల్‌, డేటాలపై తన ప్రత్యర్థి కంపెనీల కంటే టారీఫ్‌లను తక్కువ పెంచింది. వచ్చే ఏడాది 2021నాటికి టారీఫ్‌లను 10శాతం పెంచే అవకాశం ఉంది. ఇంటర్‌కనెక్ట్ ఖర్చులు మా అంచనా కంటే తగ్గవచ్చు. సబ్‌స్క్రెబర్లు 84 రోజుల ప్లానింగ్‌ కంటే 28 రోజుల ప్లానింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. దీంతో  ఒక్కో కస్టమర్ నుంచి లభించే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) పెరగవచ్చు. తద్వారా ఆదాయ అంచనాలు 1-8శాతం పెరగవచ్చు’’ అని సీఎల్‌ఎస్‌ఏ తన నివేదికలో పేర్కోంది.   

ఫైబర్‌ వ్యాపారం, ఆరాంకో ఒప్పందాలు దాదాపు తుది దశలో ఉండటం, పెట్‌కోక్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ప్రారంభం, రిటైల్ రంగంలో దాని ‘న్యూ కామర్స్’ వ్యాపారాన్ని ప్రారంభించడం, డిజిటల్ వ్యాపారంలో వాటా అమ్మక యోచన తదితర అంశాలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు రానున్న రోజుల్లో కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. టారీఫ్‌ల పెంపు ప్రయోజనంతో పాటు ఐఓఎం నుంచి రీఫైనరీ మార్జిన్ల లాభాలతో షార్ట్‌ టర్మ్‌లో కంపెనీ ఆదాయ వృద్ధి వేగంగా పెరుగుతుంది. మార్చి 2021 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ విలువ 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది.

బ్లూబర్గ్‌ నివేదికల ప్రకారం రిలయన్స్‌ షేరు 29 బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను, 6 బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘హోల్డ్‌’’ రేటింగ్‌ను, రెండు బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘సెల్‌’’ రేటింగ్‌ను కేటాయించాయి. మొత్తం 37 బ్రోకరేజ్‌ సంస్థల్లో సీఎల్‌ఎస్‌ఏ అత్యధిక రేటింగ్‌ను కేటాయించింది.

సీఎల్‌ఎస్‌ఏ రేటింగ్‌ పెంపుతో శుక్రవారం ఇంట్రాడేలో 1.25శాతం పెరిగి రూ.1568.20 స్థాయిని అందుకుంది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గత ముగింపు(రూ.1550.30)తో పోలిస్తే అరశాతం లాభంతో రూ.1558 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1055.35, రూ.1614.00లుగా ఉన్నాయి. ఈ నవంబర్‌ 28న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.10లక్షల కోట్లను అందుకున్న సంగతి తెలిసిందే. 



You may be interested

వొడాఫోన్‌ ఐడియా మూసేస్తాం!

Friday 6th December 2019

ప్రభుత్వ సాయం అందకుంటే నడపలేం కుమార మంగళం బిర్లా ఏజీఆర్‌ బకాయిల విషయంలో ప్రభుత్వం నుంచి ఊరట లభించకుంటే వొడాఫోన్‌ ఐడియా మూతపడడం ఖాయమని బిర్లా గ్రూప్‌ అధిపతి కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. ‘‘ఏలాంటి సాయం రాకుంటే వొడాఫోన్‌ ఐడియా కథ కంచికి చేరినట్లే’’ అని హెచ్‌టీ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో పాల్గొన్న బిర్లా వెల్లడించారు. ఇప్పటికే వొడాఫోన్‌ గ్లోబల్‌ సీఈఓ సైతం ఇదే విషయాన్ని బయటపెట్టారు. జియో పోటీ తట్టుకునేందుకు వొడాఫోన్‌,

బుల్లిష్‌ అష్టపది!

Friday 6th December 2019

ఎనిమిది స్టాక్‌ రికమండేషన్లు ఏడాది కాలంలో మంచి రాబడిని అందించే ఎనిమిది స్టాకులను నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌, జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌, రెలిగేట్‌ బ్రోకింగ్‌కు చెందిన అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు.  1. కోటక్‌మహీంద్రా బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 1946. ఆరోగ్యవంతమైన లోన్‌గ్రోత్‌ కొనసాగిస్తోంది. పరిశ్రమలో మందగమనం ఉన్నా, బ్యాంకు మాత్రం మంచి పనితీరు చూపుతోంది. ఎన్‌ఐఐ, ఎన్‌ఐఎంలు బలంగా ఉండడంతో రెండంకెల లోన్‌గ్రోత్‌ కొనసాగవచ్చు. బ్యాంకు అనుబంధ విభాగాలు బలమైన వృద్ధి నమోదు చేస్తున్నాయి.  2.

Most from this category