News


గరిష్ఠ స్థాయికి ‘వినియోగదారుల ఫైనాన్సింగ్‌ బూమ్‌’

Saturday 27th July 2019
Markets_main1564204020.png-27354

భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం, వినియోగ సంబంధిత రంగాలపై దీని ప్రభావం అంతర్జాతీయ పెట్టుబడిదారులను అతి జాగ్రత్త పరులను చేసిందని జెఫెరీస్, ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ వుడ్ తన వారంతపు ఇన్వెస్టర్‌ నోట్‌ గ్రీడ్‌ అండ్‌ ఫియర్‌లో పేర్కొన్నారు. భారతదేశంలో ‘వినియోగదారుల ఫైనాన్సింగ్ బూమ్’ గరిష్ట స్థాయికి చేరుకుందని హెచ్చరించారు. ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసిక ఫలితాలలో ఈ బ్యాంక్‌ రుణ వృద్ధి రేటు 3.3 శాతం క్షీణించింది. ఇది భారత దేశంలో ‘వినియోగదారుల ఫైనాన్సింగ్‌ బూమ్‌’ గరిష్ఠస్థాయికి చేరుకుందని, ఇక పెరిగే అవకాశం లేదనే వాదనకు సంకేతం’ అని వివరించారు. ఈ బూమ్‌ గరిష్ఠస్థాయి చేరుకోడానికి ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం కూడా ఒక కారణమని నివేదికలో వుడ్‌ పేర్కొన్నారు. 
  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మొత్తం రుణాలు, అడ్వాన్స్‌లు మొదటి త్రైమాసికంలో సంవత్సరానికి 17 శాతం (వై-ఓ-వై) పెరిగాయి. ఈ బ్యాంక్ భారతదేశ నాణ్యమైన ప్రైవేట్ రంగ బ్యాంక్‌ కావడంతో వుడ్‌ తన ఆసియా ఎక్స్‌ జపాన్ దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ను నిలుపుకున్నారు. ఇన్సురెన్స్‌ సెక్టార్లో బూమ్‌ పెరుగుతుండడంతో ఎస్‌బీఐ లైఫ్‌ను తన పోర్టుపోలియోలో కొత్తగా చేర్చుకున్నారు.  ఇన్వెస్ట్‌మెంట్లను ఎస్బిఐ లైఫ్‌లోకి తరలించిడంతో అరవింద్ ఫ్యాషన్‌ నుంచి తొలగనున్నామని  వుడ్ తెలిపారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి వంటి కొన్ని భారతీయ స్టాక్స్ కూడా వుడ్‌ ఆసియా ఎక్స్‌ జపాన్ దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. వుడ్‌ ఎంచుకున్న ఇండియా స్టాక్సు 2019లో ఇప్పటి వరకు ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడం గమనర్హం. 
    భీమా రంగం నుంచి మార్కెట్లలో నమోదయిన స్టాక్స్  ఈ ఏడాది ఇప్పటి వరకు ఎస్ & పి బిఎస్ఈ సెన్సెక్స్‌లో మంచి ప్రదర్శన చేశాయి. వుడ్‌ పోర్ట్‌ఫోలియోలో తాజాగా చేరిన ఎస్‌బిఐ లైఫ్ 33 శాతం(ఏడాది మొదటి నుంచి ప్రస్తుత తేది వరకు) పెరుగుదలతో అగ్రస్థానంలో నిలిచింది, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ (29 శాతం), ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ (23 శాతం) తర్వాత స్థానాలలో ఉన్నాయని ఏసీఈ ఈక్విటీ డేటా పేర్కొంది.  చాలా మంది బ్రోకరేజీలు జీవిత భీమా సంస్థలపై దీర్ఘకాల దృక్పథంలో ‘కొనుగోలు’ రేటింగ్‌ను ఇచ్చాయి. నోమురా ఎస్బిఐ లైఫ్ స్టాక్‌ టార్గెట్‌ ధరను రూ.900 నిర్ణయించి ‘కొనుగోలు’ రేటింగ్‌ను ఇచ్చిన విషయం తెలిసిందే.You may be interested

కరెన్సీ మార్పిడి రేట్లు సరిగ్గా ఉండేలా ఐఎంఎఫ్‌ చూడాలి

Saturday 27th July 2019

అమెరికా వంటి దేశాలకు సంబంధం లేదు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ న్యూఢిల్లీ: కరెన్సీ మార్పిడి రేట్లు సక్రమంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పై ఉంది తప్పితే అమెరికా వంటి దేశాలపై లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. ఒక దేశం మరో దేశంపై కరెన్సీ మానిప్యులేషన్‌ (కృత్రిమంగా రేట్లను ప్రభావితం చేయడం) ఆరోపణలు చేయడం ద్వైపాక్షిక ఆధిపత్యం కోసం అన్నట్టుగా ఉన్నాయని పేర్కొన్నారు. చైనా, భారత్‌ దేశాలను

విజిల్‌తో కంపెనీలకు రవాణా సేవలు

Saturday 27th July 2019

విజిల్‌ డ్రైవ్‌లో ఉద్యోగుల రవాణా, టెక్నాలజీ సేవలు రోజుకు 2,500 ట్రిప్స్‌; 12 వేల మంది వినియోగం ఏడాదిలో రూ.70 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ అండ్‌ సీఈఓ రాకేశ్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఉద్యోగుల ట్రాన్స్‌పోర్టేషన్‌ కంపెనీలకు పెద్ద సవాలే. వ్యాపార కార్యకలాపాల కంటే ఎక్కువగా ఉద్యోగుల రవాణా సేవల నిర్వహణ కష్టం. ఎంప్లాయిస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ థర్డ్‌ పార్టీకి ఇద్దామంటే? వాహనాలు మాత్రమే ఉంటే సరిపోదు. టెక్నాలజీ, నిర్వహణ కూడా

Most from this category