News


16శాతం పెరిగిన సెంట్రల్‌ బ్యాంక్‌

Wednesday 30th October 2019
Markets_main1572423740.png-29235

నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలపడంతో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 16శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.18.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రూ.3,353 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల బృందం ఆమోదం తెలిపినట్లు బ్యాంక్‌ ఎక్చ్సేంజీలు తెలియజేసింది. ఫలితంగా మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ బ్యాంక్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇంట్రాడేలో ఒకదశలో 16శాతం లాభపడి రూ.20.80 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం.1:15ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(రూ.17.95)తో పోలిస్తే 11శాతం లాభపడి రూ.19.95 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా షేర్ల ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.15.55, రూ.38.00లుగా నమోదయ్యాయి.
రూ.3,353 కోట్ల నిధుల సమీకరణ:-  
ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.3,353 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. ప్రిఫరెన్షియల్‌ ఇష్యూలో భాగంగా ‍రూ.10లు ముఖవిలువ కలిగిన 150 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.21.17 చొప్పున కేంద్రానికి కేటాయించేందుకు క్యాపిటల్‌ రైజింగ్‌ కమిటీ ఆఫ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకోసం బ్యాంకు షేర్లహోల్డర్ల, ఆర్‌బీఐ, స్టాక్‌ ఎక్చ్సేంజీల అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అందులో భాగంగా ఈ నవంబర్‌లో 26, 27వ తేదీల్లో ఈజీఎం సమావేశాన్ని నిర్వహించనుంది. అలాగే నవంబర్‌1న(శుక్రవారం) రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుంది. 



You may be interested

ఆదాయపన్ను తగ్గింపులు లేనట్లే!

Wednesday 30th October 2019

ప్రభుత్వ వర్గాల స్పష్టీకరణ...! వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు ఉంటుందన్న ఊహాగానాలను ‍ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. వచ్చే బడ్జెట్లో సైతం ఎలాంటి పన్ను తగ్గింపులుండవని ఈ వర్గాలు స్పష్టం చేసినట్లు సీఎన్‌బీసీటీవీ 18 తెలిపింది. ఇతర దేశాల్లో మన కన్నా ఎక్కువ ఐటీ ఉందని, దీనికితోడు ప్రస్తుత విత్త పరిస్థితి ఎలాంటి ఐటీ తగ్గింపునకు ఆస్కారమివ్వదని వివరించాయి. కార్పొరేట్‌ టాక్స్‌ను తగ్గిస్తూ సెప్టెంబర్‌లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానంతరం, వ్యక్తిగత ఆదాయపన్నును సైతం తగ్గిస్తుందన్న

మార్కెట్‌ ట్రెండ్‌ మారింది: దీపన్‌ మెహతా

Wednesday 30th October 2019

‘స్టాక్‌మార్కెట్లు ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సూచీలు. స్టాకుల ధరలు పెరుగుతున్నాయంటే, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దగ్గర్లో ఉందని అర్ధం’ అని ఎలిక్షిర్‌ ఈక్విటీస్‌ వ్యవస్థాపకుడు, డెరక్టర్‌ దీపన్‌ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. షేర్ల పెరుగుదల-ఆర్థిక వ్యవస్థ.. ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబంగా స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలు పనిచేస్తాయి. ఒకవేళ స్టాక్‌ ధరలు పెరుగుతున్నాయంటే, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సిద్ధంగా ఉందనే అర్థం. వ్యవస్థలో అనేక సైకిల్స్‌

Most from this category