News


వొడాఐడియా, ఎయిర్‌టెల్‌తో చైనా మొబైల్‌ సంప్రదింపులు

Friday 10th January 2020
Markets_main1578678952.png-30840

చైనాకు చెందిన అతిపెద్ద మొబైల్‌ ఆపరేటర్‌ ‘చైనా మొబైల్‌’ భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలతో భారత్‌లో క్లౌడ్‌ నెట్‌ వర్క్‌ ఏర్పాటు విషయమై సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ‘‘చైనా మొబైల్‌కు చెందిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సీనియర్‌ మేనేజ్‌మెంట్‌తో డిసెంబర్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత మార్కెట్‌ పట్ల చైనా మొబైల్‌ ఆసక్తిగా ఉంది. ఈ రెండు సంస్థల్లో ఏదైనా ఒకదానిలో లేదా రెండింటిలోనూ హోల్డింగ్‌ కంపెనీగా ఉండాలనుకుంటోంది’’ అని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఓ వ్యక్తి మీడియాకు వెల్లడించారు. హోల్డింగ్‌ కంపెనీ అనేది తగినన్ని ఓటింగ్‌ హక్కులను కలిగి, కంపెనీ ముఖ్య పాలసీలు, నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ కార్యకలాపాల్లో పాలుపంచుకోదు. 

 

‘‘చైనా మొబైల్‌ స్వదేశీ మార్కెట్లో క్లౌడ్‌ స్పేస్‌ విభాగంలో దిగ్గజ సంస్థ. స్వదేశీ మార్కెట్లో విస్తరణ అవకాశాలు చాలా పరిమితం కావడంతో, ఇప్పుడు విదేశీ మార్కెట్లలో పెట్టుబడుల అవకాశాలను అన్వేషిస్తోంది. ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్‌ మాదిరే వాటాదారుగా ఉండేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది’’ అని ఆ వ్యక్తి వెల్లడించారు. భారతీ ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికం అతిపెద్ద వాటాదారుగా (41.24 శాతం) ఉంది. భారతీ టెలికంలో సింగ్‌టెల్‌కు 48 శాతం వాటా కలిగి ఉంది. విదేశాల్లో పెట్టుబడుల అవకాశాలను అన్వేషించేందుకు చైనా మొబైల్‌ 2016లో ఓ స్వతంత్ర సంస్థను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. చైనాలో చైనా మొబల్‌ 93 కోట్ల మొబైల్‌ కస్టమర్లు, 17 కోట్ల వైర్‌లైన్‌ కస్టమర్లతో అతిపెద్ద సంస్థగా ఉంది. చైనా మొబైల్‌ సంప్రదింపులు ఫలిస్తే జియోతో గట్టిగా తలపడేందుకు, 5జీ టెక్నాలజీతో చొచ్చుకుపోయేందుకు కావాల్సినంత ఆర్థిక బలం ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలకు లభిస్తుందన్న అభిప్రాయం పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. 



You may be interested

యస్‌ బ్యాంకుకు ఫండ్స్‌ సైతం టాటా..!?

Friday 10th January 2020

యస్‌ బ్యాంకుతో వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ తన సంబంధాలను పూర్తిగా తెంచేసుకున్నారు. ఆర్‌బీఐ ఆదేశాలతో బ్యాంకు ఎండీ, సీఈవోగా రాణా కపూర్‌ గతేడాదే తప్పుకున్నారు. ఆ తర్వాత తన పేరిట, తన పెట్టుబడి సంస్థలు యస్‌ క్యాపిటల్‌, మోర్గాన్‌ క్రెడిట్స్‌ పేరిట ఉన్న వాటాల్లో అధిక శాతాన్ని ఆయన సెప్టెంబర్‌ నాటికి విక్రయించేశారు. డిసెంబర్‌ త్రైమాసికం ముగిసే సరికి బ్యాంకులో కపూర్‌కు గానీ, ఆయన పెట్టుబడి సంస్థలకు గానీ ఒక్క

అంచనాలను మించి ఇన్ఫీ లాభం

Friday 10th January 2020

మూడో త్రైమాసికంలో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌ లాభాలు అంచనాలను మించాయి. క్యు3లో కంపెనీ లాభం 4457 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. అనలిస్టులు క్యు3లో 4200 కోట్ల రూపాయల లాభం అంచనా వేశారు. గతేడాది క్యూ3తో పోలిస్తే లాభం 23.5 శాతం అధికం. త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ. 23092 కోట్లుగా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే రెవెన్యూ 7.9 శాతం పెరిగింది. మార్జిన్లు మాత్రం అంచనాల కన్నా కాస్త తక్కువగా

Most from this category