News


కెమికల్‌, ఫార్మా రంగంలో గుడ్‌ బెట్స్‌!

Saturday 22nd February 2020
Markets_main1582364621.png-32010

కరోనాతో దేశీ కంపెనీలకు లబ్ది 
మ్యాక్స్‌ డీల్‌తో యాక్సిస్‌ బ్యాంక్‌కు జోష్‌
నోసిల్‌, ఆర్తి, యూపీఎల్‌, నాట్కో, అరబిందో భేష్‌
- సుదీప్‌ బంద్యోపాధ్యాయ్‌, ఇండిట్రేడ్‌ కేపిటల్‌

ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలతను ప్రదర్శించాయని సుదీప్‌ బంద్యోపాధ్యాయ్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ స్థాయిలో నిరుత్సాహకర వాతావరణం నెలకొన్నప్పటికీ దేశీయంగా సెంటిమెంటు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు తెలియజేశారు. అయితే వేగంగా విస్తరిస్తున్న కరోనా నేపథ్యంలో తలెత్తనున్న సమస్యలు, గ్లోబల్‌ లిక్విడిటీ, దేశీయంగా టెలికం ఏజీఆర్‌ బకాయిలు వంటి అంశాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది వేచి చూడవలసి ఉన్నట్లు తెలియజేశారు. ఒక ఇంటర్వ్యూలో ఫార్మా రంగం, కెమికల్‌ రంగంలో ఇన్వెస్ట్‌ చేయదగిన కంపెనీలు తదితర పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

చాలా కాలంగా
మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌కు సంబంధించిన బీమా బిజినెస్‌ పంపిణీ భాగస్వామ్య అంశంపై చాలా కాలంగా చర్చలు వినిపిస్తున్నాయి. ఈ డీల్‌లో భాగంగా మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌లో వాటా కొనుగోలుకి వీలుగా యాక్సిస్‌ బ్యాంక్‌ చర్చలు చేపట్టే అవకాశముంది. మాక్సిస్‌ లైఫ్‌ బీమా పంపిణీ బిజినెస్‌ కోసం మరో 15ఏళ్ల ఒప్పందం‍ కుదుర్చుకోవడంవల్ల మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌కు లబ్ది చేకూరనుంది. ఇది యాక్సిస్‌ బ్యాంక్‌కూ ప్రయోజనకరమే. ప్రధానంగా జీవిత బీమా బిజినెస్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ 20 శాతం వాటాను సొంతం చేసుకోన్నుట్లు తెలుస్తోంది. వాటా కొనుగోలు అంశంలో నియంత్రణ సంస్థలు, నిబంధనలను యాక్సిస్‌ బ్యాంక్‌ ఎలా అధిగమిస్తుందన్నది ఆసక్తికరం. ఒకవేళ డీల్‌ కుదిరితే.. అంటే మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ వాటాను కొనుగోలు చేస్తే.. ఇది అత్యంత సానుకూల అంశమని చెప్పవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ విషయంలో బీమా బిజినెస్‌లలో భాగస్వామ్యాలు లాభదాయకంగా నిలుస్తున్నాయి. దీంతో యాక్సిస్‌ విషయంలోనూ ఇందుకు అవకాశముంది. అయితే నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు సంపాదించడంలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఎలా వ్యవహరిస్తుందన్న అంశానికి ప్రాధాన్యత ఉంది!

ఫార్మా రంగం ఓకే
గత కొన్నేళ్లుగా కన్సాలిడేషన్‌లో ఉన్న ఫార్మా రంగంపట్ల ఆసక్తిగా ఉన్నాం. అయితే ఫార్మా రంగ పెట్టుబడుల విషయంలో కంపెనీలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. చాలా ఫార్మా కంపెనీల కౌంటర్లు ర్యాలీ బాట పట్టేందుకు అవకాశాలున్నాయి. దేశీ హెల్త్‌కేర్‌ మార్కెట్‌ సగటున ఏడాదికి 15 శాతం వృద్ధిని సాధిస్తోంది. దీంతో దేశీ మార్కెట్లపై దృష్టిపెట్టిన కంపెనీలు జోరు చూపే వీలుంది. ఈ జాబితాలో టొరంట్‌ ఫార్మా, నాట్కో, సన్‌ ఫార్మాలను ప్రస్తావించవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. పలు ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించిన డైవర్సిఫైడ్‌ కంపెనీలకు దీర్ఘకాలంలో లబ్ది చేకూరవచ్చు. ఈ విషయంలో అరబిం‍దో ఫార్మా మెరుగ్గా కనిపిస్తోంది.

స్పెషాలిటీ, అగ్రికెమ్‌
ప్రస్తుతం స్పెషాలిటీ కెమికల్స్‌ విభాగంలో కంపెనీలవైపు దృష్టి సారించవచ్చు. అమెరికా చైనా వాణిజ్య వివాదాలతో ఇప్పటికే దేశీ కంపెనీలకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇటీవల తలెత్తిన కరోనా వైరస్‌ కారణంగా చైనాలో సరఫరా సమస్యలు తలెత్తడంతో దేశీ కంపెనీలకు మరిన్ని అవకాశాలు అందివస్తున్నాయి. వెరసి యూఎస్‌ కంపెనీలు చైనా కంటే దేశీ కంపెనీలపై ఆధారపడేందుకే మొగ్గు చూపవచ్చు. ఇది నోసిల్‌ లిమిటెడ్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌, దీపక్‌ నైట్రైట్‌, యూఎఎల్‌ కంపెనీల అమ్మకాలను పెంచే వీలుంది. వెరసి ఈ కౌంటర్లలో పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తున్నాం. You may be interested

ఈ ఐదింటిపై ఐసీఐసీఐ డైరెక్ట్‌ బుల్లిష్‌

Saturday 22nd February 2020

క్యు3 ఫలితాల్లో సత్తా చూపిన టాప్‌ కంపెనీపై ఐసీఐసీఐ డైరెక్ట్‌ బుల్లిష్‌గా ఉంది. అపోలో హాస్పిటల్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, హీరో మోటో కార్‌‍్ప, కేఈసీ ఇంటర్నేషనల్‌ షేర్లపై బ్రోకరేజ్‌ కొనొచ్చు రేటింగ్‌ ఇచ్చింది. ఈ కంపెనీలు మౌలికంగా బలంగా ఉన్నాయని, స్థిర ప్రదర్శన చూపుతాయని తెలిపింది. క్యు3లో మందగమన ప్రభావం ఉన్నా పలు కంపెనీలు అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు ప్రకటించాయని అభిప్రాయపడింది.  బ్రోకరేజ్‌ కొనొచ్చంటున్న ఐదు షేర్లు, వాటి

కునాల్‌ బోత్రా నుంచి టాప్‌ రికమెండేషన్లు

Saturday 22nd February 2020

మైండ్‌ ట్రీ మైండ్‌ట్రీలోని చార్ట్ సెటప్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో బలమైన షేరు యాక్షన్‌ చూస్తున్న కొన్ని రంగాల్లో ఐటీ సెక్టార్‌ ప్రధానమైంది. ఈ రంగంలోని మైండ్‌ట్రీ కంపెనీ మధ్యస్థాయి ఐనప్పటీకీ.., ప్రైజ్‌ యాక్షన్‌ దృష్ట్యా ఐటీ రంగానికి నాయకత్వం వహిస్తుంది. మైండ్‌ ట్రీ తరువాత ఎన్‌ఐఐటీ టెక్‌ షేరులో మంచి యాక‌్షన్ కన్పిస్తుంది. గత 10 - 12 వారాలలో మైండ్‌ట్రీ  స్థిరత్వమైన ర్యాలీ షేరు ధర నాలుగు

Most from this category