జెట్‌పై ఇప్పటికీ ఆసక్తిగానే ఉన్నాం
By Sakshi

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ కొనుగోలుపై ఇప్పటికీ ఆసక్తిగానే ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన ఆదిగ్రో ఏవియేషన్ సంస్థ స్పష్టం చేసింది. చెక్కుతో తాము సిద్ధంగా ఉన్నామని, అయితే భారీ మొత్తం వెచ్చించే పరిస్థితి లేనందువల్ల వేరే సంస్థతో కలిసి కొనుగోలు చేయాలని భావిస్తున్నామని వివరించింది. ఇందులో భాగంగా ఎతిహాద్ ఎయిర్‌వేస్‌తో చర్చలు జరుగుతున్నాయని, ఆ సంస్థ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది. ఆదిగ్రూప్ వ్యవస్థాపకుడు సంజయ్ విశ్వనాథన్ ఈ విషయాలు వెల్లడించారు. ఆది గ్రూప్‌లో భాగమైన ఆది గ్రో ఏవియేషన్ గతంలో జెట్ ఎయిర్వేస్లో 24.9 శాతం వాటా కోసం రూ.2,500 కోట్లు ఆఫర్ చేసింది. ‘మేం జెట్ ఎయిర్వేస్పై ఆసక్తిగానే ఉన్నాం, ఒంటరిగా ఈ లావాదేవీ పూర్తి చేయలేం. కంపెనీని నిర్వహణపరంగా టర్న్ అరౌండ్ చేయడానికి మాకు మరో సంస్థ తోడ్పాటు అవసరం’ అన్నారాయన. ఒకవేళ ఎతిహాద్ గానీ కలిసిరాని పక్షంలో ఇతర కంపెనీలతోనైనా భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశాలు పరిశీలిస్తామని విశ్వనాథన్ చెప్పారు. ప్రస్తుతం మూడు సంస్థలు ఇందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు.
బ్యాంకుల హెయిర్‌కట్ కీలకం...
తాత్కాలికంగా మూతబడిన జెట్ ఎయిర్వేస్ను పునరుద్ధరించేందుకు సమయం మించిపోతోందని, తక్షణం చర్యలు అవసరమని విశ్వనాథన్ చెప్పారు. ‘మా చెక్కు సిద్ధంగా ఉంది. 85–90 శాతం కాకుండా బ్యాంకులు 75 శాతం హెయిర్‌కట్‌కు (ఇచ్చిన రుణంలో వదులుకునే మొత్తం) ఒప్పుకున్నా ఫర్వాలేదు’ అని ఆయన పేర్కొన్నారు. జెట్ డీల్‌లో ఈ హెయిర్‌కట్ అంశం కూడా అవరోధంగా నిలుస్తోంది. కంపెనీకి బ్యాంకులు దాదాపు రూ.8,000 కోట్లకు పైగా రుణాలిచ్చాయి. జెట్ కొనుగోలు రేసులో ఉన్న ఎతిహాద్ ఎయిర్వేస్, హిందుజా గ్రూప్‌లు కనీసం 90 శాతం హెయిర్‌కట్ ఆశిస్తున్నాయి. కానీ ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం ఇందుకు సిద్ధంగా లేదు. మరోవైపు, భారత వైమానిక రంగ వృద్ధికి, పెట్టుబడుల రాకకు తీసుకోతగిన చర్యలపై కేంద్ర ఏవియేషన్ శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాకు విశ్వనాథన్ లేఖ కూడా రాశారు. ఏవియేషన్‌లో ప్రస్తుతం 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 100 శాతానికి పెంచాలని, జెట్.. ఎయిరిండియాలో కొత్త ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చేలా రుణాల పునర్వ్యవస్థీకరణకు వెసులుబాటు కల్పించడం, విమాన ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవడం ద్వారా పన్ను భారం తగ్గేలా చూడటం తదితర అంశాలు పరిశీలించాలని ఆయన కోరారు.
ఎన్సీఎల్టీలో విచారణ వాయిదా...
ఒకవేళ బ్యాంకుల హెయిర్‌కట్‌కు ప్రభుత్వం అనుమతులిచ్చినా.. ఇతరత్రా కూడా అడ్డంకులు ఉన్నాయి. జెట్ ఎయిర్వేస్కు నిర్వహణపరమైన రుణాలిచ్చిన రెండు సంస్థలు (షమన్ వీల్స్, గాగర్ ఎంటర్ప్రైజెస్) తమ బాకీలు రాబట్టుకునేందుకు ఎన్సీఎల్టీని ఆశ్రయించడం వీటిలో ఒకటి. ఈ రెండు సంస్థల పిటీషన్లను పరిశీలించిన ఎన్సీఎల్టీ తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. జెట్‌కు మరోసారి లీగల్ నోటీసులు జారీ చేయాల్సిందిగా సూచించింది. షమన్ వీల్స్‌కు జెట్ రూ. 8.74 కోట్లు, గాగర్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ. 53 లక్షలు బాకీ పడింది.
You may be interested
ఫోర్బ్స్ అతిపెద్ద కంపెనీల జాబితాలో ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ
Friday 14th June 2019ఫోర్బ్స్ అతిపెద్ద కంపెనీల జాబితాలో ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ కంపెనీల జాబితాలో దేశీ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీలు తమ సత్తానుచాటాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదలచేసిన ‘వాల్డ్స్ 2,000 లార్జెస్ట్ పబ్లిక్ కంపెనీస్’లో మొత్తం 57 భారత కంపెనీలు స్థానం సంపాదించగా.. ఆర్ఐఎల్ ఏకంగా 71వ ర్యాంకును, హెచ్డీఎఫ్సీ 332వ ర్యాంకును సాధించాయి. ప్రత్యేకించి ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో ఆర్ఐఎల్
ఆల్‌టైమ్ కనిష్టాలకు జెట్ షేరు
Friday 14th June 2019జెట్ ఎయిర్వేస్ షేరు విలువ శుక్రవారం ఇంట్రాడేలో 13శాతం దిగజారి రూ.79.65కు పడిపోయింది. జెట్ ఎయిర్వేస్ ఇంజినీరింగ్ విభాగానికి కీలక అనుమతులను డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) రద్దుచేయడంతో షేరు భారీగా నష్టపోయింది. అప్పుల బాధతో కంపెనీ కార్యనిర్వహణ మూతపడింది. దీంతో కంపెనీ విమానసర్వీసులను నడపడం లేదు. అయితే విమానాలు తిరగక పోయిన వాటి నిర్వహణ చాలా అవసరం. కానీ తాజాగా డీసీఏ నిర్ణయం కంపెనీ విమానాల నిర్వహణపై