సెన్సెక్స్ టార్గెట్ తగ్గించిన సిటీ!
By D Sayee Pramodh

ఎర్నింగ్స్ గ్రోత్‌లో క్షీణతే కారణం మరో ప్రముఖ బ్రోకరేజ్ సీఎల్ఎస్ఏ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ నిఫ్టీ ఎర్నింగ్స్‌ను 5 శాతం మేర తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎర్నింగ్స్ వృద్ధి అందరూ అనుకున్నట్లు 21 శాతం ఉండదని, 18 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేసింది. మోతీలాల్ ఓస్వాల్ సంస్థ నిఫ్టీ ఈపీఎస్ వృద్ధి 16.4 శాతం ఉండొచ్చని అభిప్రాయపడింది. యాంటిక్ బ్రోకింగ్ నిఫ్టీ ఈపీఎస్‌ను 5.6 శాతం మేర డౌన్‌గ్రేడ్ చేసింది. క్యు1లో కంపెనీల నికరలాభాల వృద్ది బలహీనపడిందని వ్యాఖ్యానించింది. అయితే అన్ని బ్రోకరేజ్‌లు ఫైనాన్షియల్స్ రంగం ప్రదర్శనపై పాజిటివ్‌గా ఉన్నాయి. ఎన్పీఏల సమస్యలు కొలిక్కి వస్తున్నందున ఈ రంగం కంపెనీలు ఎర్నింగ్స్‌లో మంచి పురోగతి సాధిస్తాయని భావిస్తున్నాయి. ఇందువల్ల ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో మార్కెట్లలో పురోగతి కనిపించవచ్చని అంచనా వేస్తున్నాయి.
ఫైనాన్షియల్స్ పైనే ఆశలు
జూన్ త్రైమాసిక ఫలితాలు ఆశించినంత బాగాలేకపోవడంతో జూలై తర్వాత నుంచి మార్కెట్లలో పతనం వచ్చింది. దీంతో డౌన్‌గ్రేడ్ రిస్కులు మరింత పెరిగాయని బ్రోకరేజ్‌లు తమ రివ్యూ రిపోర్టుల్లో విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీల ఎర్నింగ్స్ అంచనాలను బ్రోకరేజ్‌లు తగ్గించాయి. దీంతో ఆర్థిక సంవత్సరం చివరకు కంపెనీలు మొదట అనుకున్నంత అంచనాలు అందుకోలేకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిటీ గ్రూప్ సెన్సెక్స్‌పై తన టార్గెట్‌ను 39600 పాయింట్ల నుంచి 39000కు తగ్గించింది. క్యు1లో అన్ని రంగాల కంపెనీల ఎర్నింగ్స్ అంచనాలు అనుకున్నదానికన్నా తగ్గాయని, క్యు1 బీఎస్ఈ 100 ఎర్నింగ్స్ గతేడాది క్యు1తో పోలిస్తే ఒక శాతం మేర క్షీణత నమోదు చేశాయని తెలిపింది. దీంతో అనుకున్న మేర నిఫ్టీ, సెన్సెక్స్‌లు ఎర్నింగ్స్ అంచనాలను అందుకోలేకపోయాయని వివరించింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ కాని కంపెనీల ఎర్నింగ్స్‌లో 17 శాతం తరుగుదల నమోదయిందని తెలిపింది. బీఎస్ఈ 100లో కేవలం 33 శాతం కంపెనీలు మాత్రమే అంచనాలు అందుకున్నాయని విశ్లేషిచింది. ఎనర్జీ, ఫైనాన్షియల్స్, ఆటో మినహా అన్ని రంగాల కంపెనీల రెవెన్యూ అంచనాలకన్నా తక్కువగా వచ్చిందని తెలిపింది. ఎబిటా సైతం అనుకున్నంత నమోదుకాలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాన సూచీ టార్గెట్‌ను తగ్గిస్తున్నట్లు వివరించింది.
You may be interested
ఐపీఓ దెబ్బతో పతనమైన ఉజ్జీవన్ ఫైనాన్స్!
Monday 19th August 2019సాధారణంగా ఒక సంస్థకు సంబంధించిన అనుబంధ సంస్థ ఐపీఓకి (ఇనీసీయల్ పబ్లిక్ ఆఫర్) వస్తే ఆ సంస్థ షేరు విలువ పెరుగుతుంది. కానీ ఉజ్జీవన్ ఫైనాన్స్ మాత్రం సోమవారం ట్రేడింగ్‌లో 8 శాతం మేర పతనమయ్యింది(ఉదయం 10.00 సమయానికి). ఈ కంపెనీకి అనుబంధ సంస్థయిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1,200 కోట్ల ఐపీఓ కోసం సెబీ వద్ద డ్రాప్ట్ పేపర్స్ నమోదు చేసింది. ‘ఉజ్జీవన్ పైనాన్స్‌లో ఉన్న
ఐడీబీఐ 14.50శాతం అప్
Monday 19th August 2019ప్రైవేట్ రంగ ఐడీబీఐ బ్యాంక్ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 14.50శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.24.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్ ఆరంభం నుంచే షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టరు, ట్రేడర్లు ఆస్తకి చూపడంతో ఒక దశలో షేరు 14.50శాతం పెరిగి రూ.28.40 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం.2:40ని.లకు షేర్లు గతముగింపు(రూ.24.85)తో పోలిస్తే 12.50శాతం లాభంతో రూ.27.90 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కాగా షేర్లు