News


టాటాపవర్‌ షేర్లను అప్‌గ్రేడ్‌ చేసిన సిటి బ్రోకరేజ్‌

Wednesday 19th June 2019
Markets_main1560937605.png-26421

సిటి బ్రోకరేజ్‌ సంస్థ టాటా గ్రూప్‌నకు చెందిన టాటా పవర్‌ కంపెనీ షేర్ల రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. త్వరలోనే నాన్‌ కోర్‌ ఆస్తుల విభజన ప్రక్రియ, మరో 3- 6నెలల్లో ముంద్రా అల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్ట్‌ రిసెల్యూషన్‌ ప్రారంభం కానుండటం టాటా పవర్‌ కంపెనీకి కలిసొచ్చే అంశాలని బ్రోకరేజ్‌ తెలిపింది. గతంలో తాము ఈ కంపెనీ షేర్లకు కేటాయించిన ‘‘న్యూట్రల్‌’’ రేటింగ్‌ను ‘‘బై’’రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేస్తుండంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.76లకు పెంచుతున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఈ టార్గెట్‌ ధర షేరు ప్రస్తుత ధర నుంచి 18శాతం పొటెన్షియల్‌ అప్‌సైడ్‌ను సూచిస్తుంది. ప్రస్తుతం షేరు ఆకర్షణీయ విలువ వద్దే ట్రేడ్‌ అవుతోందని, షేరులో మరింత బుల్లిష్‌ ధోరణి కొనసాగితే, అప్పుడు టార్గెట్‌ ధర రూ.100లకు పెంచుకోవచ్చని, ఇది షేరు ప్రస్తుత ధర నుంచి 55.4 శాతం పొటెన్షియల్‌ అప్‌సైడ్‌ను సూచిస్తుందని సిటి బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. నిజానికి ఏడాది కాలం నుంచి షేరు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. గడిచిన ఏడాది కాలంలో షేరు ధర 14శాతం క్షీణించింది. 

బ్రోకరేజ్‌ సంస్థ షేర్ల రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసిన నేపథ్యంలో  ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 1.50శాతం లాభపడ్డాయి. మార్కెట్‌ ఒడిదుడులకు ట్రేడింగ్‌లో భాగంగా మధ్యాహ్నం గం.3:15ని.లకు షేరు గత ముగింపు(రూ.65.20)తో పోలిస్తే 1శాతం నష్టంతో రూ.63.55ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.59.80 రూ.86.10లుగా నమోదయ్యాయి.



You may be interested

జీఎస్‌టీ రేట్‌కట్‌కు అవకాశాలు తక్కువే!

Wednesday 19th June 2019

డెల్లాయిట్‌ ఇండియా ప్రతినిధి ఎంఎస్‌ మణి అంచనా ఇప్పుడున్న పరిస్థితుల్లో జీఎస్‌టీ రేట్‌ కట్‌కు అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయని డెల్లాయిట్‌ ఇండియా(పరోక్ష పన్నుల విభాగం) ప్రతినిధి ఎంఎస్‌ మణి అభిప్రాయపడ్డారు. గతేడాది కాలంలో జీఎస్‌టీ వసూళ్లు ప్రభుత్వ అంచనాల కన్నా తక్కువగా ఉంటున్నాయని, కేవలం గత మూడు నెలల్లో మాత్రమే ఈ వసూళ్లు స్థిరంగా ఉంటున్నాయని చెప్పారు. ప్రస్తుత నెలకు లక్ష కోట్ల రూపాయల వసూళ్లు ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్లో

ఎస్‌బీఐకి ప్రాధాన్యం ఇచ్చిన నోముర

Wednesday 19th June 2019

ప్రైవేట్‌ దిగ్గజాలైనా యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ల కం‍టే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కి ప్రాధాన్యాన్ని ఇస్తానని జపాన్‌ బ్రోకరేజి సంస్థ నోముర తెలిపింది. ‘ ఎస్‌బీఐ అభివృద్ధి కారకాలు, మార్జిన్‌ల పెరుగుదల, ఈక్విటీలపై లాభాలలో మెరుగుదల కనిపిస్తోంది. అంతేకాకుండా సంస్థ ఆస్థి నాణ్యత సమస్యలు కూడా తగ్గాయి’ అని​వివరించింది. దీంతో పాటు ఎస్‌బీఐ 2020-22 ఆర్థిక కాలం ఈపీఎస్‌ అంచనాలను 5 శాతం పెంచింది. ఎస్‌బీఐ షేరు

Most from this category