అమ్మకాల ఒత్తిడిలో సిమెంట్ షేర్లు
By Sakshi

సిమెంట్ కంపెనీల షేర్లు మంగళవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దేశీయంగా నిర్మాణ రంగం స్తబ్దుగా కొనసాగుతుండటం, సిమెంట్ డిమాండ్ ఊపందుకోవడంలో జాప్యం, ధరల రియలైజేషన్ అనుకున్నంతగా లేకపోవడం, ఊహించినదానికన్నా అధిక వ్యయాలు తదితర కారణాలు సిమెంట్ రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడిని కలుగజేస్తున్నాయి. ఇండియా సిమెంట్స్ షేర్లు అత్యధికంగా 5శాతం నష్టపోయాయి. అంబుజా సిమెంట్స్, ఏసీసీ షేర్లు 4శాతం నష్టపోయాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్ షేర్లు 3శాతం పతనయయ్యాయి. జేకే పవర్, రామ్‌కో సిమెంట్స్, బిర్లా కార్పోరేషన్ సిమెంట్స్ షేర్లు 2శాతం క్షీణించాయి. ఇక మిడ్‌సెషన్ నుంచి అమ్మకాల ఉధృతి పెరగడంతో మధ్యాహ్నం గం.3:00లకు సెన్సెక్స్ ఇదే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంతో 40,066 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు క్షీణించి 12,013ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
You may be interested
లాభాల స్వీకరణ-సెన్సెక్స్ 184 పాయింట్లు డౌన్
Tuesday 4th June 201970 పాయింట్లను కోల్పోయిన నిఫ్టీ మార్కెట్లో జరిగిన లాభాల స్వీకరణతో మంగళవారం సూచీలు నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 184 పాయింట్లు నష్టపోయి 40,083 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లను నష్టపోయి 12,021 వద్ద స్థిరపడ్డాయి. నిన్నటి ట్రేడింగ్‌లో ఇంట్రాడేలో, ముగింపులోనూ కొత్త రికార్డులను నెలకొల్పిన నేపథ్యంలో నేడు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. రేపు రంజాన్ సందర్భంగా మార్కెట్‌కు సెలవు దినం కావడం, ఎల్లుండి రిజర్వ్ బ్యాంక్ కీలకవడ్డీ రేట్ల
భారీగా క్షీణించిన గూగుల్ మాతృసంస్థ షేరు
Tuesday 4th June 2019ఆల్ఫాబెట్ 6 శాతం పతనం! సోమవారం ట్రేడింగ్‌లో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేరు దాదాపు 6 శాతం నష్టంతో ముగిసింది. పోటీ ప్రమాణాల ఉల్లంఘనకు సంబంధించి గూగుల్‌పై యూఎస్ న్యాయ శాఖ విచారణ ఆరంభించవచ్చన్న ఊహాగానాలు షేరును దెబ్బతీశాయి. తాజా పతనంతో కంపెనీ మార్కెట్ క్యాప్ 5400 కోట్ల డాలర్ల మేర క్షీణించింది. 2011 తర్వాత కంపెనీ షేరు ఇంతలా పతనం కావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో ఫేస్బుక్ 7.5