News


టాప్‌ బ్రోకరేజ్‌ల రికమండేషన్లు

Wednesday 13th March 2019
Markets_main1552460102.png-24578

మిడ్‌టర్మ్‌ కోసం ప్రముఖ బ్రోకరేజ్‌లు కొన్ని రికమండేషన్లు అందిస్తున్నాయి.
1. మారుతీ సుజుకీ: సిటీ గ్రూప్‌ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 8300కు పెంచింది. ఎన్నికల తర్వాత వాల్యూంల్లో పెరుగుదల ఉంటుందని, పండుగ సీజన్‌ కల్లా షేరు జోరందుకుంటుందని అంచనా. అయితే ఈపీఎస్‌ అంచనాలను మాత్రం 5-7 శాతం మేర తగ్గించింది.
2. నెస్లెఇండియా: సీఎల్‌ఎస్‌ఏ, మాక్క్వైరీ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 11750, రూ. 12994. పదిహేనళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా ప్రచార వ్యయాన్ని పెంచింది. దీనికితోడు సీజనల్‌ గ్రోత్‌ సైకిల్‌ కూడా ఆరంభం కానుంది. బలమైన వాల్యూం వృద్ధి కారణంగా ఈ ఏడాది మంచి ఫలితాలుంటాయని అంచనా.
3. పిడిలైట్‌: క్రెడిట్‌సూసీ సిఫార్సు. టార్గెట్‌ రూ. 1125కు పెంచింది. న్యూట్రల్‌ రేటింగ్‌ కొనసాగిస్తోంది. వాల్యూషన్ల కారణంగా అప్‌సైడ్‌ కదలికలు పరిమితమని పేర్కొంది. మార్జిన్‌ ఒత్తిళ్లు తగ్గడంతో ఈ ఆర్థిక సంవత్సరం మంచి పనితీరు కనబరచవచ్చు.
4. ఎల్‌అండ్‌టీ: మాక్క్వైరీ సిఫార్సు. టార్గెట్‌ రూ. 1949. అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. రెవెన్యూలో మెరుగుదల కారణంగా రాబోయే రెండేళ్లలో ఎర్నింగ్స్‌ వృద్ది బాగుంటుంది. 
5. డీఎల్‌ఎఫ్‌: సీఎల్‌ఎస్‌ఏ సిఫార్సు. టార్గెట్‌ రూ. 229. కొనొచ్చు రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రాజెక్ట్‌ కమిట్‌మెంట్లను సకాలంలో పూర్తి చేస్తోంది. 



You may be interested

హువావే స్మార్ట్‌వాచ్‌ @ రూ.15990

Wednesday 13th March 2019

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ డివైజెస్‌ తయారీ సంస్థ హువావే.. మూడేళ్ల విరామం తరువాత స్మార్ట్‌వాచ్‌ విభాగంలోకి మళ్లీ ప్రవేశించింది. ఇతర కంపెనీల కంటే తక్కువ ధరలతో క్లాసిక్‌, స్పోర్ట్స్‌ ఎడిషన్‌ వాచీలను మంగళవారం భారత మార్కెట్లో విడుదలచేసింది. ‘జీటీ’ పేరుతో విడుదలైన వాచ్‌ ధరల శ్రేణి రూ.15,990 నుంచి రూ.16,990 వద్ద నిర్ణయించింది. 2016లో విడుదలైన రూ.22,999 స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లు వీటిలో ఉన్నట్లు తెలిపింది. గుండె కొట్టుకునే

మిలియన్‌ మార్కు దిశగా ట్రాక్టర్ల పరిశ్రమ

Wednesday 13th March 2019

మిలియన్‌ మార్కు దిశగా ట్రాక్టర్ల పరిశ్రమ 2018–19లో 8 లక్షల యూనిట్ల అమ్మకం వచ్చే ఏడాది రెండంకెల వృద్ధి అంచనా యాంత్రికీకరణే ఇందుకు ప్రధాన కారణం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో ట్రాక్టర్ల పరిశ్రమ మిలియన్‌ మార్కు దిశగా వెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధితో సుమారు 8 లక్షల ట్రాక్టర్లు అమ్ముడవుతాయని పరిశ్రమ ధీమాగా ఉంది. 2020–21లో ఈ సంఖ్య 10 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నాయి. భారత్‌లో వ్యవసాయంలో యాంత్రికీకరణ ప్రాధాన్యత పెరుగుతుండడమే

Most from this category