News


సిమెంట్‌ షేర్లకు బడ్జెట్‌ బూస్ట్‌

Tuesday 4th February 2020
Markets_main1580810297.png-31503

సరికొత్త గరిష్టానికి శ్రీ సిమెంట్‌
ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి ప్రాధాన్యం

బడ్జెట్‌లో సిమెంట్‌ రంగానికి ప్రత్యేకించి ఎలాంటి ప్రతిపాదనలూ లేనప్పటికీ వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తాజాగా శ్రీ సిమెంట్‌ షేరు చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో అల్ట్రాటెక్‌సహా ఏసీసీ, అంబుజా సిమెంట్‌, జేకే తదితర సిమెంట్‌ కౌంటర్లు 2-5 శాతం మధ్య ఎగశాయి. ప్రధానంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్‌ రంగాలకు బడ్జెట్‌లో ఇచ్చిన ప్రాధాన్యత సిమెంట్‌ షేర్లపై సానుకూల ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం..

జోరుగా హుషారుగా
బడ్జెట్‌ ప్రతిపాదనల ద్వారా ఆదాయ పన్నులో గృహ రుణ వడ్డీ మినహాయింపును ఏడాదిపాటు పొడిగించారు. అందుబాటు ధరల హౌసింగ్‌ ప్రాజెక్టుల డెవలపర్లకు ఇస్తున్న పన్ను ప్రోత్సాహకాలనూ ఏడాదిపాటు పొడిగించారు. ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రాధాన్యమిస్తూ ప్రతిపాదనలు చేశారు. గ్రామీణాభివృద్ధికి నిధుల కేటాయింపు, రైతుల ఆదాయ పెంపు తదితర పలు చర్యలకు తెరతీశారు. దీంతో సిమెంటుకు ఇకపై డిమాండ్‌ పెరగనుందన్న అంచనాలు బలపడినట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. వెరసి శ్రీ సిమెంట్‌ ఇంట్రాడేలో దాదాపు 6 శాతం ఎగసింది. ఎన్‌ఎస్‌ఈలో రూ. 24,659 వద్ద సరికొత్త గరిష్టాన్ని చేరుకుంది. ఈ బాటలో అల్ట్రాటెక్‌, ఏసీసీ, అంబుజా, ఓరియంట్‌ సిమెంట్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌, దాల్మియా భారత్‌, హైడెల్‌బర్గ్‌, మంగళం సిమెంట్‌, జేకే సిమెంట్‌ తదితర కౌంటర్లు 2-5 శాతం మధ్య ఎగశాయి.



You may be interested

సెన్సెక్స్‌.. వండర్‌ఫుల్‌ ర్యాలీ

Tuesday 4th February 2020

917 పాయింట్ల హైజంప్‌ 40,789కు ఎగసిన సెన్సెక్స్‌ నిఫ్టీ 272 పాయింట్ల దూకుడు ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ ప్లస్‌ ఉన్నట్టుండి స్టాక్‌ బుల్‌ విరుచుకు పడింది. దీంతో రెండు రోజుల క్రితం కరోనా భయాలు, బడ్జెట్‌ నిరాశలతో కుప్పకూలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ ఏకంగా 917 పాయింట్లు దూసుకెళ్లింది. వెరసి బడ్జెట్‌ రోజు నష్టాలను పూడ్చేసుకుంది. సోమవారం సైతం 137 పాయింట్లు లాభపడటంతో సెన్సెక్స్‌ రెండు

ఈ 16 షేర్లకూ బడ్జెట్‌.. భారం?!

Tuesday 4th February 2020

రంగాల వారీ జాబితా ఇలా.. పొగాకు ఉత్పత్తులు, రైల్వేలు ఎరువులు, బీమా, రియల్టీ బడ్జెట్‌లో తాజా ప్రతిపాదనల కారణంగా 16 స్టాక్స్‌పై ప్రతికూల ప్రభావాలు పడే వీలున్నట్లు బ్రోకింగ్‌ సంస్థలు కొన్ని భావిస్తున్నాయి. పొగాకు ఉత్పత్తులు, రైల్వేలు, ఎరువులు, బీమా, రియల్‌ ఎస్టేట్‌ తదితర రంగాలు, కంపెనీలు ఈ జాబితాలో చోటుచేసుకున్నాయి. ప్రధానంగా వినియోగాన్ని పెంచే చర్యల ద్వారా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే అంశాలలో బడ్జెట్‌ నిరాశపరచినట్లు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ఈ సందర్భంగా పేర్కొంది.

Most from this category