News


11850 కాపాడుకుంటే ఆల్‌టైమ్‌ హైకి...

Monday 25th November 2019
Markets_main1574655005.png-29828

నిఫ్టీపై నిపుణుల అంచనాలు

నిఫ్టీ 11850 పాయింట్ల మద్దతు జోన్‌ను కోల్పోకుండా కాపాడుకుంటే క్రమంగా అప్‌మూవ్‌ కొనసాగి మరోమారు లైఫ్‌టైమ్‌హైని తాకవచ్చని మార్కెట్‌ నిపుణుడు చందన్‌ తపారియా అభిప్రాయపడ్డారు. 16 సెషన్లుగా నిఫ్టీ 11800- 12038 పాయింట్ల రేంజ్‌లో కదలాడుతోంది. చార్టుల్లో బుల్స్‌, బేర్స్‌ మధ్య హోరా హోరీ కనిపిస్తోంది. నిఫ్టీ ప్రధాన మద్దతుపైన స్థిరంగా ఉంటే రాబోయే సెషన్లలో 12035, 12103 పాయింట్లను చేరుతుందని చందన్‌ చెప్పారు. బ్యాంకు నిఫ్టీ 30800 పాయింట్ల పైన ఉన్నంత వరకు పాజిటివ్‌గానే పరిగణించాలన్నారు. పైన 31500- 31700 పాయింట్ల వద్ద నిరోధం, 30300- 30500 పాయింట్ల వద్ద మద్దతు ఉంటాయని చెప్పారు. ఇలాంటి మార్కెట్లో ట్రేడర్లు బుల్‌కాల్‌ స్ప్రెడ్‌ లేదా కాల్‌ లాడర్‌ స్ప్రెడ్‌ లాంటి వ్యూహాలను అవలంబించి మంచి రాబడి పొందవచ్చని సూచించారు. ఆప్షన్‌ ట్రేడర్లు షార్ట్‌ స్ట్రాంగిల్‌ వ్యూహం పరిశీలించవచ్చన్నారు. 
ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, పెట్రోనెట్‌, హావెల్స్‌పై నెగిటివ్‌గా, హెచ్‌డీఎఫ్‌సీ, బోష్‌, ఐషర్‌, ఆర్‌బీఎల్‌బ్యాంక్‌, ఎక్సైడ్‌, జేఎస్‌డబ్ల్యు, జిందాల్‌స్టీల్‌, గ్రాసిమ్‌, జీ షేర్లపై పాజిటివ్‌గా ఉన్నట్లు తెలిపారు. 

11800 కోల్పోతే భారీ పతనం
నిఫ్టీ 11800 పాయింట్ల కీలక మద్దతు కోల్పోయి దిగువకు వస్తే పతనం మరింత లోతుగా ఉండొచ్చని, దాదాపు మరో 200 పాయింట్ల మేర నిఫ్టీ దిగజారవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ చార్టుల్లో బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ ప్యాట్రన్‌ ఏర్పరిచింది. వీక్లీ చార్టుల్లో డోజి క్యాండిల్‌ చూపుతోంది. ఈ తరహా క్యాండిల్‌ ఏర్పడడం సందిగ్ధతకు చిహ్నంగా భావిస్తారు. అటు డౌన్‌సైడ్‌ ఇటు అప్‌సైడ్‌ భారీగా ప్రభావితం చేసే వార్తలు లేకపోవడంతో నిఫ్టీ పరిమిత రేంజ్‌లో కదలాడుతోంది. నిఫ్టీకి ఆరంభ మద్దతు 11899 పాయింట్ల వద్ద ఉందని, దీని దిగువన 11802 పాయింట్ల వద్ద పటిష్ఠ మద్దతు ఉందని చార్ట్‌వ్యూ ఇండియా ప్రతినిధి మజార్‌ మహ్మద్‌ చెప్పారు. దీన్ని కాపాడుకోవడం బుల్స్‌కు చాలా అవసరమని వివరించారు. దీర్ఘకాలానికి మేజర్‌ట్రెండ్‌ పాజిటివ్‌గానే ఉందని ఎక్కువమంది నిపుణుల భావన. అందువల్ల కీలక మద్దతులు కోల్పోనంత వరకు నిఫ్టీ పడినప్పుడల్లా కొనుగోళ్లను పరిశీలించవచ్చని సూచిస్తున్నారు.

 You may be interested

వారం కనిష్టానికి పసిడి

Monday 25th November 2019

అమెరికా చైనాల దేశాధ్యక్షులు మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలపడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం ఉదయం సెషన్‌లో వారం కనిష్టానికి దిగివచ్చింది. అమెరికా పటిష్టమైన ఆర్థిక గణాంకాలను వెలువరించడంతో డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం కూడా పసిడి ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఫలితంగా ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ ఔన్స్‌ పసిడి ధర 1,460.60 డాలర్ల వద్ద వారం రోజుల కనిష్టాన్ని తాకింది. ఆశావహ

మీ కార్డును స్విచాఫ్‌ చేయండి

Monday 25th November 2019

మొబైల్‌ యాప్‌ ద్వారా నియంత్రించొచ్చు ఆన్‌లైన్‌, పీఓఎస్‌ లావాదేవీలకు పరిమితి కూడా లిమిట్‌ దాటిన లావాదేవీలకు తిరస్కరణే ఈ పరిమితులు ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు కావాల్సినపుడు మాత్రమే అనుమతించే వీలు వీటిని జాగ్రత్తగా వాడితే నేరాలకు తావుండదు (రమణమూర్తి మంథా) శ్రీధర్‌కు రెండు డెబిట్‌ కార్డులు... మూడు క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. ఇవన్నీ వీసా, మాస్టర్‌, మ్యాస్ట్రో కార్డులే కావటంతో ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటవుతాయి. కాకపోతే గతనెల్లో వచ్చిన ఓ క్రెడిట్‌ కార్డు, ఓ డెబిట్‌ కార్డు బిల్లులో... తాను వాడకపోయినా ఏకంగా

Most from this category