News


ఆర్‌ఐఎల్‌పై సీఎల్‌ఎస్‌ఏ బుల్లిష్‌

Thursday 5th December 2019
Markets_main1575569260.png-30078

అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ ఆర్‌ఐఎల్‌ పట్ల బుల్లిష్‌గా ఉంది. అలాగే లెమన్‌ట్రీ హోటల్స్‌ స్టాక్‌ విషయంలో సానుకూలంగా ఉంది. ఈ రెండు స్టాక్స్‌ వచ్చే ఏడాది కాలంలో ప్రస్తుత స్థాయి నుంచి కనీసం 25 శాతానికిపైనే రాబడులను ఇస్తాయని అంచనా వేస్తోంది.

 

జియో టారిఫ్‌ పెంపు నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ టార్గెట్‌ ధరను గతంలో ఇచ్చిన రూ.1,710 నుంచి రూ.2,010కు సీఎల్‌ఎస్‌ఏ పెంచింది. ప్రస్తుత స్థాయి నుంచి 30.6 శాతం వృద్ధికి అవకాశం ఉందని పేర్కొంది. టెలికం వ్యాపారంలో బలమైన వృద్ధి అంచనాలతో ఈ సవరణ చేసింది. టారిఫ్‌ల పెంపు తర్వాత కూడా జియో పోటీ సంస్థల కంటే 7-20 శాతం తక్కువకే సేవలు ఆఫర్‌ చేస్తున్నట్టు గుర్తు చేసింది. ఈ నెల 6 నుంచి జియో టారిఫ్‌ ధరల పెంపు అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. 35 శాతం వరకు టారిఫ్‌లను పెంచింది. అయినప్పటికీ వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ కంటే పెంపు తక్కువగానే ఉంది. టారిఫ్‌ల పెంపునకు తోడు, ఆరామ్‌తో చేసుకున్న ఒప్పందం రానున్న కాలంలో మంచి ట్రిగ్గర్‌గా పనిచేస్తాయని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. కస్టమర్లు 84 రోజుల ప్లాన్‌కు బదులు 28 రోజుల ప్లాన్‌ను ఎంచుకోవచ్చని, దీంతో ఏఆర్‌పీయూ పెరగొచ్చని అంచనా వేసింది. టారిఫ్‌ల పెంపు కారణంగా ఎబిట్డా 1.1-1.3 బిలియన్‌ డాలర్ల మేర పెరుగుతుందని పేర్కొంది. దీనివల్ల ఈపీఎస్‌ 1-8 శాతం వరకు పెరగొచ్చని, దీంతో ఆర్‌ఐఎల్‌ స్టాక్‌ మరింత పెరిగేందుకు అవకాశం ఉందని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. 

 

లెమన్‌ ట్రీ హోటల్స్‌కు సీఎల్‌ఎస్‌ఏ రూ.80 టార్గెట్‌గా ఇచ్చింది. ప్రస్తుత స్థాయి నుంచి 29 శాతం అధికం. క్యూ3లో పనితీరు బలంగా ఉంటుందని అంచనా వ్యక్తీకరించింది. ‘‘ముంబై, హైదరాబాద్‌, ఢిల్లీ పట్టణాల్లో కంపెనీ హోటళ్లలో ఆక్యుపెన్సీ రేటు ఇప్పటికే 70 శాతాన్ని దాటిపోయింది. ఆక్యుపెన్సీ పెరుగుతున్న కొద్దీ, రోజువారీ సగటు ధరల పెంపునకు అవకాశం ఉంది’’ అని పేర్కొంది. క్యూ3లో సగటున ఒకటి నుంచి రెండంకెల స్థాయిలో పెంపు ఉంటుందని అంచనా వేసింది. ముంబై మార్కెట్లో కంపెనీ మార్కెట్‌ వాటా పెరగొచ్చని, అధిక వృద్ధి అవకాశాల నేపథ్యంలో ప్రీమియం వ్యాల్యూషన్‌ సహేతుకమేనని అభిప్రాయపడింది. కంపెనీ విస్తరణ కూడా పూర్తయితే నిర్వహణలో 67 పట్టణాల్లో మొత్తం 105 హోటళ్లు, 10,500 రూమ్‌లు అందుబాటులోకి వస్తాయి. 



You may be interested

యస్‌ బ్యాంకుకు షాకిచ్చిన మూడిస్‌

Thursday 5th December 2019

కీలకమైన నిధుల సమీకరణకు ముందు యస్‌ బ్యాంకు రేటింగ్‌ను డౌన్‌ గ్రేడ్‌ చేస్తూ అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ‘మూడిస్‌’ షాకింగ్‌ నిర్ణయాన్ని వెలువరించింది. యస్‌బ్యాంకు దీర్ఘకాలిక ఫారీన్‌ కరెన్సీ ఇష్యూయర్‌ రేటింగ్‌ను బీఏ3 నుంచి బీ2కు తగ్గించడంతోపాటు, నెగెటివ్‌ అవుట్‌లుక్‌ ఇచ్చింది. వాస్తవానికి యస్‌ బ్యాంకు రేటింగ్‌ తగ్గించే అవకాశం ఉందని గత నెల 6వ తేదీనే మూడిస్‌ హెచ్చరించడం గమనార్హం. ఆస్తుల నాణ్యత ఆందోళనలు, బ్యాంకు నిధులు అడుగంటిపోతుండడం

మార్కెట్‌కు ఆర్‌బీఐ ఝలక్‌..!

Thursday 5th December 2019

 వడ్డీరేట్లు తగ్గించకపోవడంతో నిరాశ సెన్సెక్స్‌ 71పాయింట్ల నష్టం 25 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ నష్టాల బాట పట్టిన బ్యాంకింగ్‌, అటో రంగ షేర్లు మార్కెట్‌ వర్గాల అంచనాలకు భిన్నంగా ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను యథాతధంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో మార్కెట్‌ గురువారం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 71పాయింట్లు నష్టపోయి 40,779.59 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్ల పతనమై 12,018 వద్ద ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన పాలసీ సమావేశాల అనంతరం నేడు వడ్డీ రేట్లలో ఎలాంటి

Most from this category