News


సిటీగ్రూప్‌ డౌన్‌గ్రేడ్‌తో యస్‌ బ్యాంక్‌ డౌన్‌

Thursday 26th December 2019
Markets_main1577341210.png-30451

ఓవైపు యస్‌ బ్యాంక్‌ బాండ్ల రేటింగ్‌ను బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేయగా.. మరోవైపు విదేశీ సంస్థ సిటీ షేరు టార్గెట్‌ ధరలో కోత పెట్టింది. దీంతో యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో యాక్టివిటీ పెరిగింది. గురువారం ట్రేడింగ్‌లో ఉదయం 11కే ఈ కౌంటర్లో 2.29 కోట్ల షేర్లు చేతులు మారినట్లు మార్కెట్‌ వర్గాలు తెలియజేశాయి. 11.40 ప్రాంతంలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం నష్టంతో రూ. 50.65 వద్ద ట్రేడవుతోంది. రూ. 51 వద్ద ప్రారంభమైన ఈ షేరు ఇంట్రాడేలో రూ. 51.60 వద్ద గరిష్టాన్ని తాకగా., రూ. 50.30 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. 

బాండ్ల రేటింగ్‌ 
యస్‌ బ్యాంక్‌ షేరుకి గ్లోబల్‌ బ్రోకింగ్‌ సంస్థ సిటీ.. గతంలో ఇచ్చిన టార్గెట్‌ ధరను రూ. 50 నుంచి తాజాగా రూ. 46కు కుదించింది. మరోవైపు బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ యస్‌ బ్యాంక్‌కు చెందిన లోయర్‌ టైర్‌-2 బాండ్లు, అప్పర్‌ టైర్‌-2 బాండ్లతోపాటు.. హైబ్రిడ్‌ టైర్‌-1 బాండ్లు, ఇన్నొవేటివ్‌ పెర్‌పెట్యువల్‌ సెక్యూరిటీల రేటింగును డౌన్‌గ్రేడ్‌ చేసింది. లోయర్‌ టైర్‌-2 బాండ్ల రేటింగ్‌ను BWR AA- నుంచి BWR Aకు డౌన్‌గ్రేడ్‌ చేయగా.. అప్పర్‌ టైర్‌-2, హైబ్రిడ్‌ టైర్‌-1 బాండ్లు, పెర్‌పెట్యువల్‌ బాండ్ల రేటింగ్‌ను BWR A+ నుంచి BWR A-కు సవరించింది. ప్రతికూల ఔట్‌లుక్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది.



You may be interested

అమ్మకాల ఒత్తిడిలో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు

Thursday 26th December 2019

పరిమితి శ్రేణి మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా గురువారం ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లుకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ నేడు 2,538.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఈ రంగ షేర్ల అమ్మకాలకు పూనుకోవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1శాతం నష్టపోయి 2,509.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(2,532.20)తో

ట్రేడ్‌ డీల్‌ పై ఆశలతో మెటల్‌ షేర్లకు డిమాండ్‌

Thursday 26th December 2019

అమెరికా, చైనాల మధ్య ట్రేడ్‌ డీల్‌ ఒప్పందంపై ఆశలతో గురువారం మెటల్‌ షేర్లకు గిరాకీ నెలకొంది. ఫలితంగా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ గురువారం ఉదయం సెషన్‌లో 1శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు 2,725.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అమెరికా, చైనాల మధ్య కుదిరిన మొదట దశ వాణిజ్య ఒప్పందంపై జనవరి మొదటివారంలో ఇరుదేశాధ్యక్షులు సంతకాలు పెడతారనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో

Most from this category