STOCKS

News


ఈ బ్యాంక్‌ సీఈఓ పదవికి 70 మంది బ్యాంకర్ల పోటీ

Monday 28th October 2019
Markets_main1572255668.png-29183

  ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌) పీసీఏ(ప్రాంప్టడ్‌ కరక్టివ్‌ యాక్షన్‌)ను ఎదుర్కొంటున్న లక్షీవిలాస్‌ బ్యాంక్‌(ఎల్‌వీబీ)లో చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌(ముఖ్య నిర్వహణాధికారి), మేనేజింగ్‌ డైరక్టర్‌(ఎండీ) పదవి కోసం 70 మంది బ్యాంకర్లు పోటీపడుతున్నారు. ఇందుకోసం టాప్‌ బ్యాంకర్ల నుంచి 70 దరఖాస్తులు వచ్చాయని ఎల్‌వీబీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వివిధ బ్యాంకులకు చెందిన సీనియర్‌ నిర్వహణ అధికారులు ఈ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, వీరిలో నష్టాల్లో ఉన్న ఆర్థిక సంస్థలను లాభల్లోకి తీసుకొచ్చిన వారున్నారని అన్నారు. కాగా ఎన్‌పీఏలు(మొండిబకాయిలు) అధికమవ్వడంతో పాటు, తక్కువ మూలధనం, నష్టాలు పేరుకుపోవడం వంటి కారణాల వలన ఈ ఏడాది అగష్టు నుంచి లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ పీసీఏ చర్యలను  ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ఎల్‌వీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పార్థసారధి ముఖర్జి తన మూడేళ్ల కాలపరిమితి ముగియకుండానే, తన పదవికి సెప్టెంబర్‌లో రాజీనామా చేశారు.
    ‘చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌, ఎండీ పోస్టుకు ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం చూస్తుంటే00 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రైవేట్‌ బ్యాంక్‌పై ఆసక్తి ఇంకా అధికంగానే ఉందనే విషయం తెలుస్తోంది’ అని ఈ బ్యాంక్‌ అధికారి పీటీఐకి తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహింద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి ప్రధాన ప్రైవేట్‌ బ్యాంకుల నుంచి, విదేశీ బ్యాంక్‌ అయిన స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ నుంచి, కెనరా బ్యాంక్‌ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి సీనియర్‌ నిర్వహణ అధికారులు ఈ పోస్టులకు దరఖాస్తు  చేసుకున్నారని ఆయన తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతులు వస్తే, ఈ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ నవంబర్‌ 10 నాటికి పూర్తవుతుంది. డిసెంబర్‌ మొదటి వారంలో ఎల్‌వీబీకి కొత్త మేనేజ్‌మెంట్‌ వస్తుంది. వేగంగా రికవరీ అయ్యేందుకు బ్యాంక్‌ తీసుకున్న చర్యలను, రాబోయే చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వేగవంతం చేయవచ్చని ఆ అధికారి అన్నారు. మొండి బకాయిలను రికవరీ చేయడం ద్వారా బ్యాంక్‌ ఆస్తుల నాణ్యతను మెరుగుపరుచుకునేందుకు, మూలధనాన్ని పెంచుకునేందుకు బ్యాంక్‌ వేగవంతమైన చర్యలను తీసుకోవాల్సివుందని బ్యాంక్‌ సీనియర్‌ అధికారి తెలిపారు. కాగా ఈ రెండు అంశాలు నియంత్రణ స్థాయిల కంటే తక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ ప్రణాళికను ఎల్‌వీబీ ఉన్నతాధికారులు అమలుచేస్తున్నారని ఈ అధికారి తెలిపారు.   ‘వీటితో పాటు లాభదాయకతను పెంచేందుకు ఖర్చును నియంత్రణలో ఉంచే చర్యలను కూడా బ్యాంక్‌ చేపట్టింది’ అని ఆయన అన్నారు. నిధులను సమీకరించేందుకు, బ్యాంక్‌ సరియైన ఇన్వెస్టర్‌, పీఈ(ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్స్‌)లతో చర్చలను కూడా జరుపుతోంది. 
     ఆర్‌బీఐ, ఎల్‌వీబీని పీసీఏ కిందకు తీసుకురావండంతో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌తో విలినం ప్రతిపాదనలు ఆగిపోయాయి. ఈ బ్యాంక్‌ మూతబడుతుందనే పుకార్లు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. బ్యాంక్‌ ఈ విషయంపై చెన్నై సైబర్‌ పోలిసులకు ఫిర్యాదు చేసింది.  ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్యార్టర్‌ ఫలితాలలో ఎల్‌వీబీ రూ. 237 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 142 కోట్లు కంటే అధికం కావడం గమనార్హం. బ్యాంక్‌ మొండి బకాయిలు 10.3 శాతం నుంచి 17.3 శాతానికి, నికర ఎన్‌పీఏలు 5.96 శాతం నుం‍చి 8.30 శాతానికి పెరిగాయి. 
 ఎల్‌వీబీ షేరు శుక్రవారం సెషన్‌లో బీఎస్‌ఈలో 5 శాతం నష్టపోయి రూ.15.50 వద్ద ముగిసింది. You may be interested

ఏడాది సమయంలో 50 శాతం లాభం కోసం...

Monday 28th October 2019

టాప్‌ టెన్‌ సిఫార్సులు వచ్చే సంవత్సరం సంవత్‌ 2077లోపు 15- 50 శాతం వరకు రాబడినిచ్చే సత్తా ఉన్న టాప్‌ టెన్‌ స్టాక్‌ రికమండేషన్లు ఇలా ఉన్నాయి...         1. ఐసీఐసీఐ బ్యాంక్‌:               టార్గెట్‌ రూ. 550. రాబోయే సంవత్సరాల్లో రుణ వృద్ధి 17 శాతం, ఆర్‌ఓఈ 1.5 శాతం, ఆర్‌ఓఈ 15.5 శాత మేర వార్షిక వృద్ధి సాధిస్తాయని అంచనా. 2. ఎల్‌అండ్‌టీ:                   టార్గెట్‌ రూ. 1900. రాబోయే రెండళ్లలో ఈపీఎస్‌లో 23 శాతం,

పసిడి ర్యాలీకి ప్రస్తుతానికి బ్రేక్‌

Monday 28th October 2019

పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లో1,550డాలర్ల స్థాయి నుంచి మరింత పెరగకపోవొచ్చని, ఆ స్థాయి నుంచి క్రమేపీ తగ్గవచ్చని యస్‌సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హితేశ్‌ జైన్‌ అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య సమస్యలు, ప్రపంచ ఉత్పాదక కార్యకలాపాలలో క్షీణత, సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల తగ్గింపు, సావరిన్‌బాండ్ల ఈల్డ్‌ పతనం కావడం వంటి అంశాలతో  పసిడి ధర సెప్టెంబర్‌లో ఆరేళ్ల గరిష్టాన్ని అందుకుంది. పైన పేర్కొన్న ప్రతికూలాంశాలన్నింటినీ బంగారం ఇప్పటికే ఇముడ్చుకుంది. ఈ రకంగా పరిస్థితులేవైనప్పటికీ.., పసిడి

Most from this category