News


మార్కెట్‌ జోరు తగ్గుతోందా?!

Thursday 17th October 2019
Markets_main1571288628.png-28945

సంకేతాలున్నాయంటున్న నిపుణులు
నిఫ్టీ ఈవారాన్ని లాభాలతో కొనసాగిస్తున్నా, సూచీల్లో జోరు సన్నగిల్లుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. బుల్స్‌ ఇకమీదట ఉత్సాహంగా పరుగులు తీయలేకపోవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల స్వల్పకాలానికి ఒక శ్రేణిలోనే మార్కెట్‌ కదలికలుండవచ్చని అంచనా వేస్తున్నారు. బుధవారం నిఫ్టీ సుమారు 36 పాయింట్లు లాభపడింది. గురువారం వీక్లీ ఆప్షన్‌ ఎక్స్‌పైరీ ఉన్నందున సూచీలు తీవ్ర కదలికలు నమోదు చేయవచ్చని అంచనా. ప్రస్తుతానికి నిఫ్టీకి 11500- 11585 పాయింట్ల జోన్‌ గట్టి నిరోధంగా, 11300- 11400 జోన్‌ గట్టి మద్దతుగా ఉంటుంది. 

చార్టులు పరిశీలిస్తే ఆర్‌ఎస్‌ఐ న్యూట్రల్‌గా ఉంది, ఎంఏసీడీ ఇండికేటర్‌ పాజిటివ్‌ క్రాసోవర్‌లో ఉంది. చార్టు క్యాండిల్స్‌ చూస్తే డోజీ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇది సూచీల్లో అనిశ్చితికి సంకేతంగా చెప్పవచ్చు. ఒక అప్‌మూవ్‌ తర్వాత ఇలాంటి డోజీ ఏర్పడడం మార్కెట్లో ఉత్సాహం తగ్గిందనేందుకు సంకేతంగా టెక్నికల్‌ నిపుణులు భావిస్తారు. నిఫ్టీ తన వందరోజుల డీఎంఏ స్థాయి 11404 పాయింట్లకు పైన స్థిరంగా ఉండేందుకు చాలా ఇబ్బంది పడుతోంది. పైస్థాయిల్లో పెద్దగా కొనుగోళ్ల మద్దతు కనిపించడంలేదు. ఇవన్నీ చూస్తే ఇటీవలి ర్యాలీలన్నీ షార్ట్‌కవరింగ్‌ వల్ల వచ్చినవేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  దీనికితోడు ఓపెన్‌ ఇంట్రెస్ట్‌లో తరుగుదల కూడా ఇదే విషయం నిర్ధారిస్తోంది. నిఫ్టీలో బుల్స్‌ మరలా హవా చూపాలంటే 11400 పాయింట్లను కాపాడుకోవడం తప్పనిసరి. అప్పుడే మరోమారు తన 200 రోజుల డీఎంఏ స్థాయిలను పరీక్షించగలదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని, కచ్ఛితమైన స్టాప్‌లాస్‌తో పొజిషన్లు కొనసాగించాలని, వీలయితే కొత్త పొజిషన్లకు దూరంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎటో ఒకవైపు ట్రెండ్‌ స్పష్టమయ్యేవరకు భారీ కొనుగోళ్లను చేయవద్దని సూచించారు. 
 You may be interested

బజాజ్‌ కన్జ్యుమర్‌ 6% అప్‌

Thursday 17th October 2019

   బజాజ్‌ రీసోర్సెస్‌, బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌లో తన 22 శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవి ద్వారా రూ. 628 కోట్లకు మంగళవారం విక్రయించిన విషయం తెలిసిందే. రుణాలను చెల్లించేందుకు ఈ నిధులను వినియోగించనున్నామని కంపెనీ తెలిపింది. ఫలితంగా గత కొన్ని సెషన్‌ల నుంచి బజాజ్‌ కన్జ్యుమర్‌ షేరు పాజిటివ్‌గా ట్రేడవుతోంది. గత సెషన్‌లో 15 శాతానికి పైగా ర్యాలీ చేసిన ఈ షేరు, గురువారం ఉదయం 10.43

స్థిరంగా పసిడి

Thursday 17th October 2019

అమెరికా రిటైల్‌ అమ్మకాల గణాంకాలు బలహీనంగా నమోదు కావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల స్వల్ప నష్టంతో 1,492.05 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా నిన్నరాత్రి సెప్టెంబర్‌ రిటైల్‌ గణాంకాలను విడుదల చేసింది. ధీర్ఘకాలంగా చైనాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధం అమెరికా తయారీ రంగంపై ప్రభావాన్ని చూపడంతో 7నెలల్లో తొలిసారిగా తగ్గుముఖం పట్టాయి. బలహీన రీటైల్‌

Most from this category