News


గ్లాండ్‌ ఫార్మా ఐపీఓ కోసం కోటక్‌, సిటీ, హైటాంగ్‌ బ్యాంకులు?

Saturday 20th July 2019
Markets_main1563602643.png-27201

హైదరాబాద్‌కు చెందిన ఇంజెక్షన్ డ్రగ్స్ తయారీదారు గ్లాండ్ ఫార్మా ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) నిర్వహణ కోసం ఈ కంపెనీ పేరెంట్‌ సంస్థైనా చైనాకు చెందిన షాంఘై ఫోసున్ ఫార్మాస్యూటికల్‌ (ఫోసున్ ఫార్మా) మూడు మర్చెంట్‌ బ్యాంకులను ఎన్నుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫోసున్ ఫార్మా 2017 అక్టోబర్‌లో గ్రాండ్ ఫార్మాలో సుమారు 74 శాతం వాటాను 109 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన వాటా చాలావరకు వ్యవస్థాపక ప్రమోటర్లతోనే ఉంది. వీరు ఒప్పందం తర్వాత కంపెనీ బోర్డులో కొనసాగారు.
ఎఫ్‌వై 20 లో ఈ లిస్టింగ్ ప్రణాళిక  జరిగనట్టయితే చైనా పేరెంట్‌తో ఉన్న భారతీయ కంపెనీకి ఇదే మొదటి అతిపెద్ద దేశీయ ఐపిఓ అవ్వనుంది. 
    గత ఏడాది నుంచి ఐపిఓ చర్చలు జరుగుతున్నాయని, ఇటీవల కోటక్ మహీంద్రా క్యాపిటల్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, హైటాంగ్ సెక్యూరిటీలను ప్రాథమిక సన్నాహాల్లో భాగంగా సలహాదారులుగా ఎన్నుకున్నారని, అవసరమైతే అదనపు బ్యాంకర్లను తర్వాత దశలో బోర్డులోకి తీసుకువస్తారని పరిశీలకులు తెలిపారు. ప్రస్తుతానికియితే 350 మిలియన్‌ డాలర్ల నుంచి 400 మిలియన్ డాలర్ల మధ్య నిధులు సమీకరించడానికి ప్రణాళికలు ఉన్నాయని, ఐపీఓ చర్చలు ప్రాథమిక దశలో ఉండడంతో ఇష్యూ సైజుపై తుది కాల్ ఇంకా తీసుకోలేదని వివరించారు. ‘ఈ ఐపిఓ వలన గ్లాండ్‌ ఫార్మాలోని  వ్యవస్థాపక ప్రమోటర్లు  వాటాను విక్రయించుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఫోసున్ ఫార్మా కూడా కొంత వాటాను కోల్పోవలసి ఉంటుంది’ అని విశ్లేషకులు తెలిపారు.  ‘ ఇండియాలో ఐపీఓ నిర్వహణ అనుమతుల కోసం చైనా అధికారులు, నియంత్రణ సంస్థలతో గ్లాండ్‌ ఫార్మా అధికారులు  సంప్రదింపులు జరుపుతున్నారు’ అని వివరించారు.
     జెనరిక్ ఇంజెక్టబుల్ ఔషదాల ఉత్పత్తుల కోసం గ్లాండ్ ఫార్మాను 1978 లో పివిఎన్ రాజు స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రవి పెన్మెత్స నేతృత్వంలో ఉంది. కంపెనీ తన ఆదాయంలో ఎక్కువ భాగం అమెరికా, యూరోపియన్ మార్కెట్ల నుంచి సంపాదిస్తుంది. ఇండియాలో శస్త్రచికిత్సల సమయంలో, గుండెపోటు చికిత్సలో ఉపయోగించే హెపారిన్ మెడిసిన్‌ను ఈ సం‍స్థ తయారు చేసింది. గ్లాండ్‌ ఫార్మాకు  నాలుగు ఉత్పాదక ప్లాంట్లున్నాయి. మూడు హైదరాబాద్‌లో ఉండగా ఒకటి విశాఖపట్నంలో ఉంది.  సీసాలు, ఆంపౌల్స్, ముందే నింపిన సిరంజిలు, లైయోఫైలైజ్డ్ వైల్స్, డ్రై పౌడర్స్, ఇన్‌ప్యూజన్స్‌, ఆప్తాల్మిక్ సొల్యూషన్స్ ఈ కంపెనీ ఇంజెక్షన్ల శ్రేణిలో ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్‌ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డిఎ), మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (యుకె ఎంహెచ్ఆర్ఎ), ఇతర నియంత్రణ సంస్థలు గ్లాండ్ ఫార్మా ఉత్పాదక సదుపాయాలను ఆమోదించాయని, 90 కి పైగా దేశాలలో ఈ కంపెనీకి మార్కెట్లున్నాయని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

 You may be interested

11400ల దిగువన ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 20th July 2019

విదేశీ మార్కెట్లలో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి 11380 వద్ద ముగిసింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 11422 పాయింట్లతో పోలిస్తే 42 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ వాతావారణం నెలకొంది. ఆసియా మార్కెట్లు లాభాల్లోనూ ముగియగా, రాత్రి అమెరికా మార్కెట్లు మాత్రం నష్టాలతో ముగిశాయి. దేశీయంగా ఎలాంటి అనూహ్య పరిణామాలూ జరగకపోతే  నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు

5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన సీపీఎస్‌ఈ ఫాలో ఆన్‌ ఆఫర్‌

Saturday 20th July 2019

రూ.10,000 కోట్ల సమీకరణ లక్ష్యం  న్యూఢిల్లీ: సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ (ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ఐదవ  ఫాలో ఆన్‌ ఫండ్‌ ఆఫర్‌ 5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ ఫాలో ఆన్‌ ఫండ్‌ ఆఫర్‌ ఇష్యూ సైజు రూ.8,000 కోట్లు కాగా, రూ.40,000 కోట్ల మేర బిడ్‌లు వచ్చాయని దీపమ్‌ సెక్రటరీ ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఈ ఎఫ్‌ఎఫ్‌ఓ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఈటీఎఫ్‌లో ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ,

Most from this category