News


సెన్సెక్స్‌ 367 అప్‌.. 1500 డౌన్‌-నఫ్టంతో ముగింపు

Friday 21st September 2018
Markets_main1537526283.png-20447

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాల్గవ సెషన్‌లోనూ నష్టపోయాయి. శుక్రవారం కూడా పతనమయ్యాయి. రోజంతా  భారీ ఒడుదుడుకులు కొనసాగాయి. ఒకసారి బుల్స్‌ హవా కొనసాగితే.. మరోమారు బేర్స్‌ ఆధిపత్యం కొనసాగించాయి. అయితే చివరకు బేర్స్‌దే పైచెయ్యి అయ్యింది. లాభాలతో ప్రారంభమై ఇండెక్స్‌లు మధ్యాహ్నాం వరకు అదే ట్రెండ్‌ కొనసాగించాయి. అయితే తర్వాత ఇండెక్స్‌లు ఇంట్రాడేలో కీలక స్థాయిలను కోల్పోవడంతో సాంకేతిక అమ్మకాలు వెల్లువెత్తడం వల్ల మార్కెట్‌ నిలువునా కుప్పకూలింది. అయితే కనిష్టస్థాయిలో జరిగిన కొనుగోళ్లు, షార్ట్‌ కవరింగ్‌ కారణంగా కొద్దిసేపటికే సూచీలు భారీ నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. చివరకు బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు నష్టాల్లోనే ముగిశాయి.  

గ్యాప్‌అప్‌ ప్రారంభం...

స్టాక్‌ మార్కెట్‌ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,121 పాయింట్లతో పోలిస్తే 157 పాయింట్ల లాభంతో 37,278 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,234 పాయింట్లతో పోలిస్తే 37 పాయింట్ల లాభంతో 11,271 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ ఒకానొక సమయంలో దాదాపు 367 పాయింట్లమేర పెరిగింది. ఇంట్రాడేలో 37,489 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అటుతర్వాత 35,993 కనిష్ట స్థాయికి కూడా పతనమైంది. చివరకు 280 పాయింట్ల క్షీణతతో 36,842 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఒకానొక సమయంలో ఏకంగా 1496 పాయింట్లమేర క్షీణించింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 11,346 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అలాగే 10,866 పాయింట్ల కనిష్ట స్థాయికి కూడా పతనమైంది. చివరకు 91 పాయింట్ల నష్టంతో 11,143 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా 480 పాయింట్లమేర పతనమైంది. 

నిఫ్టీలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌ స్టాక్స్‌ 3 శాతానికిపైగా పెరిగాయి.  ఐఓసీ, హిందాల్కో, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 2 శాతానికిపైగా ఎగశాయి. ఇక యస్‌ బ్యాంక్‌ ఏకంగా 29 శాతానికిపైగా పతనమైంది. అలాగే ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 8 శాతానికిపైగా, బజాజ్‌ ఫైనాన్స్‌ 4 శాతానికిపైగా క్షీణించాయి. యూపీఎల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ స్టాక్స్‌ 3 శాతానికిపైగా పతనమయ్యాయి. ఇక ప్రధాన సూచీల్లో భాగంకాని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్టాక్‌ 43 శాతానికిపైగా పడిపోయింది. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. గరిష్టంగా నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.59 శాతం, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.45 శాతం, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 3.51 శాతం చొప్పున క్షీణించాయి. 



You may be interested

డిఫాల్ట్‌ పుకారు.. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఢమాల్‌..

Friday 21st September 2018

50 శాతం పతనమైన షేరు ధర శుక్రవారం ట్రేడింగ్‌లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు దాదాపు 50 శాతానికి పైగా ఇంట్రాడేలో పతనమైంది. రుణాలపై వడ్డీ చెల్లింపులకు సంబంధించి కంపెనీ డిఫాల్టయిందన్న వార్తలు షేరును ఒక్కసారిగా ఢమాల్‌మనిపించాయి. ఈ వార్తలు నిజంకాదని, తమ వద్ద పదివేల కోట్ల రూపాయల మేర నిధులున్నాయని కంపెనీ మేనేజ్‌మెంట్‌ మొత్తుకున్నా కౌంటర్లో అమ్మకాలు ఆగలేదు. ట్రేడింగ్‌ చివరకు కొంత కోలుకొని షేరు ధర 42 శాతం పైన నష్టపోయి

రూపాయి రీకవరీ- నష్టాల్లో ఐటీ షేర్లు

Friday 21st September 2018

రూపాయి రికవరీతో శుక్రవారం ఐటీ షేర్లు నష్టాల బాట పట్టాయి. రూపాయి రికవరీకి కేంద్రం తీసుకున్న చర్యలు కారణంగా నేటి ట్రేడింగ్‌లో రూపాయి వారం గరిష్టానికి చేరుకుంది. ఫలితంగా డాలరు ఆదాయాన్ని ఆర్జించే  ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాంతో ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 1.50 శాతం నష్టంతో ముగిసింది. ఈ సూచీలో అత్యధికంగా ఇన్ఫీభీమ్‌ షేరు 22శాతం వరకు నష్టపోయింది. వాటితో వాటితో

Most from this category