News


బడ్జెట్‌ నష్టాలకు చెక్‌- మార్కెట్లు అప్‌

Monday 3rd February 2020
Markets_main1580725619.png-31473

ఇంట్రాడేలో 40,000 దాటిన సెన్సెక్స్‌ 
62 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
ప్రభుత్వ రంగ బ్యాంకులు బోర్లా

ఒక్క రోజులోనే బడ్జెట్‌ నష్టాలకు చెక్‌ పడింది. అయితే ఆద్యంతం ఒడిదుడుకులు తలెత్తాయి. చివరికి కొనుగోళ్లదే పైచేయికావడంతో మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 137 పాయింట్లు పుంజుకుని 39,872 వద్ద నిలవగా.. నిఫ్టీ 62 పాయింట్లు బలపడి 11,724 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,015 వద్ద గరిష్టాన్ని తాకగా.. 39,563 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 11,750-11,615 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఓవైపు కరోనా వైరస్‌ ఆందోళనలతో ప్రపంచ మార్కెట్ల పతనం.. మరోపక్క ఎల్‌టీసీజీ తదితరాలపై బడ్జెట్‌లో నిరాశ కలిపి శనివారం మార్కెట్లు కుప్పకూలిన విషయం విదితమే. వరుస సెలవుల తదుపరి ప్రారంభమైన చైనీస్‌ మార్కెట్లు భారీగా పతనమైనప్పటికీ దేశీయంగా మార్కెట్లు కోలుకోవడం గమనించదగ్గ అంశమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 

ఐటీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ఆటో, రియల్టీ, మెటల్‌, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ 1.6-1 శాతం మధ్య ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఐటీ, ఫార్మా 2.5-0.5 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఏషియన్‌ పెయింట్స్‌ 6.4 శాతం జంప్‌చేయగా.. నెస్లే, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్‌, బీపీసీఎల్‌, టాటా స్టీల్‌, ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా 5-3 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఇన్‌ఫ్రాటెల్‌ 6 శాతం పతనంకాగా.. యస్‌ బ్యాంక్‌, ఐటీసీ, గెయిల్‌, టీసీఎస్‌, హీరో మోటో, హెచ్‌సీఎల్ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ 5-1.4 శాతం మధ్య తిరోగమించాయి.

ఎస్కార్ట్స్‌ జూమ్‌
డెరివేటివ్స్‌లో ఎస్కార్ట్స్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌ 9 శాతం స్థాయిలో దూసుకెళ్లగా.. అమరరాజా, పిడిలైట్‌, జిందాల్‌ స్టీల్‌, సన్‌ టీవీ 5.6-4.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఐబీ హౌసింగ్‌, పిరమల్‌, జస్ట్‌డయల్‌, సెంచురీ టెక్స్‌, ఎన్‌సీసీ, బీవోబీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌ 8-3.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.2 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1494 నష్టపోగా.. 967 మాత్రమే లాభపడ్డాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శనివారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1200 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) కేవలం‍ రూ. 37 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. You may be interested

డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ పెంపుతో బ్యాంకులకు భారం!

Monday 3rd February 2020

తమ ప్రీమియం తగ్గించాలంటున్న కమర్షియల్‌ బ్యాంకులు బడ్జెట్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కవరేజ్‌ను పెంచడం బ్యాంకుల ఆపరేటింగ్‌ వ్యయాలను పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. డీఐసీజీసీ(డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌) ద్వారా అందిచే కవర్‌ గ్యారెంటీని లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో డిపాజిట్ల బీమాకు చెల్లించే ప్రీమియంలపై మదింపు జరపాలని బ్యాంకులు ఆశిస్తున్నాయి. తమ వద్ద ఉన్న మొత్తం అసెసబుల్‌

ఎస్కార్ట్స్‌- ఇన్ఫో ఎడ్జ్‌.. దూకుడు

Monday 3rd February 2020

ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ 9 శాతం ప్లస్‌ 9 శాతం జంప్‌చేసిన ఇన్ఫో ఎడ్జ్‌ ఈ ఏడాది జనవరిలో ట్రాక్టర్ల విక్రయాలు పుంజుకోవడంతో ఆటో రంగ కంపెనీ ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు క్యూకి డిజిటల్‌ మీడియాలో పెట్టుబడుల వార్తలతో ఆన్‌లైన్‌ క్లాసిఫైడ్‌, రిక్రూట్‌మెంట్‌ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎస్కార్ట్స్‌

Most from this category