News


చాలెట్‌ హోటల్స్‌ దూకుడు

Tuesday 31st December 2019
Markets_main1577767581.png-30553

ప్రపంచ మార్కెట్ల బలహీనతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. ఇటీవల రికార్డుల ర్యాలీ చేసిన పలు మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇండెక్సులు డీలా పడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. మంగళవారం ట్రేడింగ్‌లో వార్తల ఆధారంగా చాలెట్‌ హోటల్స్‌, కల్పతరు పవర్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

చాలెట్‌ హోటల్స్‌
ఆతిథ్య రంగ గ్లోబల్‌ కంపెనీ మారియట్‌ ఇంటర్నేషనల్‌తో తాజాగా ఐదు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు చాలెట్‌ హోటల్స్‌ పేర్కొంది. తద్వారా దేశీయంగా మారియట్‌ ఇంటర్నేషనల్‌ సహకారాన్ని మరింత విస్తరించుకోనున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే 2020లో ప్రారంభంకానున్న వెస్టిన్‌ హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగమైన కంపెనీ వెస్టిన్‌ హైదరాబాద్‌ మైండ్‌స్పేస్‌, వెస్టిన్‌ ముంబై పొవై లేక్‌ కాంట్రాక్టులను సైతంసొంతం చేసుకన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలెట్‌ హోటల్స్‌ షేరుకి డిమాండ్‌ పెరిగింది. ఉదయం 10 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 376 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 402 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం!

కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌
రైల్వేల నుంచి తాజాగా రూ. 979 కోట్ల విలువైన ఈపీసీ ఆర్డర్లు పొందినట్లు విద్యుత్‌ రంగ మౌలిక సదుపాయాల దిగ్గజం కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ తెలియజేసింది. ఆర్డర్లలో భాగంగా ఎలక్ట్ఱిఫికేషన్‌ తదితర పనులను చేపట్టనున్నట్లు తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కల్పతరు పవర్‌ షేరు 1.65 శాతం లాభంతో రూ. 407 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 410 వరకూ పెరిగింది. కంపెనీలో ప్రమోటర్లకు 54.37% వాటా ఉంది.

యునైటెడ్‌ స్పిరిట్స్‌
రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ దీర్ఘకాలిక బ్యాంక్‌ సౌకర్యాల(రుణ చెల్లింపులు) రేటింగ్‌ను స్థిరత్వం(స్టేబుల్‌) నుంచి సానుకూలం(పాజిటివ్‌)కు సవరించినట్లు డియాజియో నిర్వహణలోని యునైటెడ్‌ స్పిరిట్స్‌ పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యునైటెడ్‌ స్పిరిట్స్‌ షేరు 2 శాతం పుంజుకుని రూ. 604 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 605 వరకూ ఎగసింది. 



You may be interested

స్టాక్స్‌ కన్నా బంగారమే బెటర్‌!

Tuesday 31st December 2019

ఈక్విటీల్లో అప్‌ట్రెండ్‌ తాత్కాలికమే 2020లో పసిడి ర్యాలీ పక్కా ఒకపక్క సురక్షిత పెట్టుబడిసాధనంగా పేరొందిన బంగారం ధర పెరుగుతోంది.. మరోపక్క ఈక్విటీలు ప్రపంచవ్యాప్తంగా అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తున్నాయి. దీంతో సాధారణ మదుపరి ఈక్విటీల్లో పెట్టుబడులకు వెనకముందూ ఆలోచిస్తున్నాడు. సాధారణంగా బంగారం ధర పెరగడం, ఈక్విటీల్లో డౌన్‌ట్రెండ్‌కు సంకేతంగా భావిస్తారు. ఈక్విటీలు ర్యాలీ జరిపే సమయాల్లో బంగారం ధర నేల చూపులు చూస్తుంటుంది. కానీ ఈసారి తద్భిన్నంగా రెండూ ర్యాలీ జరుపుతుండడం ఇన్వెస్టర్లలో అయోమయం పెంచుతోంది.

కేజీ-డీ6 బ్లాక్‌ నుంచి నిష్క్రమించిన నికో

Tuesday 31st December 2019

ఈ కంపెనీ వాటాను టేకోవర్‌ చేసిన రిలయన్స్‌, బీపీలు  న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌ నుంచి  కెనడాకు చెందిన నికో రీసోర్సెస్‌ వైదొలిగింది. ఈ బ్లాక్‌లో ఈ కంపెనీకి ఉన్న 10 శాతం వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీ పీఎల్‌సీలు టేకోవర్‌ చేశాయి. ఈ వాటా టేకోవర్‌ కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీ పీఎల్‌సీలు 3.6 కోట్ల డాలర్లు చెల్లించాయి. ఈ మేరకు ఈ రెండు కంపెనీలతో నికో రీసోర్సెస్‌ పరోక్ష అనుబంధ

Most from this category