News


వొడాఫోన్‌ఐడియాకు ఎటువంటి విలువా లేదు!

Wednesday 19th February 2020
Markets_main1582090242.png-31924

సిటీ గ్రూప్‌ అంచనా
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వొడాఫోన్‌ ఇండియాకు ఎలాంటి ఈక్విటీ విలువ లేదని సిటీగ్రూప్‌ వ్యాఖ్యానించింది. అందుకే వీఐఎల్‌ షేరు టార్గెట్‌ను డ్రాప్‌ చేసినట్లు(ఎలాంటి టార్గెట్‌ ధర ప్రకటించకపోవడం) తెలిపింది. వీఐఎల్‌ భవితవ్యంపై సుప్రీం కోర్టు తాజా తీర్పు అనంతరం నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. ఇక ప్రస్తుతానికి వీఐఎల్‌కు ఉన్న ఒకే ఒక ఆఖరు ఆశ ప్రభుత్వ సాయమని, కానీ ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి ఈ దిశగా ఎలాంటి సంకేతాలు లేవని తెలిపింది. ప్రభుత్వం వీఐఎల్‌కు చట్టపరమైన లేదా విధానపరమైన రిలీఫ్‌ను అందించేందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించడంలేదని పేర్కొంది. దీంతో స్టాకుపై రేటింగ్‌ను న్యూట్రల్‌కు తగ్గిస్తున్నట్లు తెలిపింది. అస్థిరత పెరిగిపోవడంతో షేరుకు ఎలాంటి ఈక్విటీ విలువ ఇవ్వలేమని తెలిపింది.

ప్రస్తుతం వీఐఎల్‌ షేరు రూ.3 దరిదాపుల్లో కదలాడుతోంది. కంపెనీ నికర రుణాలు కంపెనీ ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ కన్నా 20 రెట్లు అధికంగా ఉన్నాయని, అందువల్ల కంపెనీ సైతం రిలీఫ్‌రాకుంటే మనుగడ కొనసాగించలేమనే చెబుతోందని సిటీగ్రూప్‌ నివేదిక వివరించింది. క్యు3లో కంపెనీ ఫలితాల పరంగా కొన్ని పాజిటివ్‌ అంశాలు కనిపించినా, ప్రభుత్వం నుంచి పెద్ద ఊరట లభించకుంటే ఏమీ ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. మరోవైపు వీఐఎల్‌కు ఇచ్చిన రుణాలకు అధిక కేటాయింపులు జరపాల్సివస్తుందని బ్యాంకులు భయపడుతున్నాయి. కంపెనీ బకాయిల కింద ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీలు నగదీకరించుకుంటే కంపెనీ దివాలాకు వెళ్లవచ్చని, దీంతో కంపెనీకి ఇచ్చిన రుణాలు ఎన్‌పీఏలుగా మారతాయని బ్యాంకులు ఆందోళనచెందుతున్నాయి. You may be interested

అరబిందో ఫార్మా లాంగ్‌జంప్‌...18 శాతం అప్‌

Wednesday 19th February 2020

18 శాతం దూసుకెళ్లిన షేరు రూ. 590 వద్ద ట్రేడింగ్‌ యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఈఐఆర్‌ అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) నుం‍చి సక్రమ తనిఖీల నివేదిక(EIR) లభించినట్లు దేశీ ఫార్మా రంగ దిగ్గజం అరబిం‍దో ఫార్మా తాజాగా పేర్కొంది. హైదరాబాద్‌లోని పాశమైలారంలో గల ఇంజక్టబుల్‌ ఫార్ములేషన్ల తయారీ ప్లాంటుకి ఈఐఆర్‌ను పొందినట్లు వెల్లడించింది. ఈ యూనిట్‌-4  ప్లాంటులో యూఎస్‌ఎఫ్‌డీఏ 2019 నవంబర్‌ 4-13 మధ్య తనిఖీలు చేపట్టినట్లు తెలియజేసింది. అయితే వొలంటరీ యాక‌్షన్‌

భారీగా పెరగనున్న టీవీలు, ఫ్రిజ్‌లు, మొబైల్‌ ధరలు..?

Wednesday 19th February 2020

కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ ధరలు మరింత పెరగనున్నాయి. టీవీలు, ఏయిర్‌ కండీషనర్స్‌, రిఫ్రిజిరేటర్‌లు, కొన్నిరకాల స్మార్ట్‌ఫోన్ల రేట్లు ఫిబ్రవరి చివరినాటికి భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయా పరిశ్రమల సీనియర్‌ ఎక్సిక్యూటివ్‌లు చెబుతున్నారు. కోవిడ్‌-19(కరోనావైరస్‌) దాటికి చైనా నుంచి దిగుమతి అవ్వాల్సిన ఎలక్ట్రికల్‌ విడిభాగాలు ఆగిపోయాయి. దీంతో ఎలక్ట్రిక్‌ పరికరాల విడిభాగాల కొరత ఏర్పడడంతో కంపెనీలన్నీ డిస్కౌంట్స్‌, ప్రమోషనల్‌ ఆఫర్లని ఆపివేయడంతో 3-5శాతం ధరలు పెరిగే అవకాశం ఉందని ఎక్సిక్యూటివ్‌లు వెల్లడించారు.

Most from this category