News


పాలసీ ప్రకటనకు ముందు బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అప్రమత్తత

Friday 4th October 2019
Markets_main1570168123.png-28714

భారీ లాభంతో ప్రారంభమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ క్రమంగా లాభాలను కొల్పోతుంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు క్రితం ముగింపు (28,414)తో పోలిస్తే 278 పాయింట్లు లాభంతో 28,682 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతుతో ఇండెక్స్‌ 1.11శాతం(316 పాయింట్లు) పెరిగి 28730 స్థాయిని అందుకుంది. నేడు గం.11:30ని.లకు ఆర్‌బీఐ పాలసీ ప్రకటన నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించడంతో ఇండెక్స్‌ క్రమంగా లాభాలను కోల్పోయిం‍ది. ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ 111 పాయింట్లు (0.35శాతం) లాభంతో 28,527.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ రంగ షేర్లకు ఎక్కువగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఎస్‌బీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2శాతం పెరిగాయి. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1.50శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యస్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 1శాతం లాభపడ్డాయి. పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 0.01శాతం లాభపడ్డాయి. ఫెడరల్‌ బ్యాంక్‌ 1.50శాతం నష్టపోగా, కోటక్‌ బ్యాంక్‌ అరశాతం నష్టపోయాయి. 



You may be interested

ఇండియా నివేష్‌ టాప్‌ సిఫార్సులు!

Friday 4th October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు గత కొన్ని సెషన్ల నుంచి నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  గత సెషన్‌లో ఎస్ అండ్ పీ బీఎస్‌ఈవ సెన్సెక్స్ 198 పాయింట్లు పడిపోయి 38,106 స్థాయికి, నిఫ్టీ 50 45 పాయింట్లు నష్టపోయి 11,314 స్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇండియానివేష్‌ సెక్యూరిటీస్‌ నుంచి సాంకేతిక సిఫార్సులు: ఇండియానివేష్‌ సెక్యూరిటీస్‌ సాంకేతిక సిఫార్సులు: ఐషర్ మోటార్స్: కొనచ్చు | ప్రస్తుత ధర: రూ .18,285 | టార్గెట్‌ ధర: రూ .19,800

20-40 బీపీఎస్‌ రేట్ల కోత ఉంటుందా?

Friday 4th October 2019

ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) శుక్రవారం వడ్డీరేట్లను మరింత తగ్గించనుందనే అంచనాలున్నాయి. వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందని, ఇది  20 నుంచి 40 బేసిస్‌ పాయింట్ల మధ్యలో ఉండే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్‌ ఆర్థిక వేత్తల సర్వే పేర్కొనడం గమనార్హం. కాగా ప్రభుత్వం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 110 బేసిస్‌ పాయింట్లను తగ్గించి రెపో రేటును 5.4 శాతానికి పరిమితం చేసింది. గత మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశంలో 35

Most from this category