News


సెన్సెక్స్‌ టార్గెట్‌ 39,500..తగ్గించిన సిటీ గ్రూప్‌

Friday 2nd August 2019
Markets_main1564731857.png-27500

మార్కెట్లు వరుస సెషన్లలో భారీ పతనాలకు గురవుతున్న నేపథ్యంలో సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ తన మార్చి 2020 సెన్సెక్స్ టార్గెట్‌ను 41,000 స్థాయి నుంచి 39,500 కు తగ్గించింది. కార్పొరేట్ ఆదాయ వృద్ధి అంచనాలను డౌన్‌గ్రేడ్‌ చేయడానికి ఇది కారణమైంది. మార్కెట్ క్షీణత ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏ బ్రోకరేజ్ సంస్థ కూడా సెన్సెక్స్ టార్గెట్‌ను తగ్గించలేదు. కాగా ఈ ఏడాది బడ్జెట్ (జూలై 5) లో ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి ఎటువంటి ఉద్ధీపనలను ప్రకటించకపోవడంతో పాటు సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ విధించడంతో అప్పటి నుంచి దేశియ మార్కెట్‌ సూచీలు 7 శాతం మేర పతనమయ్యాయి. ఈ సవరించిన లక్ష్యాలాధారంగా ప్రస్తుత స్థాయిల నుంచి సెన్సెక్స్‌ 6.7 శాతం మాత్రమే పెరగనుందని సీటీ తెలిపింది.
   వాల్యుషన్‌ పరంగా సెన్సెక్స్‌ ఒక సంవత్సరం ఫార్వర్డ్ ఆదాయంలో దాదాపు 19 రెట్లు ఉంది. ఇది ఎంఎస్‌సిఐ(మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌) ఇఎం ఇండెక్స్‌ సగటుకన్నా సెన్సెక్స్ 12.8 రెట్లు అధికం కావడం గమనర్హం. ‘గత ఒక నెలలో మార్కెట్లు 7 శాతం దిద్దుబాటుకు గురయినప్పటికి సెన్సెక్స్‌ దీర్ఘకాలిక సగటు ఎంఎస్‌సీఐ ఇఎం కంటే ప్రీమియం అధికంగా ఉంది’ అని సిటీ వివరించింది.  ఇలాంటి అనిశ్చితి పరిస్థితులలో ఆర్థిక కార్యకలాపాల్లో తీవ్ర తిరోగమనం సంభవించే అవకాశం ఉందని, ఎన్‌బీఎఫ్‌సిల లిక్విడిటీ సంక్షోభం, ఇతర కారణాల వల్ల కొన్ని స్టాక్స్ సమీప కాలంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. బిఎస్‌ఇ 100 కంపెనీలలో దాదాపు 42 కంపెనీలు ఇప్పటివరకు ఆదాయాలను ప్రకటించగా, వాటి ఆదాయ వృద్ధి గత ఏడాది స్థాయి కంటే 8 శాతం పెరిగినప్పటికి, వాటి ఎబిటా, నికర లాభం బలహీనంగా ఉన్నాయని సిటీ పేర్కొంది. ఈ బ్రోకరేజ్ తన పోర్ట్‌ఫోలియోలోని స్టాకులను 36 నుంచి 34 తగ్గించుకోవడం గమనార్హం. ఫైనాన్సియల్స్‌ స్టాకులపై ‘ఓవర్‌ వెయిట్‌’, ఐటీ సర్వీసెస్‌ పై ‘న్యూట్రల్‌’ రేటింగ్‌ను ఇచ్చింది. వీటితో పాటు సిమెంట్‌, హెల్త్‌కేర్‌ సెక్టార్‌లకు ‘ఓవర్‌ వెయిట్‌’ ఇచ్చి, కమోడిటీస్‌, వినియోగ ఆధారిత రంగాలకు ‘అండర్‌ వెయిట్‌’ ఇచ్చింది.You may be interested

క్యూ1 ఫలితాలు: అంచనాల్ని అందుకోని ఎస్‌బీఐ

Friday 2nd August 2019

దేశియ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా , ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్యూ1 ఫలితాలలో మార్కెట్ల అంచనాలను అందుకోలేకపోయింది. నికర లాభం రూ.4,000 కోట్లను ప్రకటిస్తుందని అంచనా వేయగా అది రూ.2,312 కోట్లకు పరిమితమయ్యింది. స్థూల నిరార్థక ఆస్తులు(ఎన్‌పీఏ) త్రైమాసిక ప్రాతిపదికన ఎటువంటి మార్పు లేకుండా 7.53 శాతంగానే ఉన్నాయి. కానీ నికర ఎన్‌పీఏలు మాత్రం ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో 3.01 శాతం ఉండగా

కరుగుతున్న మెటల్‌ షేర్లు

Friday 2nd August 2019

నష్టాల మార్కెట్లో భాగంగా శుక్రవారం మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది. అంతర్జాతీయంగా మెటల్‌ ధరలకు డిమాండ్‌ తగ్గడంతో పాటు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి వరకు ప్రధాన మెటల్‌ ఉత్పత్తి కంపెనీల ఆదాయాలు నిరాశపరచడంతో సెంటిమెంట్‌ను బలహీనపరుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే చైనా ఆర్థికమందమనం, ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం కూడా మెటల్‌ షేర్ల ట్రేడింగ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రస్తుతం అల్యూమినియం

Most from this category