News


సిప్లా షేర్లకు ఫలితాల షాక్‌

Thursday 8th August 2019
Markets_main1565247157.png-27637

తొలి త్రైమాసికపు ఫలితాలు నిరాజనకంగా నమోదుకావడంతో పాటు బ్రోకరేజ్‌ సంస్థలు షేర్ల కొనుగోలు టార్గెట్‌ ధరను కుదించడంతో దేశీయ ఔషధ దిగ్గజం సిప్లా లిమిటెడ్‌ షేర్లు గురువారం 5శాతం పతనమయ్యాయి. నేడు ఎన్‌స్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.504.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ క్యూ1 ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన క్యూ1లో కంపెనీ 6శాతం స్వల్ప వృద్ధితో రూ.478.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ1లో కంపెనీ నికరలాభం రూ.451.3కోట్లుగా నమోదైంది. ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.1.2శాతం రూ.3,989 కోట్లుగా నమోదైంది. ఎబిటా 24.4శాతంగా పెరిగి రూ.904.6 కోట్లను సాధించింది. ఎబిటా మార్జిన్లు 18.5శాతం నుంచి  22 శాతానికి ఎగిశాయి. అమ్మకాలు గతేడాది క్వార్టర్లో రూ.3,939 కోట్లు నమోదు కాగా, ఈ త్రైమాసికానికి 1.3శాతం స్వల్పంగా పెరిగి రూ.3,939 కోట్లుగా నమోదయ్యాయి. క్యూ1 ఫలితాలు విశ్లేషకులను మెప్పించలేకపోవడంతో పలు బ్రోకరేజ్‌ సైతం ఈ కంపెనీ షేర్ల కొనుగోలు టార్గెట్‌ ధరను తగ్గించాయి. గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ షేర్లపై ఔట్‌పెర్ఫార్మ్‌ నుంచి సెల్‌ రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. అలాగే టార్గెట్‌ ధరను రూ. 600 నుంచి రూ. 460కు తగ్గించింది. సిటీ గ్రూప్‌ న్యూట్రల్‌ రేటింగ్‌ను ఇవ్వడంతోపాటు టార్గెట్‌ ధరను రూ. 600 నుంచి రూ. 580కు కుదించింది. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో సిప్లా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఫలితంగా షేరు ఒకదశలో 5శాతం క్షీణించి రూ.493.80ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.12:00లకు షేరు గత ముగింపు ధర(రూ.518.30)తో ధరతో పోలిస్తే 4.50శాతం నష్టంతో రూ.495.25ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.483.75లు, రూ.678.45లుగా నమోదయ్యాయి. ఇక నిన్నటి ట్రేడింగ్‌ ముగిసే సరికి 2.75శాతం లాభంతో రూ.518.30 వద్ద స్థిరపడింది. 



You may be interested

వచ్చే జూన్‌నాటికి సెన్సెక్స్‌@ 45,000!

Thursday 8th August 2019

మోర్గాన్‌స్టాన్లీ మార్కెట్లో బేర్‌ భయాలు కమ్ముకున్న తరుణంలో అంతర్జాతీయ బ్రోకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌స్టాన్లీ భిన్నమైన ధృక్పథాన్ని వెలిబుచ్చుతోంది. డీలా పడిన ఇన్వెస్టర్లకు కొంత ఉత్సాహాన్నిచ్చే అంచనాలు వేస్తోంది. తాజా పతనం తర్వాత మార్కెట్లు బాటమ్‌అవుట్‌కు దగ్గర్లో ఉన్నాయని మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడింది. క్రమంగా మార్కెట్లు కోలుకుంటాయని, తిరిగి బుల్‌రన్‌ ఆరంభమై వచ్చే జూన్‌ నాటికి సెన్సెక్స్‌ 45వేల పాయింట్లను చేరుతుందని అంచనా వేసింది. బుల్స్‌ చెలరేగితే జూన్‌నాటికి సెన్సెక్స్‌ 50వేల పాయింట్లకు చేరినా

10750 కోల్పోతే 10450 పాయింట్లకు నిఫ్టీ!

Thursday 8th August 2019

నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లో ఎఫ్‌పీఐల అమ్మకంతో వచ్చిన పతనం కొంత విరామం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నిఫ్టీ 10800- 10900 పాయింట్ల మధ్య కొన్ని రోజులుగా కన్సాలిడేట్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో కన్సాలిడేషన్‌ నెగిటివ్‌గా ముగిసి నిఫ్టీ మరోమారు డౌన్‌ట్రెండ్‌లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ దేశీయ మార్కెట్లు వాల్యూషన్‌ ఎక్కువగానే ఉందని, దీనికితోడు ఎకానమీలో చురుకుదనం లేకపోవడం నెగిటివ్‌ సెంటిమెంట్‌ను పెంచుతోందని చెబుతున్నారు. నిఫ్టీ

Most from this category